News April 12, 2024
త్వరలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక

TG: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలోనే ఉపఎన్నికల జరగనుంది. ఈ ఎన్నికకు సంబంధించి వారం, 10 రోజుల్లో షెడ్యూల్ విడుదల చేయాలని ఈసీఐ నిర్ణయించింది. పల్లా రాజేశ్వర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందడంతో శాసనమండలిలో ఈ సీటు ఖాళీ అయింది. ఖాళీ అయిన తర్వాత నుంచి 6 నెలల్లో ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో ఎలక్షన్ తేదీలపై ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.
Similar News
News March 27, 2025
పెరిగిన బంగారం ధరలు

వరుసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 పెరిగి రూ.82,350లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 పెరగడంతో రూ.89,840 వద్ద కొనసాగుతోంది. అటు వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,11,000గా ఉంది.
News March 27, 2025
రామ్ చరణ్‌కు మెగాస్టార్ బర్త్ డే విషెస్

రామ్ చరణ్‌కు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విషెస్ తెలిపారు. ‘పెద్ది పోస్టర్ చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తోంది. నీలోని నటున్ని కొత్త కోణంలో ఇది ఆవిష్కరించనుంది. అభిమానులకు ఇది కనుల పండుగ కానుందని నమ్ముతున్నా’ అని మెగాస్టార్ Xలో పోస్ట్ చేశారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా జూనియర్ NTRతో పాటు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు విషెస్ తెలిపారు.
News March 27, 2025
2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం: నిమ్మల

AP: CM చంద్రబాబు కాసేపట్లో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రానున్న నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 2026 నాటికి నిర్వాసితులకు అన్ని కాలనీలను నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పోలవరాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.