India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో చక్ర వ్యవసాయం(QUICK CYCLE FARMING) ట్రెండ్ నడుస్తోంది. ఈ విధానంలో తక్కువ సమయంలో చేతికొచ్చే పంటలను సాగు చేస్తారు. నిపుణుల సూచనలతో అధిక దిగుబడినిచ్చే విత్తనాలను ఎన్నుకొని, సరైన యాజమాన్యం, నీటి పారుదల కల్పించి తక్కువ సమయంలో అధిక ఆదాయం పొందుతున్నారు. ఉల్లిపాయలు, పాలకూర, మెంతులు, కొత్తిమీర మొదలైనవి ఈ కోవలోకి వస్తాయి. శివానీ కూడా ఇలాగే కొత్తిమీరతో లాభాలు పొందారు.

ఈరోజు ప్రశ్న: రావణుడు సీతమ్మవారిని అపహరించినా, ఆమెను బలవంతంగా ముట్టుకోవడానికి ప్రయత్నించలేదు. ఎందుకు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

TG: సొంత నియోజకవర్గం కొడంగల్లో CM రేవంత్ ఇవాళ పర్యటించనున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ నిర్మించనునున్న గ్రీన్ ఫీల్డ్ కిచెన్కు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గంలోని 316 సర్కార్ స్కూళ్లలో హరే కృష్ణ మూవ్మెంట్ సంస్థ బ్రేక్ఫాస్ట్ అందిస్తోంది. అది సక్సెస్ కావడంతో ఇదే తరహాలో మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

AP: ఇవాళ్టి నుంచి రైతన్నా.. మీకోసం కార్యక్రమం సందర్భంగా సీఎం చంద్రబాబు అన్నదాతలకు లేఖ రాశారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఏటా 15% వృద్ధి రేటే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ‘రైతుల కోసం అన్నదాత సుఖీభవ, కిసాన్ డ్రోన్ సేవలు, బిందు సేద్యానికి సబ్సిడీతో పరికరాలు అందిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

మనిషి జీవనశైలిని నియంత్రించేది జీవ గడియారం. అంటే బయోలాజికల్ క్లాక్. రోజువారీ జీవితంలో నిద్ర, ఆకలి, జీర్ణక్రియ, జీవరసాయన ప్రక్రియలు సమయానికి జరిగేలా చూస్తుంది. అయితే దీంట్లో సమతుల్యత లోపిస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. శారీరకంగా, మానసికంగా క్రమంగా శక్తిహీనులుగా మారిపోతుంటే అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు.

TG: కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. రిటైల్ మార్కెట్లు, వారాంతపు సంతల్లో ఏ కూరగాయ అయినా కేజీ రూ.80 నుంచి రూ.120 పలుకుతోంది. తోటకూర కిలో రూ.90 వరకు అమ్ముతుండగా, పాలకూర రేటు రూ.160కి చేరింది. బీర, బెండ, కాకర, క్యాప్సికం, చిక్కుడు, వంకాయ రేట్లు గత 2 నెలలతో పోలిస్తే డబుల్ అయ్యాయి. తుఫాన్ ప్రభావంతో పంట నష్టం, దిగుబడి తగ్గడంతో కూరగాయల రేట్లు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

AP: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం నేటి నుంచి వారం పాటు ‘రైతన్నా.. మీకోసం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ ప్రోగ్రామ్లో భాగంగా CM CBNతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు అన్నదాతల ఇళ్ల వద్దకే వెళ్తారు. రైతుల కోసం ప్రభుత్వం ఏం చేసింది? ఏం చేయబోతోంది? అనేది వివరిస్తారు. పురుగుమందుల వాడకంతో నష్టాలు, నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, ఫుడ్ ప్రాసెసింగ్పై అవగాహన కల్పిస్తారు.

ఆడ గొర్రెలు ఏడాదిన్నర వయసు, 8-10 కిలోల బరువు.. పొట్టేలు రెండేళ్ల వయసు, 10- 15 కిలోల బరువు ఉండాలి. రైతుల మంద నుంచి గొర్రెలు కొనడం మంచిది. రెండు ఈతలకు మధ్య ఎక్కువ సమయం తీసుకునే గొర్రెలు వద్దు. చూడి, మొదటిసారి ఈనిన గొర్రెలను కొంటే మంద పెరిగే ఛాన్సుంది. విత్తనపు పొట్టేలు, బలంగా, ఎత్తుగా ఉండి.. ఎక్కువ పిల్లలకు జన్మనిచ్చే సామర్థ్యంతో ఉండాలి. మందలో ప్రతీ 30 ఆడ గొర్రెలకు ఒక విత్తనపు పొట్టేలు ఉండాలి.

శివపురాణం ప్రకారం.. లింగాన్ని పవిత్రమైన పూజా మందిరంలోనే స్థాపించాలని పండితులు సూచిస్తున్నారు. పూజించలేని, అశుభ్రమైన ప్రదేశాలలో లింగాన్ని ఉంచకూడదంటున్నారు. ‘శివలింగం ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉండాలి. అలాగే దాని బలిపీఠం (పానవట్టం) ముఖం ఎల్లప్పుడూ ఉత్తరం వైపుకే ఉండేలా ఏర్పాటు చేయాలి. ప్లాస్టిక్, POPలతో కాకుండా రాయి, మట్టి, లోహాలతో తయారుచేసిన శివలింగాలను పూజించాలి’ అని సూచిస్తున్నారు.

TG: పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కేసు ఇవాళ HCలో విచారణకు రానుంది. కోర్టు ఆదేశాలకు తగ్గట్లు ఎలక్షన్స్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, 50% రిజర్వేషన్లు మించకుండా GOలు ఇచ్చామని ప్రభుత్వం చెప్పనుంది. అటు పూర్తి ఏర్పాట్లు చేశామని, అధికారులు, సిబ్బంది సమాయత్తంపై ఎన్నికల సంఘం వివరించనుంది. నిన్నటి నుంచి గ్రామాలు, వార్డుల వారీగా రిజర్వేషన్లపై మండల ఆఫీసుల్లో లిస్టులను అధికారులు ప్రదర్శనకు ఉంచారు.
Sorry, no posts matched your criteria.