India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పర్యావరణ మార్పుల ప్రభావంతో 2050 నాటికి ఏటా $38 ట్రిలియన్ల ఆర్థిక భారం పడనుందని జర్మనీకి చెందిన పాట్స్‌డ్యామ్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది. ‘ఉత్పాదకత క్షీణించడం సహా వ్యవసాయం, మౌలికవసతులు, ఆరోగ్య రంగాలు దెబ్బతింటాయి. 2050కి ప్రపంచ GDP 17% నష్టపోతుంది. దీనితో పోలిస్తే పర్యావరణ పరిరక్షణకు అయ్యే ఖర్చు ($6 ట్రిలియన్లు) తక్కువ. సత్వర చర్యలు చేపడితే నష్టాన్ని నివారించవచ్చు’ అని సూచించింది.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో 4వ విడతలో పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఈరోజు రానుంది. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను బరిలో దించాయి. ప్రచారం మొదలుపెట్టాయి. ఇరు రాష్ట్రాల్లోనూ ఎన్నికల పోరు ప్రాంతీయ పార్టీలుvsజాతీయ పార్టీలుగా మారనుంది. ఇప్పటికే తెలంగాణలో BRSను కాంగ్రెస్ ఓడించిన విషయం తెలిసిందే. BJP సైతం YCPని గద్దె దించేందుకు TDP, JSతో కలిసింది.
<<-se>>#ELECTIONS2024<<>>
APలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు తెలంగాణలోని 17పార్లమెంటు స్థానాలు, ఒక MLA స్థానంలో ఉప ఎన్నికకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 25 వరకు నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద దాఖలు చేసుకోవచ్చు. ఉ.11-మ.3గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆదివారం సెలవు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో తెలుగు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి.
☞ నోటిఫికేషన్ విడుదల- ఏప్రిల్ 18
☞ నామినేషన్ల స్వీకరణ ప్రారంభం- ఏప్రిల్ 18
☞ నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ- ఏప్రిల్ 25
☞ నామినేషన్ల స్క్రూటినీ- ఏప్రిల్ 26
☞ నామినేషన్ల ఉపసంహరణకు గడువు- ఏప్రిల్ 29
☞ పోలింగ్- మే 13
☞ ఓట్ల లెక్కింపు- జూన్ 4
☞ ఎన్నికల కోడ్ ముగింపు- జూన్ 6
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ భారత్‌లో $2-3 బిలియన్లు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నారట. భారత్ పర్యటన సందర్భంగా మస్క్ ఈ పెట్టుబడులపై వివరాలు వెల్లడించనున్నట్లు సమాచారం. ఈ మొత్తం దేశంలో టెస్లా ఫ్యాక్టరీ స్థాపనకు వినియోగించే అవకాశం ఉంది. ప్రధాని మోదీతో మస్క్ భేటీ అనంతరం దీనిపై క్లారిటీ రానుందట. అమెరికా, చైనాలో టెస్లాకు సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో భారత్‌లో మార్కెట్‌ను విస్తరించాలని మస్క్ భావిస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో మావోలు రెచ్చిపోయారు. ఫరస్‌గావ్ డిప్యూటీ సర్పంచ్, BJP కార్యకర్త పంచమ్ దాస్‌ను హతమార్చారు. పోలీసులకు సహకరిస్తున్నాడన్న నెపంతో అతడిని మంగళవారం హత్య చేశారు. కాంకేర్ ఆపరేషన్‌లో 29 మంది నక్సల్స్ హతమైన కొన్ని గంటలకే ఈ హత్య జరగడంతో ఇది ప్రతీకార చర్య కావొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా 2023 FEB నుంచి ఇప్పటివరకు 9 మంది BJP కార్యకర్తలను నక్సల్స్ హత్య చేశారు.
IPL ప్లేఆఫ్స్ బెర్తులను ఖరారు చేసే కీలక దశకు చేరుకుంది. దీంతో పాయింట్స్ టేబుల్‌లో అడుగున ఉన్న జట్లు ఎలాగైనా మ్యాచ్ గెలవాలనే పట్టుదలతో ఉన్నాయి. ఇందులో భాగంగా 8వ స్థానంలో ఉన్న పంజాబ్, 9వ స్థానంలోని ముంబైతో నేడు తలపడనుంది. ఇరు జట్లూ ఆరేసి మ్యాచులు ఆడి 2 గెలిచాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టమవుతాయి. హెడ్ టు హెడ్ రికార్డు 16-15 MIవైపే ఉంది.
2050 నాటికి ప్రపంచంలోని వృద్ధుల జనాభాలో 17% భారతీయులే ఉంటారని CBRE సంస్థ సర్వేలో వెల్లడించింది. ‘భారత్‌లో వృద్ధుల జనాభా 254% పెరగనుంది. 2050 నాటికి వీరి జనాభా 34కోట్లకు చేరుతుంది. అది ప్రపంచ జనాభాలో దాదాపు 17శాతం. దేశంలో రిటైర్మెంట్ హోమ్స్ కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దాదాపు 10లక్షలుగా ఉన్న సీనియర్ లివింగ్ ఫెసిలిటీల సంఖ్య మరో పదేళ్లలో 25లక్షలకు చేరుతుంది’ అని పేర్కొంది.
ఈ ఏడాది 80కిపైగా దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రతీనెలా ఏదో ఒక దేశంలో ఎన్నికలు ఉండటంతో 2024ను ‘ఎన్నికల సంవత్సరం’గా పిలుస్తుంటారు. అయితే ఈ ఎలక్షన్ ఇయర్‌పైనే IMF ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎన్నికల వేళ ప్రభుత్వాలు ఎక్కువగా ఖర్చు చేసేందుకు ప్రయత్నిస్తాయని పేర్కొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రుణ భారం మళ్లీ భారీగా పెరగొచ్చని హెచ్చరించింది. 2023లోనూ రెవెన్యూ తగ్గడంతో అప్పులు పెరిగాయని పేర్కొంది.
ఇజ్రాయెల్ దాడులతో చిన్నాభిన్నమైన గాజాకు సంబంధించి మరో విషాదకర విషయం వెలుగులోకి వచ్చింది. గాజాలోనే అతిపెద్ద ఫర్టిలిటీ క్లీనిక్‌పై 2023 డిసెంబరులో దాడి జరిగింది. ఈ ఘటనలో 4వేలకుపైగా పిండాలు, వెయ్యి స్పెర్మ్ శాంపిల్స్ ధ్వంసమయ్యాయి. జీవితం అస్తవ్యస్తమైన స్థానికుల్లో కొందరికి ఇది మరింత దుఃఖాన్ని మిగిల్చింది. పిల్లల కోసం ఆశ్రయించిన ఈ ఒక్క మార్గం కూడా విషాదకరం కావడాన్ని బాధితులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Sorry, no posts matched your criteria.