news

News April 11, 2024

టుడే టాప్ స్టోరీస్

image

➣AP: టీడీపీ గెలిస్తే జన్మభూమి కమిటీ సభ్యులే వాలంటీర్లు: CM జగన్
➣జగన్ గొడ్డలి వేటుకు బలి కానివారు ఉన్నారా?: CBN
➣రౌడీరాజ్యం పోవాలి.. రామరాజ్యం రావాలి: పవన్
➣పవన్ కళ్యాణ్‌కు EC నోటీసులు
➣TG: BRS ఎమ్మెల్యేలతో రేవంత్ సొంత దుకాణం: BJP MLA మహేశ్వర్ రెడ్డి
➣నువ్వు సీఎంవా.. చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా?: హరీశ్
➣మోదీ గెలిస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుంది: కిషన్ రెడ్డి
IPL: RRపై GT విజయం

News April 11, 2024

BREAKING: ఉత్కంఠ పోరులో గుజరాత్ విజయం

image

IPL-2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో గుజరాత్ టైటాన్స్‌ 3 వికెట్ల తేడాతో గెలిచింది. 197 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ ఆఖరి బంతికి టార్గెట్‌ను చేధించింది. ఆ జట్టు బ్యాటర్లలో గిల్ 72, సుదర్శన్ 35 రన్స్‌తో రాణించారు. చివర్లో రాహుల్ తెవాటియా(22), రశీద్ ఖాన్(24*) బౌండరీలు బాది తమ జట్టుకు విజయాన్నందించారు.

News April 11, 2024

ఒకప్పుడు భారతీయ సంస్కృతి అంటే సిగ్గుపడేవాడిని: దేవ్ పటేల్

image

స్థానిక ప్రభావంతో లండన్‌లో స్కూల్‌కు వెళ్లే రోజుల్లో తన భారత మూలాలు, సంస్కృతుల గురించి సిగ్గుపడేవాడినని బ్రిటిష్ నటుడు దేవ్ పటేల్ తెలిపారు. కానీ స్లమ్‌డాగ్ మిలియనీర్‌తో సినీ ఇండస్ట్రీలోకి వచ్చాక డైరెక్షన్ చేసి భారతీయ సంస్కృతిని గొప్పగా చూపాలని డిసైడ్ అయ్యానని తెలిపారు. కాగా దేవ్ స్వీయదర్శకత్వంలో నటించిన ‘మంకీ మ్యాన్’ రేపు విడుదల కానుంది. హనుమంతుడి స్ఫూర్తితో ఈ కథను తీర్చిదిద్దానని దేవ్ తెలిపారు.

News April 10, 2024

ప్రపంచాన్ని కాపాడేందుకు మనకి రెండేళ్లే ఉంది: UNCA చీఫ్

image

పర్యావరణ మార్పుల నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు మానవాళికి రెండేళ్ల సమయమే ఉన్నట్లు UN క్లైమెట్ ఏజెన్సీ చీఫ్ హెచ్చరించారు. 2025లోగా కార్బన్ కాలుష్యంపై ప్రపంచ దేశాలు సత్వర చర్యలు చేపట్టాలని సూచించారు. పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతిఒక్కరికీ ఉందన్నారు. తన హెచ్చరిక నాటకీయంగా అనిపిస్తున్నా ఇది నిజమని, ఈ రెండేళ్ల కాలం ఎంతో కీలకమని పేర్కొన్నారు. కాలుష్యం తీవ్రమైతే ఆర్థిక అసమానతలు పెరుగుతాయన్నారు.

News April 10, 2024

జనంతో చార్మినార్ మార్కెట్ల కళకళ

image

ఈరోజు చందమామ కనిపించడంతో రేపు దేశవ్యాప్తంగా ముస్లింలు ఈద్‌ను జరుపుకోనున్నారు. ఈక్రమంలో హైదరాబాద్‌లోని చార్మినార్ మార్కెట్లు జనంతో నిండిపోయాయి. గాజులు, అత్తర్లు సహా మహిళలు ఇష్టంగా కొనుగోలు చేసే పలు రకాలైన అలంకరణ వస్తువులు, దుస్తులు అక్కడ లభిస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంజాన్ మాసంలో కులమతాలకు అతీతంగా అక్కడ జనం షాపింగ్‌ చేస్తుంటారు.

