India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పపువా న్యూ గినియా మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి వన్డే విజయాన్ని అందుకుంది. USAతో వన్డే మ్యాచ్‌లో PNG గెలిచింది. 44.2ఓవర్లలో USA 160 పరుగులకు ఆలౌట్ కాగా ఛేదనకు దిగిన PNG 36.2ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 164 రన్స్ చేసి విజయం సాధించింది. తన్య రుమ 80(93బంతుల్లో) పరుగులతో రాణించారు. ఇదిలా ఉంటే PNG కెప్టెన్ కాయా అరువా(33) వారం క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే.
లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రేక్షకులు రారనే భావన చాలామంది దర్శకనిర్మాతల్లో ఉందని హీరోయిన్ కృతి సనన్ అన్నారు. ఈ సినిమాలకు వెళితే తాము చెల్లించిన టికెట్‌కి సరైన న్యాయం జరగదని ప్రేక్షకులు భావిస్తారనేది సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో సినీ ఇండస్ట్రీలో మార్పు రావాల్సిన అవసరం ఉందని కృతి అన్నారు. తాను కరీనాకపూర్‌తో కలిసి నటించిన ‘క్రూ’ రూ.100కోట్లు రాబట్టిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
AP: రాష్ట్రంలో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే నెలలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు మించి నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గడిచిన పదేళ్లలో 2016 ఏప్రిల్ 25న తిరుపతిలో 45.7 డిగ్రీలు నమోదవగా, ఆదివారం మార్కాపురం (46°C) దానిని అధిగమించింది. ఐఎండీ గణాంకాల ప్రకారం 2003 మే28న రెంటచింతలలో 49.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఇదే అత్యధికం.
హమాస్‌తో యుద్ధం కారణంగా సంక్షోభంలో చిక్కుకున్న ఇజ్రాయెల్‌ను భారత్ ఆదుకోనుంది. ఆ దేశానికి 6000మంది కార్మికులను ఏప్రిల్, మే నెలలో ఇజ్రాయెల్ పంపనుంది. వీరందరినీ ప్రత్యేక విమానాల్లో తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కార్మికుల ప్రయాణ ఖర్చుల్లో రాయితీ ఇవ్వాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 900మంది భారత కార్మికులు అక్కడికి చేరినట్లు ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది.
AP ఇంటర్ ఫలితాలు ఇవాళ ఉ.11 గంటలకు విడుదల కానున్నాయి. BIEAP అధికారిక సైట్‌తో పాటు Way2News యాప్‌లోనూ ఫలితాలు పొందవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు. ప్రత్యేక స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఇచ్చి క్లిక్ చేస్తే మెరుపు వేగంతో ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ఒకే క్లిక్‌తో వాట్సాప్ సహా ఏ ప్లాట్‌ఫాంకైనా రిజల్ట్ కార్డ్ షేర్ చేసుకోవచ్చు. #ResultsFirstOnWay2News
సాధారణంగా విడాకుల తర్వాత భార్యలకు భర్తలు భరణం ఇవ్వడం గురించి వింటుంటాం. తాజాగా భరణం విషయంలో బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సంపాదించే మహిళ.. అనారోగ్యం, వైద్య పరమైన ఇబ్బందులతో జీవనోపాధి పొందలేని స్థితిలో ఉన్న మాజీ భర్తకు భరణం చెల్లించాలని పేర్కొంది. బ్యాంకు మేనేజర్ అయిన ఓ మహిళ తన మాజీ భర్తకు భరణం చెల్లించలేనని వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఆయనకు నెలకు రూ.10వేల భరణం చెల్లించాలంది.
IPL-2024లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. లక్నో వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7:30కు ప్రారంభమవుతుంది. టోర్నీ చరిత్రలో ఈ రెండు టీమ్‌లు ఇప్పటివరకు మూడు సార్లు తలపడగా, 3 మ్యాచుల్లోనూ LSG గెలిచింది. ప్రస్తుత సీజన్ పాయింట్స్ టేబుల్‌లో లక్నో 3 విజయాలతో మూడో స్థానంలో ఉండగా, ఢిల్లీ ఒక్క విజయంతో చివరి స్థానంలో ఉంది.
జాబిల్లి రహస్యాలను తెలుసుకునేందుకు 2040 నాటికి చంద్రుడిపైకి వ్యోమగాములను పంపించనున్నట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. దీనికోసం శ్రీహరికోటలోని షార్‌లో మూడో ప్రయోగ వేదిక నిర్మిస్తామన్నారు. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2028లో చంద్రయాన్-4ను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. భవిష్యత్తు ప్రయోగాల కోసం టెక్నాలజీని మెరుగుపరుచుకుంటున్నామని పేర్కొన్నారు.
TG: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలోనే ఉపఎన్నికల జరగనుంది. ఈ ఎన్నికకు సంబంధించి వారం, 10 రోజుల్లో షెడ్యూల్ విడుదల చేయాలని ఈసీఐ నిర్ణయించింది. పల్లా రాజేశ్వర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందడంతో శాసనమండలిలో ఈ సీటు ఖాళీ అయింది. ఖాళీ అయిన తర్వాత నుంచి 6 నెలల్లో ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో ఎలక్షన్ తేదీలపై ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.
IPL-2024లో పవర్‌ప్లేలో అత్యధిక స్కోరింగ్ రేటు కలిగిన జట్టుగా కోల్‌కతా నైట్ రైడర్స్ (11.33) తొలి స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో ముంబై ఇండియన్స్ (10.70), సన్‌రైజర్స్ హైదరాబాద్ (10.67), ఢిల్లీ క్యాపిటల్స్ (9.07), చెన్నై సూపర్ కింగ్స్ (8.77) ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.