news

News April 10, 2024

ఈ నెల 21న భువనగిరిలో కాంగ్రెస్ సభ

image

TG: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 21న భువనగిరిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్ రెడ్డి ఆ రోజున నామినేషన్ దాఖలు చేయనుండగా.. అదేరోజు జరిగే సభలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. అటు మే తొలి వారంలో నిర్వహించే సభకు ప్రియాంకా గాంధీని ఆహ్వానించాలని హస్తం నేతలు డిసైడ్ అయ్యారు.

News April 10, 2024

యువతికి ముద్దు పెట్టిన MP అభ్యర్థి

image

పశ్చిమ బెంగాల్‌లో ఓ బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రచారంలో భాగంగా ఓ యువతి బుగ్గపై ముద్దు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాల్దా బీజేపీ ఎంపీ అభ్యర్థి ఖగేన్ ముర్ము ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ యువతి బుగ్గపై ముద్దు పెట్టారు. ఈ ఘటన ఆ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. బెంగాలీ మహిళలపై వేధింపులు ఆపండి అని కొందరు విమర్శిస్తున్నారు.

News April 10, 2024

నితీశ్ కుమార్ రెడ్డి పేరెంట్స్‌ను చూశారా?

image

పంజాబ్‌తో మ్యాచ్‌లో SRH గెలుపులో కీలకపాత్ర పోషించిన తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అతని తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. మేనేజ్మెంట్ నమ్మి బ్యాటింగ్‌కు పంపిస్తే ఆ నమ్మకాన్ని వమ్ముచేయకుండా తనసత్తా ఏంటో చూపించారంటూ నెటిజన్లు అభినందిస్తున్నారు. ఈక్రమంలో తన తండ్రి నితీశ్‌కు ముద్దుపెట్టి మురిసిపోయిన ఫొటోను షేర్ చేస్తున్నారు.

News April 10, 2024

టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ

image

AP: వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ టీడీపీలో చేరారు. పార్టీ చీఫ్ చంద్రబాబు ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. గత ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున హిందూపురం నుంచి బరిలోకి దిగి బాలకృష్ణ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత సీఎం జగన్ ఎమ్మెల్సీ పదవి కేటాయించారు. ఇటీవల పార్టీ ఆయనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది.

News April 10, 2024

BRS ఎమ్మెల్యేలతో రేవంత్ సొంత దుకాణం: మహేశ్వర్ రెడ్డి

image

TG: రాష్ట్రంలో త్వరలోనే రామరాజ్యం వస్తుందని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్లే కూల్చుకుంటారని.. త్వరలోనే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్‌లో కొనసాగడం కంటే 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రేవంత్ సొంత దుకాణం పెట్టుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు రేవంత్ దూరమవ్వాలనుకుంటే ప్రభుత్వం కూలిపోతుందన్నారు.

News April 10, 2024

కూల్‌డ్రింక్ అనుకొని పెట్రోల్ తాగిన బాలుడు.. చివరికి..

image

AP: నెల్లూరులో విషాదం చోటు చేసుకుంది. కరీముల్లా, అమ్ములు దంపతులకు రెండేళ్ల కుమారుడు కాలేషా ఉన్నాడు. అమ్ములు స్థానికంగా ఉండే చేపల దుకాణంలో పనిచేస్తోంది. కుమారుడిని కూడా వెంట తీసుకెళ్తూ ఉండేది. ఈనెల 7న తల్లితో పాటు చేపల దుకాణానికి వెళ్లిన కాలేషా.. పెట్రోల్ బాటిల్‌ను చూసి కూల్‌డ్రింక్ అనుకొని తాగాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతడిని ఆసుపత్రికి తరలించారు. కాలేషా చికిత్స పొందుతూ మరణించాడు.

News April 10, 2024

కరెంట్ బిల్లులను సోషల్ మీడియాలో షేర్ చేయండి: లోకేశ్

image

AP: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలపై టీడీపీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. కరెంట్ బిల్లులను సోషల్ మీడియాలో షేర్ చేయాలని నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ‘జగన్ బాదుడే బాదుడు! ఈ నెల మీ కరెంట్ బిల్లు ఎంత వచ్చింది? బిల్లు ముట్టుకుంటే షాక్ కొట్టిందా? షాక్ కొడితే మీ కరెంట్ బిల్లును సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై #NakuShockKottindhi హ్యాష్ ట్యాగ్‌తో షేర్ చేయండి’ అని కోరారు.

News April 10, 2024

లగ్జరీ ఫ్లాట్ కొన్న టీమ్ ఇండియా క్రికెటర్

image

టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీ షా ముంబైలో ఓ లగ్జరీ ఫ్లాట్ కొన్నారు. రూ.20 కోట్లు వెచ్చించి బాంద్రాలో సముద్రం ఎదురుగా ఉన్న ఓ ఫ్లాట్‌ను సొంతం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను షా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. కాగా పృథ్వీ షా ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. DC రూ.8 కోట్లు చెల్లించి అతడిని దక్కించుకుంది.

News April 10, 2024

మహారాష్ట్రలో ‘టెస్లా’ కార్ల యూనిట్?

image

బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ ఎలక్ట్రిక్ కార్ల తయారీ యూనిట్ ఇండియాలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ ప్లాంట్ ఏర్పాటుకోసం రిలయన్స్‌తో టెస్లా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్లాంట్ ఏర్పాటుకు గుజరాత్, మహారాష్ట్ర సహా పలు ప్రాంతాలను పరిశీలిస్తోంది. చివరికి మహారాష్ట్రలో ప్లాంట్ ఏర్పాటుకు టెస్లా ఓకే చేసినట్లు సమాచారం.

News April 10, 2024

ఉండి టీడీపీ ఎమ్మెల్యే.. తగ్గేదేలే?

image

AP: MP రఘురామకృష్ణరాజుకు TDP పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ టికెట్‌ను కేటాయించినట్లు తెలుస్తోంది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. TDP టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా పోటీ మాత్రం ఖాయమని స్పష్టం చేశారు. టీడీపీకి కంచుకోట లాంటి ఉండిలో తాజా పరిణామాలు ఆ పార్టీని కలవరపెడుతున్నాయి.