news

News April 3, 2024

కాంగ్రెస్ ‘పాంచ్ న్యాయ్’ అస్త్రం పనిచేస్తుందా? – 1/2

image

ఈ ఎన్నికలకు కాంగ్రెస్ ‘పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారంటీ’ని అస్త్రంగా వాడేందుకు సిద్ధమైంది. యువ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, కిసాన్ న్యాయ్, హిస్సేదారీ న్యాయ్ కింద 25 గ్యారంటీలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తోంది. 30లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ఏటా రూ.లక్ష/నెలకు రూ.8500 జీతానికి ఏడాది కాలం పాటు అప్రెంటీస్‌షిప్ మొదలైనవి యువ న్యాయ్‌లో భాగంగా హామీ ఇస్తోంది.
<<-se>>#Elections2024<<>>

News April 3, 2024

కాంగ్రెస్ ‘పాంచ్ న్యాయ్’ అస్త్రం పనిచేస్తుందా? – 2/2

image

‘నారీ న్యాయ్’‌తో పేద మహిళలకు ఏటా రూ.లక్ష, ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్ వంటి హామీలను ఇచ్చింది. స్వామినాథన్ ఫార్ములా కింద MSP, రుణమాఫీ హామీలతో ‘కిసాన్ న్యాయ్’ రూపొందించింది. వైద్య సేవలపై ప్రత్యేక చట్టం, ఉపాధి హామీ కల్పిస్తామని కార్మికులకు ‘శ్రామిక్ న్యాయ్’ హామీ ఇచ్చింది. కులగణన, రిజర్వేషన్లపై ‘హిస్సేదారీ న్యాయ్’ ప్రకటించింది. మరి ఇవి కాంగ్రెస్‌కు కలిసొస్తాయా? అనేది తెలియాల్సి ఉంది.
<<-se>>#Elections2024<<>>

News April 3, 2024

కివీస్ టీ20 కెప్టెన్‌గా యంగ్ సెన్సేషన్

image

న్యూజిలాండ్ టీ20 కెప్టెన్‌గా యంగ్ సెన్సేషన్ మైకేల్ బ్రేస్‌వెల్ ఎంపికయ్యారు. త్వరలో పాకిస్థాన్‌తో జరగబోయే సిరీస్‌లో ఆయన సారథ్య బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా పాక్‌తో తలపడే జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. జట్టు: బ్రేస్‌వెల్, ఫిన్ అలెన్, చాప్‌మన్, క్లార్క్‌సన్, జాకబ్ డఫ్ఫీ, ఫాక్స్‌క్రాఫ్ట్, లిస్టర్, మెకంజీ, మిల్నే, నీషమ్, విల్ రౌర్కీ, రాబిన్‌సన్, బెన్ సియర్స్, సీఫర్ట్, ఇష్ సోధీ.

News April 3, 2024

వైసీపీ పెన్షన్ డ్రామా: జనసేన

image

AP: పింఛన్ల పంపిణీలో వైసీపీ రాజకీయం చేస్తోందని జనసేన పార్టీ విమర్శించింది. ‘వీఆర్వోలతో భీమ్లా నాయక్ సినిమా టికెట్లు అమ్మించిన జగన్.. వాలంటీర్లు లేకుండా పింఛన్లు ఎందుకు పంపిణీ చేయట్లేదు?’ అని ట్వీట్ చేసింది. వైసీపీ పెన్షన్ డ్రామా ఆడుతోందని విమర్శలు గుప్పించింది. కాగా భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా టికెట్లు అధిక ధరకు విక్రయించకుండా ప్రభుత్వం వీఆర్వోలతో నిఘా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

News April 3, 2024

ముంబై కెప్టెన్‌గా రోహిత్ శర్మ?

image

రోహిత్ శర్మ మళ్లీ ముంబై సారథిగా రావొచ్చని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అభిప్రాయపడ్డారు. ‘ఫ్రాంచైజీలు నిర్ణయాలు తీసుకోవడంలో మొహమాటపడవు. రోహిత్ శర్మను తీసేసి పాండ్యకు కెప్టెన్సీ ఇచ్చారు. 5 టైటిల్స్ అందించిన శర్మకు తిరిగి కెప్టెన్సీ ఇవ్వొచ్చు. పాండ్య కెప్టెన్సీలో MI ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. హార్దిక్ ఒత్తిడిలో ఉన్నట్లు అనిపిస్తోంది. APR 7 లోపు రోహిత్ శర్మకు తిరిగి కెప్టెన్సీ ఇవ్వొచ్చు’ అని చెప్పారు.

