news

News April 3, 2024

బీసీసీఐ ముందే అలా చేసి ఉండాల్సింది: సిద్ధూ

image

టీ20 ప్రపంచ కప్‌నకు రోహిత్ శర్మను బీసీసీఐ ముందే కెప్టెన్‌గా ప్రకటించి ఉండాల్సిందని మాజీ ప్లేయర్ సిద్ధూ అన్నారు. అలా చేసి ఉంటే ముంబై ఇండియన్స్ సారథిగా కొనసాగి ఉండేవారని అభిప్రాయపడ్డారు. గత ఏడాది అక్టోబర్‌లో రోహిత్‌ను టీ20 WCకు కెప్టెన్‌గా ప్రకటిస్తే బాగుండేదన్నారు. భారత హీరో, టీమ్ ఇండియా సారథిని ముంబై కెప్టెన్‌గా తొలగించడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు.

News April 3, 2024

మహిళా రిజర్వేషన్ జాడేది?

image

చట్ట సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు గతేడాది ఆమోదించింది. ఈ రిజర్వేషన్లు 2026లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అమలయ్యే అవకాశం ఉంది. అయితే.. అప్పటి వరకూ ఎందుకు వేచి చూడాలన్న కాంగ్రెస్.. ఇప్పుడే అమలు చేయవచ్చు కదా అని ప్రశ్నించింది. ఇక ఇప్పటి వరకు ప్రకటించిన MP అభ్యర్థుల్లో ఆ పార్టీ 13% మాత్రమే మహిళలకు సీట్లు ఇచ్చింది. మరోవైపు BJP కూడా 17% మహిళలను నిలబెట్టింది.
<<-se>>#Elections2024<<>>

News April 3, 2024

WARNING: ఈ టైంలో బయటకు రావొద్దు

image

TG: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలను వైద్యారోగ్యశాఖ అప్రమత్తం చేసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలంది. ఎండలో పనిచేయడం, ఆటలాడటం, చెప్పులు లేకుండా బయట తిరగడం వంటివి చేయవద్దని కోరింది. మద్యం, చాయ్, కాఫీ, స్వీట్స్, కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలని సూచించింది.

News April 3, 2024

పెన్షన్ల పంపిణీపై హైకోర్టులో నేడు విచారణ

image

AP: పెన్షన్ల పంపిణీ ప్రక్రియ నుంచి వాలంటీర్లను తొలగిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు నేడు విచారించనుంది. ఈసీ ఆదేశాలను రద్దు చేస్తూ.. వాలంటీర్లతో పెన్షన్లు ఇప్పించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు. గతంలో వాలంటీర్లు ఇంటికొచ్చి పెన్షన్లు ఇచ్చేవారని.. తాజా ఆదేశాలతో సచివాలయాలకు వెళ్లి పెన్షన్లు తీసుకోవడం లబ్ధిదారులకు కష్టంగా మారిందని పిటిషనర్ వాదించారు.

News April 3, 2024

మన్మోహన్‌ 33 ఏళ్ల పార్లమెంట్ ప్రస్థానానికి తెర!

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(91) రాజ్యసభ పదవీ కాలం నేటితో ముగియనుంది. 1991లో తొలిసారి ఆయన పెద్దల సభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు PV నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశ ఆర్థిక స్థితిని గాడిలో పెట్టారు. 2004-2014 వరకు ప్రధానిగా సేవలు అందించారు. కాగా మన్మోహన్ ప్రాతినిధ్యం వహించిన రాజస్థాన్ నుంచి ఈసారి సోనియా గాంధీ రాజ్యసభలో అడుగుపెడుతున్నారు.

News April 3, 2024

సీఎం ఎందుకు రాజీనామా చేయాలి?: ఆతిశీ

image

లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైలుకు వెళ్లిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తారా? అనే ప్రశ్నపై ఆప్ మంత్రి ఆతిశీ స్పందించారు. ఆయన రాజీనామా చేసేందుకు ఒక్క కారణం కూడా లేదని ఆమె అన్నారు. లిక్కర్ స్కాం కేసు ఛార్జిషీట్‌లో కేజ్రీవాల్ పేరు లేదని, ఆయన దోషిగానూ తేలలేదని ఆమె చెప్పుకొచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ఆయనకు ఢిల్లీ అసెంబ్లీలో భారీ మెజార్టీ ఉందని పేర్కొన్నారు.

News April 3, 2024

నేడు కోల్‌కతాతో ఢిల్లీ ఢీ

image

నేడు విశాఖ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఆడిన 2 మ్యాచుల్లోనూ గెలిచి పాయింట్స్‌ టేబుల్‌లో 2వ స్థానంలో ఉన్న కోల్‌కతాను ఢీకొనడం 7వ స్థానంలో ఉన్న ఢిల్లీకి సవాల్‌తో కూడుకున్నదే. అయితే.. తొలి 2మ్యాచుల్లో ఓడిన ఢిల్లీ.. CSKతో జరిగిన చివరి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించింది. బ్యాటింగ్‌లో ఓపెనర్లు పృథ్వీషా, వార్నర్ ఫామ్‌లోకి వచ్చారు. మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి మరి.

News April 3, 2024

రాజానగరం రాజు ఎవరో?

image

AP: పొత్తులో భాగంగా జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గం తూ.గో(D) రాజానగరం. 2009,14లో ఇక్కడ TDP గెలువగా 2019లో YCP అభ్యర్థి జక్కంపూడి రాజా నెగ్గారు. మరోసారి రాజా YCP నుంచి బరిలో నిలువగా.. జనసేన అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ పోటీ చేస్తున్నారు. పథకాలు, ఇళ్ల పట్టాల పంపిణీ కలిసొస్తుందని MLA రాజా భావిస్తున్నారు. TDP క్యాడర్ సపోర్ట్‌, పవన్ ఇమేజ్‌తో గెలుపు ఖాయమని బలరామకృష్ణ ధీమాగా ఉన్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 3, 2024

వీరికి ఇళ్ల వద్దే పెన్షన్.. GOOD NEWS చెప్పిన ప్రభుత్వం

image

AP: సచివాలయాల ఖాతాల్లో నిన్న పెన్షన్ల నిధులు జమ కాగా.. ఇవాళ మధ్యాహ్నం నుంచి ఈ నెల 6 వరకు పంపిణీ చేయనున్నారు. విభిన్న దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యాల పాలైనవారు, మంచం/వీల్ ఛైర్లకే పరిమితమైన వారు, సైనిక పెన్షన్లు పొందే వృద్ధ వితంతువులకు ఇళ్ల వద్దే డబ్బులు ఇస్తారు. మిగతా వారు ఉ.9 నుంచి రాత్రి 7 గంటలలోపు సచివాలయాలకు వెళ్లి పెన్షన్లు తీసుకోవాలి. నగదు పంపిణీ టైంలో ప్రచారాలు, ఫొటోలు, వీడియోలు తీయకూడదు.

News April 3, 2024

ఉమ్మడి చిత్తూరులో నేడు సీఎం జగన్ బస్సు యాత్ర

image

AP: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 7వ రోజు సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగనుంది. ఉదయం 9గంటలకు అమ్మగారిపల్లె నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. తేనెపల్లి, రంగంపేట క్రాస్ మీదుగా మధ్యాహ్నానికి జగన్ పూతలపట్టు చేరుకుంటారు. మ.3గంటలకు పూతలపట్టులో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం పి.కొత్తకోట, పాకాల, గదంకి, పనపాకం, చంద్రగిరి, రేణిగుంట మీదుగా గురువరాజుపల్లె చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.