news

News April 18, 2024

తిరువూరులో శ్రీనివాస్, స్వామిదాస్.. నెగ్గేదెవరో?

image

AP: ఎన్టీఆర్ జిల్లాలోని ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం తిరువూరు. గతంలో ఇక్కడ కాంగ్రెస్ 8సార్లు విజయకేతనం ఎగురవేయగా టీడీపీ నాలుగు సార్లు, వైసీపీ రెండు సార్లు, సీపీఐ ఒకసారి గెలుపొందాయి. ఇక్కడ అమరావతి రైతుల ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొలికపూడి శ్రీనివాస్‌ను టీడీపీ బరిలోకి దింపింది. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని.. గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లగట్ల స్వామిదాస్‌ని వైసీపీ పోటీ చేయిస్తోంది.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 18, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 18, 2024

ఎన్నికల వేళ జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర కలకలం

image

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అనంతనాగ్ జిల్లాలోని బిజ్‌బెహారా ప్రాంతంలో బిహార్‌కు చెందిన రాజా షా సహా మరో వ్యక్తిపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో షా ప్రాణాలు కోల్పోయాడు. కాగా గత వారం రంజిత్ సింగ్ అనే టూరిస్ట్ గైడ్‌పై ముష్కరులు దాడి చేయగా అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఈనెల 19న లోక్‌సభ తొలి విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ కాల్పులు జరగడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News April 18, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: ఏప్రిల్ 18, గురువారం ఫజర్: తెల్లవారుజామున గం.4:44 సూర్యోదయం: ఉదయం గం.5:58 జొహర్: మధ్యాహ్నం గం.12:15 అసర్: సాయంత్రం గం.4:42 మఘ్రిబ్: సాయంత్రం గం.6:33 ఇష: రాత్రి గం.07.47 నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News April 18, 2024

శుభ ముహూర్తం

image

తేది: ఏప్రిల్ 18, గురువారం చైత్రము శు.దశమి: సాయంత్రం: 05:31 గంటలకు ఆశ్లేష: మరుసటి రోజు ఉదయం 07:56 గంటలకు దుర్ముహూర్తం: ఉదయం 10:02 నుంచి 10:52 గంటల వరకు, తిరిగి ఉదయం 03.00 నుంచి 03.50 గంటల వరకు, వర్జ్యం: రాత్రి 09:26 నుంచి 11:14 గంటల వరకు

News April 18, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 18, 2024

TODAY HEADLINES

image

➣కాంగ్రెస్ ఉంటే మొబైల్ బిల్లు నెలకు రూ.5వేలు వచ్చేది: PM
➣AP:జగనాసుర వధ జరిపి.. రామరాజ్యం స్థాపిస్తాం: CBN
➣వైసీపీ నేతలను తన్ని తరిమేయండి: పవన్
➣TG:వచ్చే ఇరవై ఏళ్లు రాహులే ప్రధాని: సీఎం రేవంత్
➣ఎన్నికలు పూర్తయ్యాక హామీలు నెరవేరుస్తాం: మంత్రి కోమటిరెడ్డి
➣ధ్వంసమైన ఆలయాలన్నీ పునర్నిర్మిస్తాం: కిషన్ రెడ్డి
➣నేను పార్టీ మారుతా అనే వారిని చెప్పుతో కొడతా: హరీశ్ రావు
➣IPL:గుజరాత్‌పై ఢిల్లీ విజయం

News April 18, 2024

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: సచిన్ పైలట్

image

లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని BJP ఎక్కువ ఊహించుకుంటోందని రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ విమర్శించారు. బీజేపీ వాళ్లు చెప్పే మాటలకు వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉందని అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. కూటమి ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈవీఎంల టాంపరింగ్ లేకుండా ఎన్నికలు సజావుగా జరిగితే బీజేపీకి 180 సీట్లు కూడా రావని అంతకుముందు ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు.

News April 17, 2024

చరిత్ర సృష్టించిన ఢిల్లీ క్యాపిటల్స్

image

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చరిత్ర సృష్టించింది. గుజరాత్‌తో మ్యాచ్‌లో 67 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. దీంతో 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో బంతుల పరంగా ఢిల్లీకి ఇదే అతి పెద్ద విజయం. అంతకుముందు 2022లో పంజాబ్ కింగ్స్‌పై 57 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది. అలాగే ఈ సీజన్‌లో బంతులపరంగా అతి పెద్ద విజయంగా ఢిల్లీ రికార్డు నమోదు చేసింది.

News April 17, 2024

ఆజాద్ యూటర్న్.. లోక్‌సభ ఎన్నికలకు దూరం

image

తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని జమ్మూకశ్మీర్‌కు చెందిన డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ(DPAP) చీఫ్ గులాం నబీ ఆజాద్ వెల్లడించారు. ఆయన అనంతనాగ్- రాజౌరీ స్థానం నుంచి పోటీ చేస్తారని ఈ నెల 2న పార్టీ తెలిపింది. అయితే అనూహ్యంగా ఆజాద్ యూటర్న్ తీసుకుని పోటీ చేయడం లేదని తాజాగా ప్రకటించారు. ఇక్కడ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత మియాన్ అల్తాఫ్ పోటీలో ఉన్నారు.