News April 2, 2024

స్టాక్ మార్కెట్లలో ఎన్నికల జోష్ కనిపించదేం?

image

సాధారణంగా ఎన్నికల వేళ జోరు ప్రదర్శించే స్టాక్ మార్కెట్లలో ఈసారి ఆశించినంత జోష్ లేకపోవడం చర్చనీయాంశమైంది. రాజకీయ పరిణామాలే ఇందుకు కారణమంటున్నారు విశ్లేషకులు. ఎలక్టోరల్ బాండ్ల వివాదం, అవినీతి ఆరోపణలు మొదలైన అంశాలు సంచలనమైన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా ఉంటున్నారట. మార్కెట్ల జోష్‌ BJP గెలుపుతో ముడిపడి ఉందని.. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తే మార్కెట్లు ఊపందుకుంటాయని చెబుతున్నారు.

Similar News

News April 25, 2025

నేడు ఢిల్లీకి సీఎం.. PMకు ‘అమరావతి’ ఆహ్వానం

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. మే 2న అమరావతి పనుల పున:ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధాని మోదీని ఆయన ఆహ్వానిస్తారు. సాయంత్రం తిరుగు ప్రయాణమై రాత్రి 9 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.

News April 25, 2025

మరో సంచలన నిర్ణయం దిశగా భారత్?

image

ఉగ్రదాడి తర్వాత పాక్‌పై దౌత్యచర్యలు తీసుకుంటున్న భారత్ మరో సంచలన నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. FEB 24, 2021న అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేయనున్నట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. ఉగ్ర సంస్థలు కశ్మీర్‌లోకి చొరబడటంతోపాటు తరచూ సరిహద్దుల్లో పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడుతోంది. దీంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేసి మన సైన్యానికి అదనపు బలం ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది.

News April 25, 2025

SC గురుకులాల్లో ప్రవేశాలు.. నేటి నుంచి దరఖాస్తులు

image

TG: రాష్ట్రంలోని 239 ఎస్సీ గురుకులాల్లో ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుంది. మే 15 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఒకేషనల్ కోర్సుల్లో సీట్లు ఉంటాయి. టెన్త్ పరీక్షల్లో మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://tgswreis.cgg.gov.in/

error: Content is protected !!