news

News April 10, 2024

మహారాష్ట్రలో ‘టెస్లా’ కార్ల యూనిట్?

image

బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ ఎలక్ట్రిక్ కార్ల తయారీ యూనిట్ ఇండియాలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ ప్లాంట్ ఏర్పాటుకోసం రిలయన్స్‌తో టెస్లా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్లాంట్ ఏర్పాటుకు గుజరాత్, మహారాష్ట్ర సహా పలు ప్రాంతాలను పరిశీలిస్తోంది. చివరికి మహారాష్ట్రలో ప్లాంట్ ఏర్పాటుకు టెస్లా ఓకే చేసినట్లు సమాచారం.

News April 10, 2024

ఉండి టీడీపీ ఎమ్మెల్యే.. తగ్గేదేలే?

image

AP: MP రఘురామకృష్ణరాజుకు TDP పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ టికెట్‌ను కేటాయించినట్లు తెలుస్తోంది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. TDP టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా పోటీ మాత్రం ఖాయమని స్పష్టం చేశారు. టీడీపీకి కంచుకోట లాంటి ఉండిలో తాజా పరిణామాలు ఆ పార్టీని కలవరపెడుతున్నాయి.

News April 10, 2024

సుప్రీంలోనూ దక్కని ఊరట

image

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులోనూ ఊరట దక్కలేదు. లిక్కర్ స్కాం కేసులో తనను ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌ను అత్యవసర విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. మెయిల్ చేయాలని కేజ్రీవాల్ తరఫు లాయర్‌కు సూచించింది. కేసు విచారణ సమయం లేదా తేదీని పేర్కొనడానికి నిరాకరించింది.

News April 10, 2024

పిఠాపురం నుంచి మరో పవన్ కళ్యాణ్?

image

AP: ఎన్నికల వేళ జనసేనకు కొత్త చిక్కులు వచ్చేలా ఉన్నాయి. ఆ పార్టీ గ్లాస్ గుర్తును పోలి ఉన్న బకెట్ గుర్తు జనసైనికులకు ఆందోళన కలిగిస్తోంది. ఇదే జరిగితే ఓటర్లు గ్లాస్‌కు బదులు బకెట్‌కు ఓటేసే ప్రమాదముందని జనసైనికులు అనుకుంటున్నారు. మరోవైపు పవన్‌ను ఓడించేందుకు నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం నుంచి కనుమూరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని బరిలో దింపనుందట.

News April 10, 2024

ఆ వివాదంపై కాంగ్రెస్ నోరు మెదపదు: మోదీ

image

కచ్చతీవు ద్వీపం వివాదంపై కాంగ్రెస్ నేతలు నోరు మెదపరని PM మోదీ విమర్శించారు. తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఆ ద్వీపాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే శ్రీలంకకు ఇచ్చిందని మరోసారి గుర్తు చేశారు. తాము మాత్రం శ్రీలంక అరెస్ట్ చేసే తమిళ జాలర్లను ఎప్పటికప్పుడు విడుదల చేయిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ చేసిన తప్పిదంతో వేలాది మంది జాలర్లు అరెస్ట్ అవుతున్నారని మోదీ మండిపడ్డారు.

News April 10, 2024

కాంగ్రెస్‌‌ నేత ఫిరోజ్‌ఖాన్ సంచలన వ్యాఖ్యలు

image

TG: కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఎంపీగా ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆదేశించిందని అన్నారు. ఈమేరకు రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా అదే డిసైడ్ చేశారని, తమ కెప్టెన్ ఏది చెబితే అదే చేస్తానని అన్నారు. వ్యక్తిగతంగా తాను అసదుద్దీన్‌తో కొట్లాడుతూనే ఉంటానన్నారు.

News April 10, 2024

పతంజలికి సుప్రీంకోర్టు షాక్

image

కోర్టు ధిక్కరణ కేసులో పతంజలి చెప్పిన ‘బేషరతు క్షమాపణ’ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణ దాఖలు చేసిన అఫిడవిట్‌ను కొట్టేసింది. వారు కోర్టు ధిక్కార చర్యలను తేలికగా తీసుకున్నారని తీవ్రస్థాయిలో మండిపడింది. తమ ఆదేశాలను పదేపదే ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు క్షమాపణ సరిపోదని.. కోర్టు ధిక్కరణ చర్యలకు సిద్ధంగా ఉండండని హెచ్చరించింది.

News April 10, 2024

ఐపీఎస్ అధికారి అంత్యక్రియలకు హాజరైన సీఎం

image

TG: గుండెపోటుతో మరణించిన విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మహా ప్రస్థానంలో రాజీవ్ రతన్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఆయన వెంట మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారు. కాగా నిన్న ఉదయం రాజీవ్ రతన్ గుండెపోటుకు గురై మరణించిన సంగతి తెలిసిందే.

News April 10, 2024

ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్!

image

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్. ప్రభాస్-మారుతి కాంబినేషన్‌లో వస్తున్న ‘రాజాసాబ్’ మూవీ షూటింగ్‌లో మెజారిటీ పార్ట్ పూర్తయిందట. మిగిలిన సీన్స్ ‘సలార్2’తో పాటు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే సంక్రాంతికి ఈ సినిమా అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోందట. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

News April 10, 2024

మోదీ గెలిస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుంది: కిషన్ రెడ్డి

image

TG: మరోసారి మోదీ గెలిస్తే దేశం మరింత అభివృద్ది చెందుతుందని బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించడమే కాకుండా మైనార్టీల ఆత్మగౌరవాన్ని పెంచింది మోదీనే అన్నారు. ఆయన హయాంలోనే రామ మందిర నిర్మాణం సాకారం అయ్యిందన్నారు.