News April 3, 2024
ఉదయగిరిలో రసవత్తరంగా ఎన్నికల పోరు

AP: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రెండు సార్లు గెలిచిన నియోజకవర్గం నెల్లూరు(D) ఉదయగిరి. ఇక్కడ కాంగ్రెస్ ఏడు సార్లు, YCP, TDP, స్వతంత్రులు రెండు సార్లు, BJP, JP చెరొకసారి గెలిచాయి. MLC ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి(4సార్లు MLA)ని సస్పెండ్ చేసిన YCP.. ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డిని బరిలోకి దింపింది. TDP నుంచి కాకర్ల సురేశ్ పోటీ పడుతున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News April 25, 2025
‘పహల్గామ్’ మృతుల కుటుంబాలకు జగన్ పరామర్శ

AP: పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్, చంద్రమౌళి కుటుంబాలను మాజీ సీఎం జగన్ ఫోన్‌లో పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జరిగిన ఘటన దురదృష్టకరమని అన్నారు. పార్టీపరంగా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
News April 25, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News April 25, 2025
పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఆ దేశంపై భారత ఉమెన్స్ బేస్‌బాల్ టీమ్ అదరగొట్టింది. ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో 2-1 తేడాతో ఘన విజయం సాధించింది.