India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
IPL: లక్నోతో మ్యాచులో ఆర్సీబీ ఓటమి పాలైంది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. 153 రన్స్ మాత్రమే చేసి, ఆలౌటైంది. దీంతో లక్నో 28 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఆఖరిలో లామ్రోర్ (13 బంతుల్లో 33) మెరుపులు మెరిపించినా లాభం లేకుండా పోయింది. లక్నో బౌలర్ మయాంక్ యాదవ్ 4 ఓవర్లలో 14 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశారు.
టీఎంసీ నేత మహువా మొయిత్రాపై ED మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. పార్లమెంట్‌లో ప్రశ్నలకు ముడుపుల కేసులో మహువాపై ఇప్పటికే సీబీఐ కేసు నమోదు చేసింది. బిజినెస్ మ్యాన్ దర్శన్ హీరానందానీ కోసం పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగారని.. ఇందుకుగానూ ఆమె ముడుపులు అందుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సీబీఐ విచారిస్తోంది. సీబీఐ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. కాగా మహువా కృష్ణానగర్ నుంచి MPగా పోటీ చేస్తున్నారు.
లక్నో యంగ్ బౌలర్ మయాంక్ యాదవ్ చరిత్ర సృష్టించారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 3 సార్లు 155 కి.మీ. ఎక్కువ వేగంతో బంతులు వేసి, రికార్డులకెక్కారు. మయాంక్ కేవలం 2 మ్యాచుల్లో 50 కంటే తక్కువ బంతులే వేసి ఈ ఫీట్ సాధించారు. ఉమ్రాన్ మాలిక్, నోర్ట్జే 2 సార్లు ఈ రికార్డు అందుకున్నారు. కాగా, ఐపీఎల్ హిస్టరీలో షాన్ టెయిట్ వేసిన 157.7 కి.మీ. బాల్ రికార్డును ఇప్పటివరకు ఎవరూ బద్దలు కొట్టలేదు.
AP: వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పార్వతీపురం ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ప్రతి ఒక్కరికీ విద్యా, వైద్యం అందించాం. అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేశాం. ఈ సంక్షేమం గ్రామాల్లో కొనసాగాలంటే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. ప్రజలను చైతన్యవంతులను చేసి వైసీపీకి ఓటు వేయించండి.’ అని ఆయన పేర్కొన్నారు.
TG: దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సీఏఏ, NRC రద్దు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో వాటిని అమలు చేయమని స్పష్టం చేశారు. కోదాడలో ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశంలో ముస్లింలకు రక్షణ లేకుండా పోయిందని, కాంగ్రెస్ పార్టీతోనే వారికి రక్షణ ఉంటుందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.
లక్నోతో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ చెత్త రికార్డు నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో డకౌటై ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌటైన మూడో ఆటగాడిగా అప్రతిష్ఠ మూటగట్టుకున్నారు. ఇప్పటివరకు ఆయన 16 సార్లు డకౌట్ అయ్యారు. రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్ చెరో 17 సార్లు డకౌట్ అయ్యి తొలి స్థానంలో ఉన్నారు. మన్‌దీప్ సింగ్, నరైన్, పీయూష్ చావ్లా 15 సార్లు సున్నాకే వెనుదిరిగారు.
AP: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీసీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘జనం వచ్చినా రాకున్నా.. మీ సోది ప్రసంగం వినలేక మధ్యలో వెళ్లిపోయినా.. తిరుగుతూనే ఉండండి చంద్రబాబు. ఎందుకంటే మీకు ఇవే ఆఖరి ఎన్నికలు. ఇంకెప్పుడూ ఇలా ఎండల్లో తిరిగే అవసరం రాదు. 2029 నాటికి వృద్ధాప్యం వల్ల మీరు కదలలేకపోవచ్చు. ఇప్పటికే బెయిల్ కోసం వంద జబ్బుల లిస్టు బయటపెట్టారుగా’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆరుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఇవాళ్టితో ముగిసింది. వారిలో AP నుంచి ప్రభాకర్‌రెడ్డి, రమేశ్, కనకమేడల రవీంద్ర, TG నుంచి రవిచంద్ర, లింగయ్య, జోగినపల్లి సంతోష్ ఉన్నారు. వీరి స్థానంలో APలో YCP నుంచి మేడా శివనాథ్, సుబ్బారెడ్డి, బాబూరావు, TGలో రేణుకా చౌదరి, అనిల్ యాదవ్(INC), వద్దిరాజు రవిచంద్ర(BRS) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
స్నేహితుడిని ఏప్రిల్ ఫూల్ చేయడానికి ప్రయత్నించి అభిషేక్ అనే విద్యార్థి అనూహ్యంగా మరణించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. ఉరి తాడుని మెడకు బిగించుకుని ఆ విద్యార్థి.. ఫ్రెండ్‌కు వీడియో కాల్ చేశాడు. తాను సూసైడ్ చేసుకుంటున్నానని చెప్పాడు. ఇంతలో తాను నిలబడ్డ కుర్చీ పడిపోవడంతో ఉరి బిగుసుకుపోయి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సాధారణంగా ఎన్నికల వేళ జోరు ప్రదర్శించే స్టాక్ మార్కెట్లలో ఈసారి ఆశించినంత జోష్ లేకపోవడం చర్చనీయాంశమైంది. రాజకీయ పరిణామాలే ఇందుకు కారణమంటున్నారు విశ్లేషకులు. ఎలక్టోరల్ బాండ్ల వివాదం, అవినీతి ఆరోపణలు మొదలైన అంశాలు సంచలనమైన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా ఉంటున్నారట. మార్కెట్ల జోష్ BJP గెలుపుతో ముడిపడి ఉందని.. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తే మార్కెట్లు ఊపందుకుంటాయని చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.