News April 3, 2024

చంద్రబాబుది మొసలి కన్నీరు: పేర్ని నాని

image

AP: పింఛన్లపై టీడీపీ అధినేత చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ‘బాబుకు వృద్ధుల ఉసురు తగులుతుంది. వాలంటీర్లు ఇంటికి వెళ్లి పింఛన్లు ఇస్తే YCPకి ఓటేస్తారా? సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇప్పుడు పెన్షన్ పంపిణీ చేయాలని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం అసలు ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. మరి ఇప్పుడు 1.60 లక్షల ఉద్యోగులు ఎక్కడి నుంచి వచ్చారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News April 3, 2024

SRHvsCSK టికెట్స్ ఉన్నాయంటూ మోసం.. తస్మాత్ జాగ్రత్త!

image

ఉప్పల్ స్టేడియంలో SRHvsCSK మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు ప్రయత్నిస్తున్నారు. అయితే, టికెట్లు దొరక్కపోవడంతో బ్లాక్‌లో కొనేందుకు ముందుకొస్తున్నారు. దీంతో టికెట్స్ అందుబాటులో ఉన్నాయంటూ కొందరు ఇన్‌స్టా రీల్స్, స్టోరీలు, యూట్యూబ్ షార్ట్స్‌లో ఫేక్ లింక్స్ పోస్ట్ చేస్తున్నట్లు TSRTC MD సజ్జనార్ ట్వీట్ చేశారు. క్యూఆర్ కోడ్స్ పంపించి లక్షల్లో దండుకుంటున్నారని, లింక్స్‌పై క్లిక్ చేయొద్దని సూచించారు.

News April 3, 2024

తాగునీటి సరఫరా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు

image

TG: రాష్ట్రంలో తాగునీటి ఇబ్బందులపై ప్రభుత్వం దృష్టి సారించింది. తాగునీటి సరఫరా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించింది. 33 జిల్లాలకు 10 మంది ఐఏఎస్‌లను కేటాయిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా వేసవి నేపథ్యంలో చాలా జిల్లాల్లో నీటి కటకట మొదలైంది.

News April 3, 2024

కోహ్లీకి కూడా అసాధ్యం: సెహ్వాగ్

image

ఆర్సీబీ 4 మ్యాచుల్లో కేవలం ఒక్క విజయాన్నే అందుకుంది. దీంతో మరోసారి ఆ జట్టు ప్రదర్శనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆర్సీబీ ఈ సీజన్ విజేతగా నిలవాలంటే విరాట్ కోహ్లీ ఒక్కడిపైనే ఆధారపడటం సరికాదని వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు. ఏడెనిమిది మ్యాచుల్లో గెలిపించే ఇన్నింగ్స్ ఆడటం కోహ్లీకి కూడా అసాధ్యమని వ్యాఖ్యానించారు. కాగా ఈ సీజన్‌లో ఆ జట్టు కెప్టెన్ డుప్లెసిన్, మ్యాక్స్‌వెల్ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు.

News April 3, 2024

‘ఇంటింటికీ గ్యారంటీ’ క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన కాంగ్రెస్

image

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారాన్ని విస్తృతం చేసేందుకు కాంగ్రెస్ ‘ఘర్ ఘర్ గ్యారంటీ’ (ఇంటింటికీ గ్యారంటీ) కార్యక్రమాన్ని లాంచ్ చేసింది. దేశంలోని 8కోట్ల కుటుంబాలకు భారత్ జోడో యాత్ర సమయంలో ప్రకటించిన పాంచ్ న్యాయ్, 25 గ్యారంటీలపై అవగాహన కల్పించనుంది. యువ న్యాయ్, నారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, హిస్సేదారీ న్యాయ్ పేరుతో ‘పాంచ్ న్యాయ్’ లక్ష్యంగా పనిచేస్తామని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది.