news

News April 14, 2024

మళ్లీ పెరగనున్న ఎండలు

image

TG: కొన్ని రోజులుగా వాతావరణం చల్లబడటంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. అయితే ఇవాళ్టి నుంచి బుధవారం వరకు మళ్లీ పొడి వాతావరణం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. నాలుగు రోజులు మళ్లీ ఎండలు పెరగనున్నాయని పేర్కొంది. 18, 19న కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది.

News April 14, 2024

కాంగ్రెస్‌తో పొత్తు లేదు: ఒవైసీ

image

TG: ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. MP ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు లేదని స్పష్టం చేశారు. తాము ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. కాంగ్రెస్, BJPలతో దేశానికి ఒరిగేదేమీ లేదని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో MIMకు విజయం ఖాయమన్నారు. కాంగ్రెస్ ఇంకా హైదరాబాద్ MP అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో ఇరు పార్టీల మధ్య పొత్తు ఉందనే ప్రచారం నేపథ్యంలో ఒవైసీ క్లారిటీ ఇచ్చారు.

News April 14, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం?

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రణీత్ రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ డేటా బ్యాకప్ ఆయన దగ్గర ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయడానికి ముందు పెన్‌డ్రైవ్‌లు, ఫ్లాష్‌డ్రైవ్‌లు, ఎక్స్‌టర్నల్ హార్డ్ డిస్క్‌లలో బ్యాకప్ తీసుకున్నట్లు సమాచారం. ఆ బ్యాకప్ లభిస్తే నిందితులందరికీ శిక్ష పడే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

News April 14, 2024

BREAKING: సీఎంపై దాడి.. ఈసీ కీలక ఆదేశాలు

image

ఏపీ సీఎం జగన్‌పై దాడి ఘటనపై ఈసీ ఆరా తీసింది. విజయవాడ సీపీ కాంతి రాణాకి ఎన్నికల ప్రధానాధికారి ఫోన్ చేశారు. రేపటిలోగా ఘటనపై నివేదిక పంపాలని ఆదేశించారు. దాడికి పాల్పడ్డవారిని త్వరగా గుర్తించాలన్నారు. మరోవైపు సీఎం జగన్‌పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనాస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. పలువురు అనుమానితులను విచారిస్తున్నారు.

News April 14, 2024

అకాల వర్షాలతో రైతులకు దెబ్బ

image

TG: అకాల వర్షాలు రైతన్నలను నిండా ముంచుతున్నాయి. నిన్న నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, ములుగు, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురిశాయి. దీంతో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. మరోవైపు పలు చోట్ల మార్కెట్ యార్డుల్లో షెడ్లు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సరైన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. పలు చోట్ల మద్దతు ధరకు పంట కొనుగోలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News April 14, 2024

ఏడాదిలో రూ.10వేల మార్క్ అందుకున్న షేర్లు ఇవే!

image

గత ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు ఎనిమిది సంస్థల షేర్లు రూ.10వేల మార్క్ అందుకున్నాయి. 2023 జూన్‌లో డిసా ఇండియా, వెంట్ ఇండియా, కేసీ ఇండస్ట్రీస్ రూ.10వేల మార్క్ చేరుకోగా ఆగస్టులో మారుతీ సుజుకీ, డిసెంబరులో అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు ఆ మైలురాయిని తాకాయి. ఈ జాబితాలో ప్రస్తుతం రూ.18,416తో కేసీ ఇండస్ట్రీస్‌ షేర్ టాప్‌లో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో డిసా ఇండియా (రూ.13,850), మారుతీ సుజుకీ (రూ.12,274) ఉన్నాయి.

News April 14, 2024

2 చేపల ధర రూ.4 లక్షలు

image

AP: అంతర్వేది సముద్ర తీరంలో కృష్ణా జిల్లా మత్స్యకారులకు అరుదైన కచ్చిడీ చేపలు చిక్కాయి. వాటిని కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌లో వేలం వేశారు. ఓ వ్యాపారి రెండు చేపలకు రూ.4 లక్షలు చెల్లించి కొనుగోలు చేశాడు. ఈ చేపల్లో ఉండే తెల్లటి బ్లాడర్(మావ్)ను ఔషధాలకు పొరలా, శస్త్రచికిత్సలో కుట్లు వేసే దారంలా వాడతారని.. అందుకే వీటికి భారీ డిమాండ్ ఉంటుందని మత్స్యకారులు తెలిపారు.

News April 14, 2024

IPL: ఇవాళ డబుల్ ధమాకా

image

ఆదివారం కావడంతో ఇవాళ IPLలో రెండు మ్యాచులు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతాతో లక్నో తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు వాంఖడే స్టేడియంలో చెన్నైని ముంబై ఢీకొట్టనుంది. ఈ మ్యాచు కోసం ధోనీ, రోహిత్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక పాయింట్ల పట్టికలో కోల్‌కతా 2, చెన్నై 3, లక్నో 4, ముంబై 7వ స్థానంలో ఉన్నాయి.

News April 14, 2024

రాష్ట్రంలో తీవ్ర వడగాల్పులు

image

AP: రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత పెరగనుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ 151 మండలాల్లో మోస్తరుగా.. 18 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని అంచనా వేసింది. రేపు 135 మండలాల్లో స్వల్పంగా.. 33 మండలాల్లో తీవ్రంగా వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. ఇవాళ కోస్తా, రాయలసీమల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. మూడు రోజుల పాటు ఇదే కొనసాగుతుందని అంచనా వేసింది.

News April 14, 2024

దేశంలోనే తొలిసారి.. ఏఐతో కణుతుల తొలగింపు!

image

TG: ఏఐ, ఆగ్మెంటెడ్ రియాలిటీతో నడిచే పరికరంతో మెదడులో కణుతుల తొలగింపు సులభం అయిందన్నారు కిమ్స్ వైద్యులు. దేశంలోనే తొలిసారిగా 18 శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించామన్నారు. పాతపద్ధతిలో శస్త్రచికిత్సకు కనీసం 4-5 గంటలు పట్టేదని, కొత్త విధానం ద్వారా గంటలో సర్జరీ పూర్తవుతోందన్నారు. ఆపరేషన్ టైమ్ తగ్గడంతో రోగి త్వరగా కోలుకోవడమే కాక వారి ఖర్చులూ తగ్గనున్నాయని పేర్కొన్నారు.