India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఇరాన్‌కు 6.1 లక్షలు, ఇజ్రాయెల్‌కు 1.7 లక్షల సైన్యం ఉంది. ఇరాన్‌కు 551, ఇజ్రాయెల్‌కు 612 యుద్ధవిమానాలు ఉన్నాయి. ఇరాన్‌కు 186, ఇజ్రాయెల్‌కు 241 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఇరాన్‌కు 13, ఇజ్రాయెల్‌కు 48 హెలికాప్టర్లు ఉన్నాయి. ఇరాన్‌కు 1996, ఇజ్రాయెల్‌కు 1,370 యుద్ధ ట్యాంకర్లు ఉన్నాయి. ఇరాన్‌కు 19, ఇజ్రాయెల్‌కు 5 సబ్‌మెరైన్లు ఉన్నాయి.
ఇవాళ ఉదయం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి బయట గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. <<13048942>>ఘటన<<>> సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. దుండగుల కాల్పుల్లో ఓ బుల్లెట్ మొదటి అంతస్తులోకి దూసుకెళ్లినట్లు సమాచారం. అదృష్టవశాత్తు తమ అభిమాన హీరోకు ఏమీ కాలేదని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. కాగా గత ఏడాది సల్మాన్‌కు బెదిరింపులు పెరిగిన నేపథ్యంలో ఆయనకు Yప్లస్ భద్రతను కల్పించారు.
పంజాబ్‌పై గెలుపుతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం మరింత పదిలం చేసుకుంది. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడి ఐదు గెలిచింది. రెండో స్థానంలో కేకేఆర్, మూడో స్థానంలో చెన్నై, నాలుగో స్థానంలో లక్నో ఉన్నాయి. చెరో 6 పాయింట్లతో హైదరాబాద్, గుజరాత్ ఐదారు స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో తలో 4 పాయింట్లతో ముంబై, ఢిల్లీ, పంజాబ్ నిలిచాయి. RCB ఒకే ఒక్క విజయం సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.
AP: వైఎస్ జగన్‌పై నిన్న రాత్రి జరిగిన దాడి విషయంలో నాగబాబు ‘<<13049121>>చాలా పకడ్బందీగా ప్లాన్ చేశావు మైక్<<>>’ అంటూ ఓ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఆ ట్వీట్‌ను ఆయన తొలగించడం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. దాని స్థానంలో దాడిని ఖండిస్తున్న ట్వీట్‌ను ఆయన పోస్ట్ చేశారు. భౌతిక దాడులు అప్రజాస్వామికమని, వెంటనే దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
బీజేపీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. పెట్రోల్ ధరలు తగ్గిస్తామన్నారు. 6జీ టెక్నాలజీ అమలుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఆటోమొబైల్, సెమీ కండక్టర్, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, ఎలక్ట్రానిక్ హబ్‌గా భారత్ అవతరించేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దుతామని మోదీ వెల్లడించారు.
నిన్న సీఎం జగన్‌పై దాడి ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనాస్థలంలో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. డ్రోన్లతో ఏరియల్ వ్యూ ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే అక్కడి CCTV ఫుటేజీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దాడికి ఎయిర్‌గన్ ఉపయోగించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇంటెలిజెన్స్ డీజీ.. జగన్ బస చేస్తున్న కేసరపల్లి క్యాంప్ వద్దకు వెళ్లి కలిశారు.
★ 64 సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీలు సాధించారు. 9 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు
★ డాక్టరేట్ సాధించిన తొలి భారతీయుడిగా గుర్తింపు
★ ‘వెయిటింగ్ ఫర్ వీసా’ పేరుతో ఆయన రాసిన ఆటో బయోగ్రఫీని కొలంబియా యూనివర్సిటీలో పాఠ్యపుస్తకంగా వినియోగిస్తున్నారు
★ భీమ్‌రావు అంబేడ్కర్ అసలు ఇంటిపేరు అంబావడేకర్
★ లండన్ మ్యూజియంలో కార్ల్‌మార్క్స్ విగ్రహంతోపాటు ఏర్పాటు చేసిన ఏకైక భారతీయుడి విగ్రహం అంబేడ్కర్‌దే
వరుస ఓటములతో డీలాపడ్డ పంజాబ్ కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. గాయం కారణంగా కెప్టెన్ శిఖర్ ధవన్ మరో 3 మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం. గాయం తీవ్రత తగ్గకపోవడంతో మరో 10 రోజులు ఆయన విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గబ్బర్ స్థానంలో సామ్ కరన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. కాగా పంజాబ్ ఈ సీజన్‌లో 6 మ్యాచ్‌లు ఆడి రెండింట్లో గెలుపొంది నాలుగింటిలో ఓటమి పాలైంది.
AP: సీఎం వైఎస్ జగన్‌పై నిన్న జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందీశ్వరి ఓ ప్రకటనలో తెలిపారు. దాడిని హేయమైన చర్యగా అభివర్ణించారు. ‘ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. కాగా.. ప్రధాని మోదీ ఇప్పటికే జగన్‌కు సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే.
చీలమండ గాయంతో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ మిచెల్ మార్ష్ స్వదేశానికి వెళ్లారు. ఏప్రిల్ 3న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ అతడు ఆ తర్వాత ముంబై, లక్నో మ్యాచ్‌లకు దూరమయ్యారు. ఈ క్రమంలో మార్ష్ మిగిలిన మ్యాచ్‌లు ఆడటం సందేహమే. మరోవైపు ఆ టీమ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వేలి గాయంతో బాధపడుతున్నారు. దీంతో బుధవారం గుజరాత్‌తో మ్యాచ్‌లో ఆడేది అనుమానంగా మారింది.
Sorry, no posts matched your criteria.