news

News April 14, 2024

మహిళా అభ్యర్థులు 165 మందే!

image

తొలిదశ ఎన్నికల పోలింగ్ ఈ నెల 19న జరగనుంది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాల్లో 1,625 మంది పోటీలో నిలిచారు. అయితే వీరిలో 165 మంది మాత్రమే మహిళా అభ్యర్థులున్నట్లు EC డేటా చెబుతోంది. 2019 ఎన్నికల్లో మొత్తం అభ్యర్థుల్లో మహిళల సంఖ్య 726గా ఉండగా.. వీరిలో 78 మంది లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాగా ఈసారి అత్యధికంగా తమిళనాడులో 76 మంది మహిళలు ఎన్నికల బరిలో నిలిచారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 14, 2024

గెలిచే వరకు చెప్పులు తొడగనన్న అభిమానికి జగ్గారెడ్డి హితబోధ

image

TG: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మళ్లీ గెలిచే వరకు చెప్పులు తొడుక్కోనని ఓ అభిమాని శపథం చేశారు. ఈ విషయం తెలుసుకున్న జగ్గారెడ్డి అతనికి హితబోధ చేశారు. ‘ఓడిపోయిన నేను, నా భార్య చెప్పులేసుకుని తిరుగుతున్నాం. నీకెందుకు అంత బాధ?. నీకు ఏదైనా జరిగితే నేను ఆస్పత్రి వరకే వస్తా.. డబ్బులు ఇస్తా. అంతేగానీ నీవెంట రాలేను కదా. అభిమానం మనసులో ఉంచుకోవాలిగానీ ఇలా చేయొద్దు’ అని చెప్పారు.

News April 14, 2024

IPL: టాస్ గెలిచిన కేకేఆర్

image

ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా, లక్నో మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకు ఎల్‌ఎస్‌జీపై కేకేఆర్ ఒక్క మ్యాచూ గెలవకపోవడం గమనార్హం.
కేకేఆర్ జట్టు: సాల్ట్, నరైన్, రఘువంశీ, వెంకటేశ్, శ్రేయస్, రమణ్‌దీప్, రస్సెల్, హర్షిత్, స్టార్క్, వైభవ్, వరుణ్
లక్నో జట్టు: డికాక్, రాహుల్, స్టొయినిస్, పూరన్, హుడా, క్రునాల్, బదోని, బిష్ణోయ్, మొహ్సీన్, షమార్, యశ్ థాకూర్

News April 14, 2024

కొత్తపేట.. కోరుకునేదెవరిని?

image

AP: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేటలో పాత ప్రత్యర్థుల మధ్యే కొత్త పోరు జరగనుంది. చిర్ల జగ్గిరెడ్డి(YCP) హ్యాట్రిక్‌పై ధీమాతో ఉండగా, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం, టీడీపీ హామీలు కలిసొస్తాయని బండారు సత్యానందరావు భావిస్తున్నారు. 7సార్లు INC, 4సార్లు TDP, 2సార్లు YCP, జనతాపార్టీ, PRP చెరోసారి గెలిచాయి. ఇక్కడ 1999 తర్వాత టీడీపీ గెలవకపోవడం గమనార్హం.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 14, 2024

శ్రీవల్లి 2.0ను చూస్తారు: రష్మిక

image

పుష్ప-2లో తన పాత్రపై హీరోయిన్ రష్మిక కీలక వ్యాఖ్యలు చేశారు. సవాళ్లతో కూడుకున్నప్పటికీ శ్రీవల్లి పాత్రను ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపారు. సీక్వెల్‌లో తన పాత్ర మరింత బలంగా ఉంటుందని.. శ్రీవల్లి 2.0ని చూస్తారన్నారు. అయితే తన పాత్ర గురించి రివీల్ చేయలేనని అన్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన రష్మిక లుక్ తెగ వైరల్ అయింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది.

News April 14, 2024

అంబేడ్కర్‌కు ప్రముఖుల నివాళులు

image

TG: డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రముఖులు ఆయనకు ఘన నివాళులర్పించారు. ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్ విగ్రహానికి సీఎం రేవంత్ పూలమాలలు వేశారు. ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన జయంతి వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాలుపంచుకున్నారు. గాంధీతో పోల్చి చూడదగిన నేత అంబేడ్కర్‌ అని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.

News April 14, 2024

ప్రజల ఖాతాల్లో వేస్తామన్న రూ.15 లక్షలు ఏమయ్యాయి?: పొన్నం

image

TG: NDA పాలనలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. కాంగ్రెస్ గ్యారంటీల గురించి ప్రశ్నిస్తున్న BJP నేతలు.. పదేళ్లలో ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలన్నారు. ప్రజల అకౌంట్లలో వేస్తామన్న రూ.15 లక్షలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాముడి ఫొటోతో కాదు.. రాష్ట్రానికి ఏమిచ్చారో చెప్పి ఓట్లడగాలని సవాల్ విసిరారు. ప్రకృతి వైపరీత్యాలు, కరవుతో నష్టపోయిన రైతులను ఎందుకు ఆదుకోలేదని నిలదీశారు.

News April 14, 2024

OTTలోకి కొత్త సినిమా.. ఎప్పుడంటే?

image

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ది ఫ్యామిలీ స్టార్ మూవీ OTT స్ట్రీమింగ్ ఖరారైనట్లు తెలుస్తోంది. మే 3 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఈ నెల 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకోగా.. OTTలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి మరి.

News April 14, 2024

ఇరాన్‌కు ఘోర పరాభవం

image

ఇజ్రాయెల్‌పై ఇరాన్ భీకర దాడులతో రెచ్చిపోతోంది. కానీ యూఎస్, యూకే, ఫ్రాన్స్, జోర్డాన్ దళాలు వీటిని అడ్డుకుంటున్నాయి. ఇప్పటివరకు ఇరాన్ దాదాపు 185 డ్రోన్లు, 110 బాలిస్టిక్ మిస్సైల్స్, 36 క్రూయిజ్ మిస్సైల్స్ ప్రయోగించగా.. వాటన్నింటినీ దళాలు కూల్చివేశాయి. మధ్యధరా సముద్రంలోని యుద్ధనౌకలు వీటిని అడ్డుకున్నాయి. దీంతో ఇరాన్‌కు ఘోర పరాభవం తప్పలేదు. కాగా తాజాగా ఇజ్రాయెల్‌కు ఆస్ట్రేలియా మద్దతు తెలిపింది.

News April 14, 2024

నేను బాగానే ఉన్నా.. ఆందోళన వద్దు: షిండే

image

తన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని నటుడు షాయాజీ షిండే ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఆయన ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. గుండెలో సమస్య ఉన్నట్లు గుర్తించిన వైద్యులు వెంటనే యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని, అభిమానులు ఆందోళన చెందవద్దని షిండే కోరారు. మహారాష్ట్రకు చెందిన ఆయన, తెలుగులో పలు సినిమాలు చేసి పేరు తెచ్చుకున్నారు.