News April 3, 2024
SRHvsCSK టికెట్స్ ఉన్నాయంటూ మోసం.. తస్మాత్ జాగ్రత్త!

ఉప్పల్ స్టేడియంలో SRHvsCSK మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు ప్రయత్నిస్తున్నారు. అయితే, టికెట్లు దొరక్కపోవడంతో బ్లాక్‌లో కొనేందుకు ముందుకొస్తున్నారు. దీంతో టికెట్స్ అందుబాటులో ఉన్నాయంటూ కొందరు ఇన్‌స్టా రీల్స్, స్టోరీలు, యూట్యూబ్ షార్ట్స్‌లో ఫేక్ లింక్స్ పోస్ట్ చేస్తున్నట్లు TSRTC MD సజ్జనార్ ట్వీట్ చేశారు. క్యూఆర్ కోడ్స్ పంపించి లక్షల్లో దండుకుంటున్నారని, లింక్స్‌పై క్లిక్ చేయొద్దని సూచించారు.
Similar News
News April 18, 2025
సూపర్‌హిట్ మూవీ సీక్వెల్‌లో తమన్నాకు ఛాన్స్!

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘నో ఎంట్రీ’ సీక్వెల్‌లో హీరోయిన్ తమన్నా భాటియా ఛాన్స్ కొట్టేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ మూవీలో యంగ్ హీరోలు అర్జున్ కపూర్, వరుణ్ ధవన్, దిల్జీత్ దోసాంజ్ లీడ్ రోల్స్‌లో నటించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కాగా 2005లో రిలీజైన ‘నో ఎంట్రీ’లో సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, బిపాసా బసు నటించారు.
News April 18, 2025
JEE మెయిన్ ‘కీ’ తొలగించిన NTA

JEE మెయిన్ ఫలితాల విడుదల వేళ విద్యార్థులను NTA అయోమయానికి గురి చేస్తోంది. ఇవాళ సాయంత్రం అధికారిక వెబ్‌సైట్‌లో ఫైనల్ కీ విడుదల చేసి, కొద్దిసేపటికి దాన్ని తొలగించింది. దీంతో ఫలితాల కోసం ఎదురుచూస్తున్న స్టూడెంట్స్, పేరెంట్స్ ఆందోళనకు గురవుతున్నారు. కాగా ఇవాళ రిజల్ట్స్ వెల్లడించనున్నట్లు ప్రకటించగా, ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంపై NTAపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
News April 18, 2025
సాక్స్‌లు వేసుకుని పడుకుంటే సుఖమైన నిద్ర!

రాత్రి నిద్ర సరిగా పట్టడంలేదని కొందరు, ఎక్కువ సమయం పడుకున్నా సంతృప్తి లేదని మరికొందరు బాధపడుతుంటారు. అయితే సాక్సులు వేసుకుని పడుకోవడం సుఖమైన నిద్రకు ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల పాదాలు వేడెక్కి చర్మం కింది రక్త నాళాలు మిగతా బాడీని కూల్ చేస్తాయంటున్నారు. దాంతో శరీరం నిద్రకు ఉపక్రమిస్తుందంటున్నారు. అయితే ఇన్సోమేనియా వంటి నిద్ర సంబంధిత వ్యాధులున్నవారు ట్రై చేయొద్దని సూచిస్తున్నారు.