News April 10, 2024

థ్రిల్ ఉంటుందని డ్రగ్స్ ఇచ్చిన ఫ్రెండ్.. యువతి మృతి

image

థ్రిల్ ఉంటుందని స్నేహితుడు డ్రగ్స్ ఇవ్వడంతో యువతి చనిపోయిన ఘటన యూపీలోని లక్నో‌లో జరిగింది. ‘బెంగళూరుకు వెళ్లే ముందు డ్రగ్స్ కావాలని నాకు ఫోన్ చేసింది. ఫ్రెండ్ ప్లాటుకు తీసుకెళ్లి అక్కడ ఇంజెక్షన్‌లో డ్రగ్స్ కలిపి ముందు నేను తీసుకుని తర్వాత ఆమెకు ఇచ్చాను’ అని నిందితుడు వివేక్ పోలీసులకు వెల్లడించాడు. కాగా డ్రగ్స్‌కు బానిసైన నిందితుడు యువతికి కూడా మాదకద్రవ్యాలు అలవాటు చేసినట్లు దర్యాప్తులో తేలింది.

News April 10, 2024

వర్షంతో నిలిచి.. తిరిగి ఆరంభమైన IPL మ్యాచ్

image

రాజస్థాన్, గుజరాత్ మ్యాచ్‌కు వర్షం మరోసారి అడ్డంకిగా మారింది. వర్షం కారణంగా తొలుత టాస్ ఆలస్యం కాగా.. తాజాగా గుజరాత్ బ్యాటింగ్ సమయంలో 10 ఓవర్ల వద్ద మరోసారి వరుణుడు వచ్చాడు. దీంతో పిచ్‌పై కవర్స్‌ను కప్పి మ్యాచ్‌ను నిలిపివేశారు. ప్రస్తుతం GT స్కోరు 10 ఓవర్లలో 77/1 కాగా.. విజయం సాధించడానికి 60 బంతుల్లో 120 రన్స్ కొట్టాలి. వర్షం తగ్గడంతో వెంటనే మ్యాచ్‌ను తిరిగి ప్రారంభించారు.

News April 10, 2024

గుర్తుతెలియని హోర్డింగులపై ఈసీ నిషేధం

image

AP: ఎన్నికల ప్రచార హోర్డింగులపై రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లపై తప్పనిసరిగా ప్రచురణకర్త పేరు, చిరునామా ఉండాలని స్పష్టం చేసింది. గుర్తుతెలియని హోర్డింగులపై ఫిర్యాదులు అందడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 127A ప్రకారం పార్టీ, అభ్యర్థి ప్రచారం కోసం ఇచ్చే ప్రకటనలపై చిరునామా లేకపోతే వాటిని నిషేధిస్తారు.

News April 10, 2024

మూడో టర్మ్‌కు క్రేజ్ పెరుగుతోంది: మోదీ

image

ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి BJP విజయఢంకా మోగించే అవకాశాలపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సాధారణంగా రెండు టర్మ్‌లు ముగిసే సరికి ప్రభుత్వాలు మద్దతు కోల్పోతుంటాయి. ప్రపంచ దేశాల్లో ప్రభుత్వాలపై అసంతృప్తి అనేది కొంతకాలంగా కొనసాగుతోంది. అయితే భారత్ ఇందుకు మినహాయింపు. ఇక్కడ మా ప్రభుత్వం క్రేజ్ ఇంకా పెరుగుతోంది. ఈసారి 97కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు’ అని పేర్కొన్నారు.

News April 10, 2024

ఏడాదికి రూ.16 కోట్లు ఖర్చు.. యువకుడిలా మారిన మిలియనీర్

image

అమెరికన్ టెక్ మిలియనీర్ 46 ఏళ్ల బ్రయాన్ జాన్సన్ 18 ఏళ్ల యువకుడిగా కనిపించేందుకు ప్రతి సంవత్సరం రూ.16 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అయితే, గత ఆరేళ్లలో తన ముఖంలో ఎలాంటి మార్పులొచ్చాయో చూపే ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. 2018, 2023, 2024లో తీసుకున్న మూడు ఫొటోలను షేర్ చేశారు. తనని ఫేస్ ID కూడా గుర్తించట్లేదని చెప్పుకొచ్చారు. వయసు తగ్గించేందుకు ఆయన రోజుకు 100 కంటే ఎక్కువ ట్యాబ్లెట్స్ వేసుకుంటారట.