India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వివేకా హత్య కేసుపై నాంపల్లి CBI కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. వ్యక్తిగత హాజరుపై MP అవినాశ్, దస్తగిరి మినహాయింపు తీసుకోగా మిగతా ఐదుగురు నిందితులు కోర్టులో హాజరయ్యారు. ఈ కేసులో తనను సాక్షిగా పరిగణించాలని దస్తగిరి వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. దస్తగిరిని సాక్షిగా పరిగణించేందుకు తమకు అభ్యంతరం లేదని CBI తెలిపింది. దీనిపై వాదనలు పూర్తి కాగా తీర్పును ఈ నెల 29వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
టీమ్ ఇండియా తరఫున ఆడుతున్న ఏకైక తెలుగు ప్లేయర్ మహ్మద్ సిరాజ్ IPLలో పేలవ ప్రదర్శన చేస్తున్నారు. అతడి గణాంకాలు చూసి ఫ్యాన్స్ నిట్టూరుస్తున్నారు. సిరాజ్ దారుణ ప్రదర్శన చూసి నిరాశ చెందుతున్నారు. ఈ IPLలో 6 మ్యాచ్‌లు ఆడి 4 వికెట్లే తీశారు. మరోవైపు పరుగులు కూడా ధారాళంగా ఇచ్చేస్తున్నారు. ఇకనైనా సిరాజ్ తిరిగి తన ఫామ్ అందుకుంటే మంచిదని.. లేదంటే T20 WCలో చోటు కష్టమేనని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
భారత అల్ట్రా మారథాన్ రన్నర్ సుమిత్ సింగ్ గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఒడిశాకు చెందిన అతడు ట్రెడ్ మిల్‌పై ఏకంగా 12 గంటల పాటు ఆపకుండా పరుగెత్తి ఈ ఘనత సాధించారు. మార్చి 12న ఉదయం 8.15 గంటలకు పరుగు ప్రారంభించి రాత్రి 8.20 గంటల వరకు కొనసాగించారు. మొత్తంగా 68.04 కిలోమీటర్లు పరుగెత్తడంతో తాజాగా అతడికి గిన్నిస్‌లో చోటు లభించింది.
AP: తమపై నమోదైన కేసుల పూర్తి వివరాలు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, అయ్యన్నపాత్రుడు, ఇతర నేతలు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ నెల 16 లోగా కేసుల వివరాలను అందించాలని డీజీపీకి మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది.
TCS సంస్థ ఇటీవల 10వేల మంది ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకుంది. దేశంలోని టాప్ ఇంజినీరింగ్ కాలేజీల నుంచి నియమించుకున్న వీరికి నింజా, డిజిటల్, ప్రైమ్ కేటగిరీల్లో ఉద్యోగాలు కల్పించింది. రూ.3.36 లక్షల నుంచి రూ.11.5 లక్షల జీతం ఆఫర్ చేసింది. VIT కాలేజీలో అత్యధికంగా 963 మందికి ఆఫర్ లెటర్లు వచ్చాయి. కోడింగ్‌లో అద్భుతమైన స్కిల్స్, బిజినెస్ ప్రాబ్లమ్స్‌ను సాల్వ్ చేసే నైపుణ్యం ఉన్న వారిని ఎంపిక చేసింది.
AP: గుంటూరు జిల్లాలో వైసీపీకి షాక్ తగలనుంది. జడ్పీ ఛైర్‌పర్సన్ కత్తెర క్రిస్టినా, ఆమె భర్త సురేశ్ టీడీపీలో చేరనున్నారు. కొల్లూరులో ఇవాళ జరిగే ప్రజాగళం సభలో చంద్రబాబు సమక్షంలో వీరు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. తాడికొండ టికెట్ దక్కకపోవడంతో వీరు వైసీపీకి దూరంగా ఉంటున్నారు. క్రిస్టినా భర్త సురేశ్ హార్వెస్ట్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ద్వారా పేదలు, అనాథలు, అస్వస్థతతో ఉన్న వారికి సేవ చేస్తుంటారు.
TG: భద్రాచలం రామయ్య సన్నిధిలో శ్రీరామనవమి తిరుకళ్యాణ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 9 నుంచి ప్రారంభమైన ఉత్సవాలు 23వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నెల 16న ఉత్తర ద్వారం వద్ద ఎదుర్కోలు మహోత్సవం, 17న మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణోత్సవం, 18న రాములవారి మహాపట్టాభిషేకం వేడుకలు నిర్వహించనున్నారు. కళ్యాణం, పట్టాభిషేకం కోసం దేవస్థానం వెబ్‌సైట్‌లో, ఆఫ్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తున్నారు.
రాజకీయాల్లో రక్త సంబంధాలకు తావు లేదని కొందరు అంటుంటారు. అయితే కొందరు తండ్రులు కన్న ప్రేమను కాదనలేక తమకు దశాబ్దాలుగా అవకాశాలిచ్చిన పార్టీని ధిక్కరించి కొడుకులకు సపోర్ట్ చేస్తున్నారు. ఒడిశాలోని కాంగ్రెస్ MLA సురేశ్ రౌత్రాయ్(80) కొడుకు మన్మథ రౌత్రాయ్ BJD తరఫున భువనేశ్వర్ ఎంపీగా బరిలో దిగుతున్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లో కొడుకు తరఫున తండ్రి ప్రచారం చేస్తున్నారు. <<-se>>#ELECTIONS2024<<>>
ఒడిశా అసెంబ్లీ మాజీ స్పీకర్, కాంగ్రెస్ నేత చింతామణి సామంత్రాయ్(84) పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది. ఆయన ప్రాతినిధ్యం వహించిన చికితీ అసెంబ్లీ స్థానంలో చిన్న కొడుకు మనోరంజన్ బీజేపీ నుంచి, పెద్ద కొడుకు రబీంద్రనాథ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో తండ్రి ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినేనని చెబుతూనే ఎవరి తరఫునా ప్రచారం చేయట్లేదని వెల్లడించారు.<<-se>>#ELECTIONS2024<<>>
ఒడిశాలో సీఎం నవీన్ పట్నాయక్‌ను, BJDని తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తుల్లో బిజయ్ మహాపాత్ర ముఖ్యుడు. బీజేపీలో కీలక పదవులు నిర్వర్తించారు. ఇప్పుడు ఆయన కుమారుడు అరవింద్ మహాపాత్ర BJD నుంచి పట్‌కురా స్థానంలో పోటీ చేస్తున్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లో ఆయన కుమారుడికి మద్దతునిచ్చారు. జీవితమంతా వ్యతిరేకించిన పార్టీకే ఆయన ప్రచారం చేస్తున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>
Sorry, no posts matched your criteria.