News April 11, 2024
సంజూ శాంసన్‌కు షాక్

గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమితో బాధలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు బిగ్ షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా అతడికి IPL గవర్నింగ్ కౌన్సిల్ రూ.12 లక్షల ఫైన్ విధించింది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయనందుకు ఆయనకు ఈ ఫైన్ పడింది. మరోసారి ఇదే తప్పు జరిగితే భారీ ఫైన్ విధించే ఛాన్స్ ఉంది. ఇటీవలే DC కెప్టెన్ రిషభ్ పంత్‌కు కూడా రూ.24 లక్షల ఫైన్ విధించింది.
Similar News
News February 11, 2026
గతంలోనూ అవిశ్వాసం.. ఏం జరిగిందంటే..?

గతంలోనూ ముగ్గురు స్పీకర్లు అవిశ్వాసాలు ఎదుర్కొన్నారు. 2సార్లు ఓటింగ్ జరిగినా అవి వీగిపోయాయి. ఓటింగ్ భిన్నంగా ఉండటమే ఇందుకు కారణం. ‘<<19097533>>మెజారిటీ <<>>విషయంలో లోక్‌సభ సభ్యుల మొత్తం సంఖ్యను లెక్కలోకి తీసుకుంటారు. దీంతో అధికార పక్షానిదే మెజారిటీ అవుతుంది. తీర్మానం గట్టెక్కదు’ అని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ ఆచారి తెలిపారు. గతంలో మౌలాంకర్(1954), హుకుం సింగ్(1966), బలరాం జాఖడ్(1987) అవిశ్వాసం ఎదుర్కొన్నారు.
News February 11, 2026
ఫీజు రీయింబర్స్‌మెంట్: కాలేజీల ఖాతాల్లోకే..

AP: నిన్న విడుదలైన రూ.1,200 కోట్ల <<19104256>>ఫీజు<<>> రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం కాలేజీల ఖాతాల్లో జమ చేయనుంది. దీంతో 2024-25 బకాయిలు క్లియర్ కానున్నాయి. అయితే 2023-24కు సంబంధించి రూ.1,500 కోట్లు పెండింగ్ ఉన్నాయి. ఈ నిధులను తల్లుల ఖాతాల్లోనే జమ చేయాలని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కోర్సులు పూర్తి చేసుకొని వెళ్లిపోయిన వారినుంచి డబ్బులు ఎలా రాబట్టుకోవాలని యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి.
News February 11, 2026
జీడిమామిడిలో బూడిద తెగులు – నివారణ ఎలా?

జీడిమామిడి తోటల్లో పూత దశలో వివిధ రకాల తెగుళ్లు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పొడి వాతావరణం ఉన్నప్పుడు బూడిద తెగులు ఎక్కువగా పూతను ఆశిస్తుంది. లేత చిగుర్లను, పూతను బూడిద తెగులు ఆశించి ఎండిపోయేలా చేసి పంటను నష్టపరుస్తుంది. ఫలితంగా దిగుబడి తగ్గుతుంది. దీని నివారణకు లీటరు నీటికి సల్ఫర్ 3 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. లేదా లీటరు నీటికి ట్రై డేమోర్ప్ 1.5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.


