news

News April 3, 2024

పెరిగిన ధరలకు ఎవరు బాధ్యులు?: KTR

image

2014లో ఉన్న చమురు ధరలను ఇప్పటితో పోల్చుతూ ప్రతి భారతీయుడు దీని గురించి ఆలోచించాలని మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘2014 నుంచి ముడి చమురు ధరలు బ్యారెల్‌కు దాదాపు 20 డాలర్లు తగ్గాయి. కానీ అదే దశాబ్దంలో లీటర్ పెట్రోల్ రూ.35, డీజిల్‌పై రూ.40 పెరిగాయి. దీనికి ఎవరిని నిందించాలి? నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు ఎవరు బాధ్యత వహించాలి?’ అని ప్రశ్నించారు. 2014 APR 2న లీటర్ పెట్రోల్ రూ.72.26 మాత్రమే.

News April 3, 2024

‘ఇండియా’ కూటమి పేరుపై హైకోర్టు ఆదేశాలు

image

విపక్షాల కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టడంపై దాఖలైన పిటిషన్‌పై 7రోజుల్లో స్పందించాలని కేంద్రం, ప్రతిపక్షాలను ఢిల్లీ HC ఆదేశించింది. వాదనలు ఈ నెల 10న వింటామని తెలిపింది. ఈ విషయంలో కేంద్రం, ప్రతిపక్షాలకు ఇప్పటికే 8 అవకాశాలిచ్చినా.. స్పందన రాలేదని పిటిషనర్ తరఫు లాయర్ వైభవ్ సింగ్ హైకోర్టుకు తెలిపారు. కాగా.. గతంలో UPAగా ఉన్న విపక్ష కూటమి రాజకీయ ప్రయోజనాల కోసం దేశం పేరు వాడుకుంటోందని ఈ పిల్ దాఖలైంది.

News April 3, 2024

ఉదయగిరిలో రసవత్తరంగా ఎన్నికల పోరు

image

AP: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రెండు సార్లు గెలిచిన నియోజకవర్గం నెల్లూరు(D) ఉదయగిరి. ఇక్కడ కాంగ్రెస్ ఏడు సార్లు, YCP, TDP, స్వతంత్రులు రెండు సార్లు, BJP, JP చెరొకసారి గెలిచాయి. MLC ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి(4సార్లు MLA)ని సస్పెండ్ చేసిన YCP.. ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డిని బరిలోకి దింపింది. TDP నుంచి కాకర్ల సురేశ్ పోటీ పడుతున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 3, 2024

అసత్య ప్రచారానికి కొత్త వెబ్‌సైట్‌తో అడ్డుకట్ట

image

లోక్‌సభ ఎన్నికల వేళ అసత్య ప్రచారాలను అడ్డుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త వెబ్‌సైట్‌ను రూపొందించింది. ‘mythvsreality.eci.gov.in’ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్నికల సమయంలో ప్రజలకు కచ్చితమైన సమాచారం అందించే దిశగా దీనిని రూపొందించినట్లు ఈసీ వెల్లడించింది. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో పాటు వెలుగులోకి వచ్చిన అసత్య ప్రచారాలను ప్రజలకు ఈ వెబ్‌సైట్ ద్వారా తెలియజేస్తామంది.

News April 3, 2024

ఐపీఎల్‌ చరిత్రలో తొలి ప్లేయర్‌గా రికార్డు

image

లక్నో సూపర్ జెయింట్స్(LSG) బౌలర్ మయాంక్ యాదవ్ అరుదైన రికార్డు నెలకొల్పారు. ఐపీఎల్ చరిత్రలో ఆడిన తొలి రెండు మ్యాచుల్లో POTM అవార్డు అందుకున్న తొలి ప్లేయర్‌గా నిలిచారు. ఈ సీజన్‌లోనే అరంగేట్రం చేసిన మయాంక్ 150KMPH పైగా బంతులు విసురుతూ సెన్సేషన్‌గా మారారు. పంజాబ్‌, ఆర్సీబీతో మ్యాచుల్లో ఆరు వికెట్లు తీశారు.

News April 3, 2024

వారిని విధుల్లోకి తీసుకోవాలి: కూనంనేని

image

TG: ఆర్టీసీలో స్వల్ప కారణాలతో ఉద్యోగాల నుంచి తొలగించిన 1500 మందికిపైగా సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని CPI రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగాలు లేకపోవడంతో వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో బస్సుల కండిషన్ సరిగా లేకపోవడం వంటి కారణాలతో ప్రమాదాలు జరిగాయని.. వాటికి బాధ్యులుగా సిబ్బందిని తొలగించారని పేర్కొన్నారు.

News April 3, 2024

బలం లేని చోట.. BJP కొత్త పంథా

image

MP అభ్యర్థుల ఎంపికలో BJP కొత్త పంథా ఎంచుకుంది. పార్టీ బలంగా ఉన్న చోట సీనియర్లను సైతం పక్కనబెట్టి కొత్త వారికి ఛాన్స్ ఇస్తోంది. బలమైన అభ్యర్థులు, పార్టీకి బలం లేని చోట వేరే పార్టీ నేతలను చేర్చుకొని టికెట్లు ఇస్తోంది. TGలోనే రాములు, బీబీ పాటిల్, నగేశ్, సీతారాం నాయక్, సైదిరెడ్డి, ఆరూరి వంటి నేతలను ఇలా చేర్చుకుంది. దేశవ్యాప్తంగా 25 మంది ఇటీవల పార్టీలో చేరి టికెట్లు దక్కించుకున్నారు.
<<-se>>#Elections2024<<>>

News April 3, 2024

ఆమంచి ఎన్నికల రేసులోకి వస్తారా?

image

AP: బాపట్ల(D) చీరాల నియోజకవర్గంపై మంచి పట్టున్న నాయకుడు ఆమంచి కృష్ణమోహన్. 2009లో కాంగ్రెస్, 2014లో సొంత పార్టీ నవోదయం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019లో YCP నుంచి పోటీ చేసి ఓడిపోగా ఈసారి ఆయనకు పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన సైలెంట్ అయిపోయారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలా? వద్దా అనే దానిపై అనుచరులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన బరిలో ఉంటే ముక్కోణపు పోటీ తప్పదని విశ్లేషకులు అంటున్నారు.

News April 3, 2024

డెడ్ స్టోరేజీకి నీటి ప్రాజెక్టులు!

image

TG: రాష్ట్రంలో గత 6 నెలల్లో వర్షపాతం 57.6% తగ్గింది. ప్రస్తుతం ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులు అడుగంటుతున్నాయి. నీటి మట్టాలు తాగు అవసరాలకు మినహా సాగుకు అందించలేని డెడ్ స్టోరేజీకి చేరాయి. భూగర్భ జలాలు సైతం గత పదేళ్లలో ఎన్నడూ లేని స్థాయికి తగ్గాయి. భూగర్భ జలమట్టం గత మార్చితో పోలిస్తే 2.5మీటర్ల లోతుకు పడిపోయింది.

News April 3, 2024

తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 56,228 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.04 కోట్లు సమకూరింది.