India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొత్త ఓట్ల నమోదుకు ECI విధించిన గడువు మరో 3 రోజుల్లో ముగియనుంది. ఓటర్ లిస్టులో పేరు లేని 18+ వారంతా ఈనెల 15లోగా ఓటు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. <
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం జీవించిన(62 ఏళ్ల 202 రోజులు) అవిభక్త మహిళా కవలలు లోరీ, జార్జ్ షాపెల్(డోరీ) కన్నుమూశారు. అమెరికాలోని పెన్సిల్వేనియా వర్సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. వీరి మరణానికి కారణాలు తెలియరాలేదు. 1961లో జన్మించిన వీరికి శరీరాలు వేరుగా ఉన్నా.. పుర్రెలు మాత్రం కలిసిపోయాయి. వెన్నుముక సమస్య వల్ల నడక సాధ్యం కాకపోవడంతో వీరు కుర్చీలోనే జీవనాన్ని సాగించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల యుద్ధానికి నెల రోజులే సమయం ఉంది. వచ్చే నెల ఇదే రోజున పోలింగ్ జరగనుంది. ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 29తో ఉపసంహరణ గడువు ముగియనుంది. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో నేతలు ప్రచారంలో స్పీడ్ పెంచుతున్నారు. పార్టీల అధినేతలు బస్సు యాత్రలు, సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గ్రామాల్లో ఎక్కడచూసినా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.
AP: దేవదాయ శాఖ సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించడంపై BJP రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఆ శాఖ ఉద్యోగులెప్పుడూ ఎన్నికల విధుల్లో పాల్గొనలేదు. ఏప్రిల్, మే, జూన్‌లో అనేక పండుగలు ఉన్నాయి. వేసవి సెలవుల్లో ఆలయాలకు వచ్చేవారి సంఖ్య ఎక్కువ. ఆలయ సిబ్బంది లేకపోతే భక్తులు ఇబ్బందులు పడతారు. అందువల్ల వీరికి ఎన్నికల విధులపై పునఃపరిశీలన చేయండి’ అని EC, CEOకు లేఖ రాశారు.
TG: రాష్ట్రంలో ప్రైవేటు ఇంటర్ కాలేజీలు ఇష్టారీతిన ఫీజులు పెంచుతున్నాయి. గతేడాదితో పోల్చితే ఫీజులు రెట్టింపయ్యాయి. కార్పొరేట్ కాలేజీలు డేస్కాలర్‌కు రూ.2.25లక్షలు విధిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ గతేడాది రూ.40వేలు ఉండగా.. రూ.70వేలకు చేరింది. దీంతో పిల్లలను చదివించేదెలాగని సామాన్యులు ఆవేదన చెందుతున్నారు. నిర్వహణ ఖర్చు, లెక్చరర్ల జీతాలు పెరగడంతో ఫీజులు పెంచాల్సి వస్తోందని యాజమాన్యాలు అంటున్నాయి.
ఇద్దరిని ఒక్కటి చేసే ఎంగేజ్మెంట్ రింగ్స్ అంటే మనందరికీ తెలుసు. కానీ మీరెప్పుడైనా విడిపోయే రింగ్స్ గురించి విన్నారా? అమెరికన్ మోడల్ ఎమిలీ రతాజ్‌కోవ్‌స్కిహాస్ ‘డివోర్స్ రింగ్స్’ చూపిస్తూ సోషల్ మీడియాలో విడాకులు ప్రకటించారు. దీంతో ఇవి ట్రెండ్ అవుతున్నాయి. అయితే.. ఇంతకుముందే ఇవి వెస్టర్న్ దేశాల్లో పాపులర్. న్యూయార్క్‌లోని జువెల్లరీ షాపులు 3ఏళ్లుగా డివోర్స్ రింగ్స్, బ్రేకప్ రింగ్స్ తయారు చేస్తున్నాయి
ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. సినిమా హిట్ లేదా ప్లాప్‌తో సంబంధం లేకుండా చాలా చిత్రాలను థియేటర్లలో విడుదల చేస్తున్నారు. నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ మూవీ సినిమా విడుదలై ఐదేళ్లు కావొస్తున్న నేపథ్యంలో ప్రత్యేక షోలు వేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. నాని కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాల్లో ‘జెర్సీ’ ఒకటి. ఈ నెల 20న ఎంపిక చేసిన థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.
ఇ-కామర్స్ కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై బోర్న్‌విటాతోపాటు అన్ని రకాల పానీయాలను ‘హెల్త్ డ్రింక్స్’ కేటగిరీ నుంచి తొలగించాలని స్పష్టం చేసింది. బోర్న్‌విటాలో పరిమితికి మించి షుగర్ లెవల్స్ ఉన్నట్లు NCPCR పరిశోధనలో తేలింది. ఆహార భద్రతా ప్రమాణాలను పాటించకుండా పవర్ సప్లిమెంట్లను హెల్త్ డ్రింక్స్‌గా ప్రచారం చేసుకుంటోన్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని FSSAIని NCPCR ఇటీవల కోరింది.
ఆటోల వెనుక సినిమాల పేర్లు, హీరోల ఫొటోలు, లవ్ కొటేషన్లు తరచూ చూస్తుంటాం. అయితే HYDలో ఓ వ్యక్తి తన ఆటో వెనుక ముద్రించిన కొటేషన్ అందరినీ ఆలోచింపజేస్తోంది. ‘ఎప్పుడైనా చిన్న పిల్లలు వర్షం ఎక్కడి నుంచి వస్తుందని అడిగితే దేవుడు కురిపిస్తాడని కాకుండా.. మనం ఒక మొక్క నాటితేనే ఒక చుక్క వర్షం పడుతుందని చెప్పండి’ అని రాశారు. దాని పక్కన చిగురిస్తున్న చెట్టు బొమ్మను వేసి ప్రకృతి పట్ల మన బాధ్యతను గుర్తు చేశారు.
వేసవిలో ఎండ తాపం తట్టుకోవాలంటే మజ్జిగ ఎక్కువ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. చల్లని మజ్జిగ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. వడదెబ్బ బారిన పడకుండా ఉండొచ్చు. మజ్జిగ వల్ల గ్యాస్, ఎసిడిటీ సమస్యలు తొలగుతాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది. కొన్ని రకాల జబ్బులను కూడా మజ్జిగ నియంత్రిస్తుంది. ఎముకలు దృఢంగా మారతాయి. మజ్జిగ తాగడం వల్ల చర్మం కాంతివంతంగా, మృదువుగా, ప్రకాశవంతంగా తయారవుతుంది.
Sorry, no posts matched your criteria.