News April 18, 2024

పర్యావరణ మార్పు.. 2050 నాటికి ఏటా $38 ట్రిలియన్ల ఖర్చు?

image

పర్యావరణ మార్పుల ప్రభావంతో 2050 నాటికి ఏటా $38 ట్రిలియన్ల ఆర్థిక భారం పడనుందని జర్మనీకి చెందిన పాట్స్‌డ్యామ్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది. ‘ఉత్పాదకత క్షీణించడం సహా వ్యవసాయం, మౌలికవసతులు, ఆరోగ్య రంగాలు దెబ్బతింటాయి. 2050కి ప్రపంచ GDP 17% నష్టపోతుంది. దీనితో పోలిస్తే పర్యావరణ పరిరక్షణకు అయ్యే ఖర్చు ($6 ట్రిలియన్లు) తక్కువ. సత్వర చర్యలు చేపడితే నష్టాన్ని నివారించవచ్చు’ అని సూచించింది.

Similar News

News September 21, 2024

మద్యం ప్రియులకు గుడ్ న్యూస్

image

AP: ఎంఎన్‌సీ కంపెనీల మద్యం బ్రాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తీసుకొస్తోంది. మెక్‌డోవెల్స్, ఇంపీరియల్ బ్లూ బ్రాండ్ల మద్యం నిన్న రాష్ట్రానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న పాపులర్ బ్రాండ్లను త్వరలోనే తీసుకొస్తామని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. జానీవాకర్, వాట్ 69, యాంటిక్విటీ, రాయల్ ఛాలెంజ్, వోడ్కా, బ్లాక్ డాగ్ బ్రాండ్లు త్వరలోనే వస్తాయన్నారు.

News September 21, 2024

కొత్తదారులు వెతకడమే ‘బైడెన్, మోదీ మీటింగ్’ ఎజెండా

image

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, అభివృద్ధి, శ్రేయస్సు కోసం ఏర్పడిన కీలక దేశాల కూటమే క్వాడ్ అని PM మోదీ అన్నారు. అమెరికాకు బయల్దేరే ముందు ఆయన మాట్లాడారు. ‘క్వాడ్ సమ్మిట్లో ప్రెసిడెంట్ బైడెన్, PM అల్బనీస్, PM కిషిదాను కలిసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. ప్రపంచం మేలు, మన ప్రజల ప్రయోజనం కోసం IND-US అంతర్జాతీయ భాగస్వామ్యం మరింత బలోపేతానికి కొత్త మార్గాలను బైడెన్‌తో సమావేశంలో అన్వేషిస్తాం’ అని అన్నారు.

News September 21, 2024

తిన్న వెంటనే మళ్లీ ఆకలి అవుతోందా?

image

తిన్న వెంటనే మళ్లీ ఆకలిగా అనిపిస్తుందంటే దాని వెనుక నిర్దిష్ట కారణాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. కొన్ని వ్యాధుల వల్ల ఇలా అనిపిస్తుందని చెబుతున్నారు. యాంటీ సైకోటిక్ మందులు, స్టెరాయిడ్లు వాడినా, రాత్రి పూట నిద్రలేకపోయినా, ఒత్తిడికి గురైనా, మధుమేహం ఉన్నా శరీరం ఎక్కువ ఆహారం కోరుకుంటుంది. అలాగే సెక్స్ హార్మోన్లలో మార్పులు, ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గినా, కార్టిసాల్ పెరిగినా ఆహార కోరికలు పెరుగుతాయి.