news

News April 12, 2024

లై డిటెక్టర్, నార్కో టెస్ట్‌కి సిద్ధం: కేటీఆర్

image

TG: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన ప్రమేయం లేదన్న కేటీఆర్.. లై డిటెక్టర్, నార్కో టెస్ట్‌కైనా సిద్ధమన్నారు. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్‌ల ఫోన్‌లు ట్యాప్ చేయడం లేదని CM రేవంత్ చెప్పగలరా? ప్రతిపక్షాల ఫోన్‌లను కేంద్రం ట్యాప్ చేస్తోంది. కిషన్ రెడ్డి, రేవంత్‌లకు లై డిటెక్టర్ టెస్ట్‌ తీసుకునే ధైర్యం ఉందా’ అని సవాల్ విసిరారు.

News April 12, 2024

ఘోరం: తిండి పెట్టలేక భార్య, ఏడుగురు పిల్లలను చంపేశాడు

image

పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. సజ్జాద్ ఖోఖర్ అనే కూలీ తన భార్య కౌసర్, ఏడుగురు పిల్లలను గొడ్డలితో నరికి చంపేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి ప్రశ్నించగా, తన భార్య, పిల్లలకు తిండి పెట్టలేకే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు వెల్లడించాడు. ఈ ఘటన సంచలనంగా మారడంతో పంజాబ్ ప్రావిన్స్ సీఎం మరియం నవాజ్ సంతాపం వ్యక్తం చేశారు. కాగా పాక్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

News April 12, 2024

పొరపాట్లు చేశాం.. సరిదిద్దుకుంటాం: KTR

image

TG: రాష్ట్ర రాజకీయాలు మరో దశాబ్దం పాటు KCR చుట్టూనే తిరుగుతాయని KTR విశ్వాసం వ్యక్తం చేశారు. ’20 ఏళ్లుగా KCR చుట్టూనే రాష్ట్ర రాజకీయాలు నడిచాయి. మా ప్రభుత్వంలో తెలంగాణను నం.1గా నిలబెట్టాం. అధికారంలో కొన్ని పొరపాట్లు చేశాం. సరిదిద్దుకుంటాం. రైతుబంధు, దళితబంధు, కార్యకర్తల విషయంలో పొరపాట్లు గుర్తించలేకపోయాం. స్వల్ప తేడాతోనే ఓడిపోయాం. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా విజయం సాధిస్తాం’ అని వెల్లడించారు.

News April 12, 2024

మూడు పెళ్లిళ్లు అంటూ పూనమ్ కౌర్ కౌంటర్

image

వైసీపీ నేత ట్వీట్‌కు నటి పూనమ్ కౌర్ ఇచ్చిన కౌంటర్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ప్రదీప్ రెడ్డి అనే వైసీపీ నాయకుడు ‘నేను టెస్లా కారు వాడుతున్నా. ట్విటర్‌లోనూ యాక్టివ్‌గా ఉంటా. ఈ రెండూ నా జీవితంలో భాగం. ఏపీలో టెస్లా బ్రాంచ్ పెట్టండి’ అంటూ ఎలాన్ మస్క్‌ను ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. దీనిని రీట్వీట్ చేసిన పూనమ్ కౌర్ ‘అతడికి మూడు పెళ్లిళ్లు అయ్యాయి. అయినా పర్వాలేదా’ అంటూ కౌంటర్ ఇచ్చారు.

