news

News April 12, 2024

బుమ్రా లాంటి బౌలర్ మాకూ కావాలి: డుప్లెసిస్

image

ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లాంటి బౌలర్ తమ జట్టులో కూడా ఉండుంటే బాగుండేదని RCB కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ అన్నారు. ‘బుమ్రాలో అద్భుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. మలింగ నేతృత్వంలో అతడు మరింత మెరుగయ్యాడు. అలాంటి క్లాస్ బౌలర్ మాకూ ఉండాలి. మ్యాచ్‌లో బ్యాటర్లు రాణించినా.. బౌలర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. మా బౌలింగ్ పటిష్ఠంగా లేదు. మేం 250కిపైగా స్కోర్ సాధించాల్సింది’ అని ఆయన చెప్పారు.

News April 12, 2024

కవిత కేసులో మ.2గంటలకు తీర్పు రిజర్వ్

image

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కోర్టు తీర్పును మధ్యాహ్నం 2గంటలకు రిజర్వ్ చేసింది. ఆమెను ఈరోజు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో CBI హాజరుపర్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

News April 12, 2024

BREAKING: ఇంటర్ ఫలితాలు విడుదల

image

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో ఇంటర్ బోర్డు అధికారులు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఒకేసారి రిలీజ్ చేశారు. కాసేపట్లోనే ఈ ఫలితాలు సర్వర్లలో అప్‌డేట్ కానున్నాయి. మరికొద్ది క్షణాలలో అందరికంటే ముందుగా వే2న్యూస్ యాప్‌లో రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే ఉండే స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే క్షణాల్లో ఫలితం వస్తుంది. అంతే సులువుగా దీన్ని షేర్ చేయొచ్చు. Be Ready

ప్రభుత్వం కీలక నిర్ణయం.. గురుకుల టీచర్లకు నైట్ డ్యూటీలు

image

TG: గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిన నేపథ్యంలో టీచర్లకు నైట్ డ్యూటీలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురుకుల సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రెండుగా ఉన్న నైట్ డ్యూటీ టీచర్ల సంఖ్యను 4కు పెంచాలని ఆదేశించారు. ప్రిన్సిపాళ్లు కచ్చితంగా గురుకులంలోనే ఉండాలని, నైట్ డ్యూటీ టీచర్లు హాస్టళ్లలో ఉండి విద్యార్థుల కదలికలను గమనిస్తూ ఉండాలని పేర్కొన్నారు.

News April 12, 2024

లిక్కర్ స్కాంలో కవిత కీలక సూత్రధారి: CBI

image

లిక్కర్ స్కాంలో MLC కవిత కీలక సూత్రధారి అని CBI పేర్కొంది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ వాదనలు వినిపిస్తోంది. ఇదే కేసులో అప్రూవర్‌గా మారిన NOC పొందడంలో మాగుంట రాఘవకు సహకరించేందుకు కవిత ప్రయత్నించినట్లు ఆమె CA వాట్సాప్ చాటింగ్‌లో తేలిందని పేర్కొంది. ఢిల్లీ, HYDలో ఈ స్కాం‌కి స్కెచ్ వేసినట్లు వెల్లడించింది. కవిత సౌత్ గ్రూప్ నుంచి రూ.100కోట్లు సమీకరించి.. ఆప్ నేతలకు ఇచ్చినట్లు ఆరోపించింది.

ఇంటర్ రిజల్ట్స్.. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్లు

image

ఏపీ ఇంటర్ బోర్డు కాసేపట్లో ఫలితాలు విడుదల చేయనుంది. విద్యార్థులు ఊహించని ఫలితాలు వస్తే తల్లిదండ్రులు, కాలేజ్ యాజమాన్యాలు వారికి మనోధైర్యం ఇవ్వాలని అధికారులు సూచించారు. విద్యార్థులు ఆందోళనలో ఉన్నా, తల్లిదండ్రులు లేదా సన్నిహితులు ఇంటర్ విద్యార్థులు ఒత్తిడిలో ఉన్నట్లు గమనిస్తే హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. ఆ నంబర్లు పైన ఇమేజ్‌లో చూడవచ్చు.

సిక్కింలో ‘యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్’ ప్రయోగం

image

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్’‌ (ATGM)ను భారత ఆర్మీ ప్రయోగించింది. త్రిశక్తి కార్ప్స్ ఆధ్వర్యంలో సిక్కింలోని గువాహటి సమీపంలో 17 వేల అడుగుల ఎత్తైన ప్రదేశంలో ఈ క్షిపణి ప్రయోగం నిర్వహించారు. పర్వత ప్రదేశాల నుంచి ఈ మిసైల్‌ను ప్రయోగించనున్నారు. ఈ మిస్సైల్స్ ఒక సైనికుడు తీసుకెళ్లేంత చిన్నవిగా ఉంటాయి.