News April 10, 2024
మహారాష్ట్రలో ‘టెస్లా’ కార్ల యూనిట్?

బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ ఎలక్ట్రిక్ కార్ల తయారీ యూనిట్ ఇండియాలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ ప్లాంట్ ఏర్పాటుకోసం రిలయన్స్‌తో టెస్లా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్లాంట్ ఏర్పాటుకు గుజరాత్, మహారాష్ట్ర సహా పలు ప్రాంతాలను పరిశీలిస్తోంది. చివరికి మహారాష్ట్రలో ప్లాంట్ ఏర్పాటుకు టెస్లా ఓకే చేసినట్లు సమాచారం.
Similar News
News March 27, 2025
ప్రభాస్ పెళ్లి వార్తలపై టీమ్ క్లారిటీ

రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి వార్తలపై ఆయన టీమ్ స్పందించింది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి కుమార్తెను ఆయన వివాహం చేసుకుంటారని జరిగిన ప్రచారాన్ని ఖండించింది. అలాంటి వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అంతకుముందు భీమవరం అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని జరిగిన ప్రచారాన్ని కొట్టిపారేసిన సంగతి తెలిసిందే.
News March 27, 2025
2 రోజులు సెలవులు

TG: రంజాన్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రెండు రోజులు సెలవులు మంజూరు చేసింది. తెలంగాణ క్యాలెండర్ ప్రకారం మార్చి 31న (సోమవారం) ఈద్ ఉల్ ఫితర్‌తో పాటు ఆ తర్వాతి రోజు ఏప్రిల్ 1న (మంగళవారం) కూడా హాలిడే ఇచ్చింది. ఇక మార్చి 28న జుమాతుల్-విదా, షబ్-ఎ-ఖాదర్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. ఆ రోజు మైనారిటీ విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. అటు ఏపీలో మార్చి 31న మాత్రమే సెలవు ఇచ్చారు.
News March 27, 2025
రేవంత్ ‘తెలంగాణ బూతుపిత’ అవుతారు: KTR

TG: ఎవ్వరు ఏమనుకున్నా తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని BRS ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రేవంత్ తెలంగాణ బూతుపిత అవుతారని ఎద్దేవా చేశారు. తుపాకుల గురించి రేవంత్‌కు తెలిసినంత తమకు తెలియదన్నారు. ఉద్యమకారులపై గన్ను ఎక్కుపెట్టిన చరిత్ర ఆయనదని దుయ్యబట్టారు. ప్రజాపాలన విఫల పాలన అని ఏ ఒక్క హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. అప్పులు, అబద్దాలు, బూతులు, అన్నదాతల ఆత్మహత్యలలో తెలంగాణ రైజింగ్ అని విమర్శలు చేశారు.