News April 12, 2024

అప్పట్లో కమ్యూనిస్టుల హవా!.. 1/2

image

AP: ప్రస్తుతం ఉనికి కోసం ప్రయత్నిస్తున్న కమ్యూనిస్టులు ఒకప్పుడు హంగ్ ఏర్పడేలా సీట్లు సాధించి ప్రభంజనం సృష్టించారు. స్వాతంత్ర్యం అనంతరం 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఆంధ్రా ప్రాంతంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ 41, కాంగ్రెస్ 40 స్థానాల్లో గెలిచాయి. అప్పటికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడలేదు.. సంయుక్త మద్రాసులో భాగంగా ఉండేది. అయితే ప్రకాశం పంతులు నేతృత్వంలోని KMPP సాయంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 12, 2024

అప్పట్లో కమ్యూనిస్టుల హవా!.. 2/2

image

AP: కోస్తా, రాయలసీమ ప్రాంతాలు కలిపి ఆంధ్రరాష్ట్ర అవతరణతో 1955లో మధ్యంతర ఎన్నికలు జరగ్గా భారత కమ్యూనిస్ట్ పార్టీ 15 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ 119 చోట్ల గెలిచింది. 1956లో ఆంధ్రా, TG కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆ తర్వాత 1962 ఎన్నికల్లో CONG 177 స్థానాల్లో నెగ్గగా, సీపీఐ 53 సీట్లు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. 1964లో పార్టీలో చీలిక రాగా CPIకి 31, CPMకి 22 మంది MLAలు మిగిలారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 12, 2024

BIG ALERT.. ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ADB, ASF, నిర్మల్, NZB, JGTL, SRPT, MHBD, యాదాద్రి, RR, HYD, మేడ్చల్, VKB, SRD, MDK, KMRD జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, సిరిసిల్ల, భద్రాద్రి, KMM, NLG, WGL, JN, సిద్దిపేట, వనపర్తి, MBNRలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News April 12, 2024

ఉద్యోగుల వయో పరిమితిపై ప్రభుత్వ వర్గాల క్లారిటీ

image

TG: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని ’61 ఏళ్లు లేదా 33 ఏళ్ల సర్వీసు’కు కుదించారంటూ వస్తున్న వార్తలపై అధికార వర్గాలు స్పందించాయి. ‘ఈ వార్తల్లో నిజం లేదు. ఈ అంశంపై ప్రభుత్వ స్థాయిలో ఏ విధమైన ప్రతిపాదన కానీ, ఫైల్ కానీ రాలేదు. ఈ విధమైన ఊహాజనిత వార్తలు రాయడం, సోషల్ మీడియాలో ప్రసారం చేయడం సరైంది కాదు. ఇలాంటి అవాస్తవాలపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించాయి.

News April 12, 2024

జగన్ హంతకులను కాపాడుతున్నారు: షర్మిల

image

AP: జగన్ జైలుకు వెళ్తే 3200KM తాను పాదయాత్ర చేశానని షర్మిల వెల్లడించారు. పులివెందుల పూల అంగళ్లు సెంటర్‌లో కాంగ్రెస్ న్యాయయాత్రలో మాట్లాడిన ఆమె.. ‘రాముడికి లక్ష్మణుడు ఎలాగో.. వైఎస్‌కు వివేకా అలాగే. అలాంటి నేతను చంపితే ఐదేళ్లయినా న్యాయం జరగలేదు. అధికారం ఉపయోగించి జగన్ హంతకులను కాపాడుతున్నారు. CBI సాక్ష్యాధారాలు బయటపెట్టింది. నేను ఎవరికీ భయపడను. పులి కడుపున పులే పుడుతుంది.’ అని స్పష్టం చేశారు.

News April 12, 2024

టీసీఎస్ గుడ్‌న్యూస్.. వారికి డబుల్ ఇంక్రిమెంట్

image

దేశీయ అతిపెద్ద ఐటీ కంపెనీ TCS లాభాలతో ఫుల్ జోష్‌లో ఉంది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 9.1% వృద్ధితో రూ.12,434 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. మొత్తం ఆర్థిక సంవత్సరం(2023-24)లో రూ.45,908 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఈ మేరకు మెరుగైన పనితీరు కనబర్చిన ఉద్యోగులకు డబుల్ ఇంక్రిమెంట్ ఇస్తామని కంపెనీ చీఫ్ హెచ్‌ఆర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. కాగా ప్రస్తుతం TCSలో 6.01లక్షల మంది పని చేస్తున్నారు.