India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: టీడీపీ పచ్చ ఇసుకాసురులు ప్రజల్ని హింసిస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ‘ఉచిత ఇసుక ఇస్తామంటూ ప్రజల్ని మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు తిరగబడండి అంటూ పిలుపునిస్తున్నారు. దీన్ని చూస్తుంటే సీఎంగా ఆయన ఫెయిల్ అయ్యారని చెప్పాల్సిన పని లేదు. బాబుని పొగిడే పచ్చమీడియా ప్రజల ఇబ్బందుల్ని గమనించాలి. టీడీపీ నాయకుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న ఇసుకను విడిపించండి’ అని Xలో విమర్శలు చేశారు.
యూపీకి చెందిన ఓ రియల్ వ్యాపారి తన వద్ద విల్లా కొంటే లంబోర్గిని కార్ ఫ్రీ అని సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్‌గా మారింది. నోయిడాకు చెందిన జేపీ గ్రీన్స్ తమ వెంచర్‌లోని రూ.26 కోట్ల విలువైన విల్లాను కొనుగోలు చేస్తే రూ.4 కోట్ల విలువైన లంబోర్గిని ఉరుస్ కారు ఇస్తానని తెలిపారు. స్విమ్మింగ్ పూల్, థియేటర్, గోల్ఫ్ కోర్స్ కోసం అదనంగా రూ.50 లక్షలు చెల్లించాలని పేర్కొన్నారు.
TG: కేసీఆర్ రాజకీయం ఏడాదిలో ముగుస్తుందని ఆపై KCR అనే పదమే కనిపించదని CM రేవంత్ సంచలన కామెంట్స్ చేశారు. ‘ఆయన ఫ్యామిలీలో గొడవలు నడుస్తాయి. బావతో బావమరిది రాజకీయం ముగుస్తుంది. KCR ఉనికి లేకుండా KTRను వాడాను. త్వరలో KTR ఉనికి లేకుండా బావ హరీశ్‌ను వాడతాను. ఇద్దరినీ ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు. రాజ్‌పాకాల ఇంట్లో క్యాసినో కాయిన్స్ దొరికాయి. దీపావళి పార్టీ అని ఎలా అంటారు?’ అని CM ప్రశ్నించారు.
TG: మూసీ నది పునరుజ్జీవం ప్రాజెక్టు పనులు నవంబర్ 1న ప్రారంభిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. ‘నవంబర్‌లోపు టెండర్లు పిలుస్తాం. మూసీపై ముందడుగే తప్ప వెనకడుగు వేయం. మొదటి విడతలో బాపూఘాట్ నుంచి 30 కి.మీ మేర పనులు చేపడతాం. ఇప్పటికే రూ.140 కోట్లతో DPR తయారీకి ఆదేశాలిచ్చాం. నిర్వాసితులకు ఫ్రీ ఎడ్యుకేషన్, అన్ని సదుపాయాలు కల్పిస్తాం. మూసీ చుట్టూ నైట్ సిటీ ఏర్పాటు చేస్తాం’ అని తెలిపారు.
AP: భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అమరావతిలో సీఎం చంద్రబాబును కలిశారు. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్నితో కలిసి ఆయన సీఎంతో పలు విషయాలపై చర్చించారు. రాష్ట్రంలో గోల్ఫ్ కోర్టు ఏర్పాటుపై వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీనిని అమరావతిలో ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
AP: నిర్మాణ రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రజలకు ఉచితంగా ఇసుక అందించే మాటకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. బోట్ మెన్ అసోసియేషన్ల ద్వారా కూడా ఉచిత ఇసుకను అందిస్తామని పేర్కొన్నారు. సొంత వాహనాల్లో ఇసుక తీసుకెళ్లేవారికి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నామని చెప్పారు. లారీలకు సైతం అనుమతులిచ్చామన్నారు. గత ప్రభుత్వం మైనింగ్ వ్యవస్థలో దోచుకుందని ఆరోపించారు.
కన్నడ పవర్ స్టార్ దివంగత పునీత్ రాజ్ కుమార్ మూడో వర్ధంతి సందర్భంగా ఆయన భార్య అశ్విని ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘అప్పూ మన జ్ఞాపకాల్లో, మనం చేసే పనుల్లో ఎప్పటికీ మనతో ఉంటారు. మన హృదయాల్లో ఓ మార్గదర్శిగా శాశ్వతంగా ఉండిపోతారు’ అని ఆమె Xలో పోస్ట్ చేశారు. అభిమానులు సైతం పునీత్ చేసిన గొప్ప పనులను గుర్తుచేసుకుంటున్నారు. ఆయన స్థాపించిన సేవా సంస్థలు ఎంతోమందికి చదువు చెప్పిస్తున్న విషయం తెలిసిందే.
అమెరికా/GEకి కేంద్రం షాక్ ఇచ్చినట్టు సమాచారం. తేజస్ ఫైటర్ జెట్లకు ఇంజిన్ల సరఫరా ఆలస్యం చేయడంతో భారీ స్థాయిలో జరిమానా విధించినట్టు తెలుస్తోంది. నిజానికి 2023 మార్చి నాటికే డెలివరీ ఆరంభించాల్సింది. మోదీ, రాజ్‌నాథ్ చాలాసార్లు దీనిపై చర్చించినా US ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేసినట్టు తెలుస్తోంది. దీంతో కాంట్రాక్టులోని పెనాల్టీ క్లాజ్‌ను ఉపయోగించి ఒకటి కన్నా ఎక్కువ సార్లే ఫైన్ వేశారని వార్తలొస్తున్నాయి.
AP: గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ‘2027లో జరిగే పుష్కరాలకు భారీగా ఏర్పాట్లు చేస్తాం. 8 కోట్ల మంది పుష్కరాలకు వస్తారని అంచనా. గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. భద్రతా ఏర్పాట్లపై CM, Dy.CMతో చర్చిస్తాం’ అని తెలిపారు. జిల్లా కేంద్రమైన రాజమండ్రిని అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామని MP పురందీశ్వరి తెలిపారు.
ఈమధ్య ఆడ, మగ తేడా లేకుండా పియర్సింగ్(చెవులు, ముక్కు, శరీరంలో నచ్చిన చోటు కుట్టించుకోవడం) చేయించుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. కుట్టినచోట బుడిపె వంటి కాయ వచ్చే అవకాశం ఉంది. దాన్ని గ్రాన్యులోమా అంటారు. ఇలా వస్తే డాక్టర్‌ను సంప్రదించాలి. కుట్టిన చోట మచ్చ ఏర్పడినా, అలర్జీలు వచ్చినా డర్మటాలజిస్ట్‌ను కలవాలి. కుట్టిన ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.
Sorry, no posts matched your criteria.