news

News April 11, 2024

నా ఫ్యామిలీ జోలికొస్తే ఊరుకుంటానా?: బాలినేని

image

AP: ఒంగోలులో టీడీపీ, వైసీపీ ఘర్షణపై YCP ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ‘ప్రచారంలో భాగంగా మా కోడలు కరపత్రాలు ఇస్తుంటే తీసుకోకుండా బూతులు తిట్టారు. TDP వాళ్లు ఇష్టం లేకపోతే తీసుకోవద్దు. అంతేకానీ తిడతారా? నన్ను ఏం చేసినా ఊరుకున్నా.. నా ఫ్యామిలీ జోలికొస్తే ఊరుకుంటానా? చేతగాని వాళ్లమా? మీకు ప్రజలే బుద్ధి చెబుతారు. నేను ప్రజల మనిషిని. రాజకీయాలు లేకపోతే బతకలేమా?’ అని మండిపడ్డారు.

News April 11, 2024

ఫోన్ ట్యాపింగ్‌లో ఆ ఐదుగురు నేతలే కీలకం?

image

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో ఓ పార్టీ సుప్రీమ్, ఓ MP, ఓ MLC, ఇద్దరు మాజీ మంత్రులు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. వీరంతా అక్రమాలకు పాల్పడ్డారని నిరూపించేందుకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. రాధాకిషన్ రావు వాంగ్మూలంలో ఈ విషయాలు బయటపడ్డట్లు టాక్. SIB మాజీ చీఫ్ ప్రభాకర్‌ను విచారిస్తే పూర్తి విషయాలు బయటపడతాయని పోలీసులు చెబుతున్నారు.

News April 11, 2024

సంజూ శాంసన్‌కు షాక్

image

గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమితో బాధలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు బిగ్ షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా అతడికి IPL గవర్నింగ్ కౌన్సిల్ రూ.12 లక్షల ఫైన్ విధించింది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయనందుకు ఆయనకు ఈ ఫైన్ పడింది. మరోసారి ఇదే తప్పు జరిగితే భారీ ఫైన్ విధించే ఛాన్స్ ఉంది. ఇటీవలే DC కెప్టెన్ రిషభ్ పంత్‌కు కూడా రూ.24 లక్షల ఫైన్ విధించింది.

News April 11, 2024

‘రామాయణం’ కోసం రూ.75 కోట్ల రెమ్యునరేషన్!

image

నితేశ్ తివారీ తెరకెక్కించనున్న ‘రామాయణం’ సినిమాలో రాముడి పాత్ర కోసం రణ్‌బీర్ కపూర్ రూ.75 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. అయితే, సీత పాత్రలో నటించనున్న హీరోయిన్ సాయి పల్లవి రూ.6 కోట్లు తీసుకోనుండగా రాకింగ్ స్టార్ యశ్ ఏకంగా రూ.80 కోట్ల పారితోషికం తీసుకోనున్నట్లు సమాచారం. తాజాగా, రాముడి పాత్ర కోసం రణ్‌బీర్ శిక్షణ తీసుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది.

News April 11, 2024

రషీద్‌పై గిల్ ప్రశంసలు

image

స్పిన్నర్ రషీద్ ఖాన్‌పై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్ ప్రశంసల వర్షం కురిపించారు. రషీద్ వల్లే తమకు RRపై విజయం దక్కిందన్నారు. అఖరి బంతికి విజయం సాధించడం ఎప్పుడూ గొప్ప అనుభూతిని మిగులుస్తుందన్నారు. రషీద్ లాంటి ప్లేయర్ జట్టులో ఉండాలని ప్రతీ కెప్టెన్ కోరుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదని కొనియాడారు.

News April 11, 2024

లక్నోకు రోహిత్ శర్మ.. కోచ్ ఏమన్నారంటే?

image

రోహిత్‌ను LSG దక్కించుకోనుందంటూ వస్తున్న వార్తలపై ఆ జట్టు కోచ్ లాంగర్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. వేలంలో ఏ ఆటగాడిని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అడగ్గా ‘నేను ఎవరి పేరు చెబుతానని మీరనుకుంటున్నారు?’ అని ఆయన తిరిగి ప్రశ్నించారు. ‘రోహిత్‌ను జట్టులోకి తీసుకోగలరా?’ అని అనడంతో ఆశ్చర్యపోయిన లాంగర్ ‘ఏంటీ.. రోహిత్‌ శర్మనా? OK. మేం అతడిని తీసుకుంటాం. మీరే ఈ డీల్ కుదర్చగలరు’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు.

News April 11, 2024

వావ్.. ఇది కదా దేశానికి కావాల్సింది!

image

కేరళ ప్రజలు మత సామరస్యాన్ని చాటారు. ముస్లింలు అధికంగా ఉండే ముత్తువల్లూర్ గ్రామంలో 400ఏళ్ల నాటి దుర్గాభగవతి ఆలయం ఉంది. అయితే ముస్లింలు, హిందువులు కలిసి ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఆర్థిక సాయంతో ఆగిపోకుండా నిర్మాణ సామగ్రిని విరాళంగా ఇచ్చారు. అలా ఇరు వర్గాల ప్రజలు కలిసి ఆలయాన్ని పునరుద్ధరించారు. మేలో విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. హిందూ పండుగలకు క్రమం తప్పకుండా కూరగాయలు ఇస్తుండటం మరో విశేషం.

News April 11, 2024

నెగటివ్ రివ్యూస్‌పై కంప్లైంట్ ఇవ్వలేదు: విజయ్

image

తన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’కు నెగటివ్ రివ్యూ ఇస్తున్న వారిపై హీరో విజయ్ దేవరకొండ కంప్లైంట్ ఇచ్చారనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈక్రమంలో ఓ సినీ జర్నలిస్టు దీనిపై విజయ్‌ను సంప్రదించగా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇది ఫేక్ వార్త అని, కొవిడ్ సమయంలో అప్పటి HYD సీపీ అంజనీ కుమార్‌తో ఉన్న ఫొటోను ప్రస్తుతం షేర్ చేస్తున్నట్లు వెల్లడించారు.

News April 11, 2024

ఓటమి భయంతోనే వైసీపీ దాడులు: చంద్రబాబు

image

AP: ఓటమి భయంతోనే YCP <<13031157>>హింసా<<>> రాజకీయాలు చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ‘ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్‌ను ప్రశ్నిస్తే బెదిరిస్తారా? ప్రభావతి కుటుంబాన్ని YCP రౌడీమూక చంపేస్తామని బెదిరించింది. అండగా నిలిచిన TDP నేత మోహన్‌పై దాడి చేశారు. దాడి సమయంలో పోలీసులు ఉన్నా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దాడికి బాలినేని శ్రీనివాస్‌రెడ్డే కారణం. నిందితులపై SP కఠిన చర్యలు తీసుకోవాలి’ అని బాబు డిమాండ్ చేశారు.

News April 11, 2024

మాల్దీవుల అధ్యక్షుడికి మోదీ విషెష్

image

మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుకు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆ దేశ ప్రజలకు సకల శుభాలు కలగాలని కోరుకున్నారు. మాల్దీవుల సాంస్కృతిక, నాగరికత వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజలు కరుణ, సోదరభావం, ఐక్యతతో మెలగాలని అభిలషించారు. ఇది శాంతియుత ప్రపంచాన్ని నిర్మించడంలో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రంజాన్ కరుణ, దాతృత్వం, సామరస్యానికి ప్రతీక అని ఆయన తెలిపారు.