news

News April 1, 2024

ఈరోజు NEFT లావాదేవీలు చేయొద్దు: HDFC

image

తమ వినియోగదారులకు HDFC బ్యాంకు కీలక సూచనలు చేసింది. ఈ రోజు NEFT లావాదేవీలు చేయొద్దని స్పష్టం చేసింది. ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా జరిగే కొన్ని కార్యకలాపాల దృష్ట్యా ఈరోజు చేపట్టే NEFT ట్రాన్సాక్షన్స్ ఆలస్యం కావడం లేదా అందుబాటులో ఉండకపోవడం జరగొచ్చని వివరించింది. దాని బదులు IMPS, RTGS, UPI విధానాలను వాడుకోవాలని కోరింది.

News April 1, 2024

ఎన్నికల వరకు కేజ్రీవాల్ బయటికొచ్చేనా?

image

లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ CM కేజ్రీవాల్‌కు కోర్టు ఏప్రిల్ 15 వరకు జుడీషియల్ రిమాండ్ విధించింది. లోక్‌సభ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ. ఢిల్లీలో మే 25న 7 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. దీంతో ఆయన అప్పటివరకు బయటికి వస్తారా? లేదా? అని పార్టీ శ్రేణులు సందిగ్ధంలో పడ్డాయి. విచారణ పేరుతో కేజ్రీవాల్‌కు కోర్టు రిమాండ్‌ను పొడిగిస్తే పోలింగ్ నాటికి ఆయన బయటికి రావడం కష్టమే.

News April 1, 2024

ఫోన్ ట్యాపింగ్‌లో పెద్ద నేతలు ఉన్నారు: ఉత్తమ్

image

TG: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పెద్ద నేతలందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారని మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ‘నా ఫోన్‌ కూడా ట్యాప్ చేశారు. ఎవరి ఆదేశాలతో ఇదంతా చేశారో త్వరలోనే తెలుస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్‌ చేసి జైలుకు వెళ్లారు. వారి సర్కారు గొర్రెల స్కామ్ చేసింది. ఆ పార్టీ త్వరలోనే మొత్తం ఖాళీ కావడం ఖాయం’ అని పేర్కొన్నారు.

News April 1, 2024

అక్కడే మా మ్యాచ్ పోయింది: మురళీధరన్

image

ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకు 16వ ఓవర్లో లెగ్ స్పిన్నర్‌‌తో బౌలింగ్ వేయించడమే నిన్న SRH ఓటమికి ప్రధాన కారణమని ఆ జట్టు బౌలింగ్ కోచ్ మురళీధరన్ తెలిపారు. ‘మార్కండే లెగ్ స్పిన్నర్ కావడంతో తనపై షాట్స్ ఆడతారని తెలుసు. వికెట్లు పడతాయన్న ఆలోచనతో తనతో వేయించాం. సక్సెస్ కాలేదు. క్రికెట్‌లో ఇలాంటివి సహజమే. కచ్చితంగా బలంగా తిరిగొస్తాం’ అని స్పష్టం చేశారు. హసరంగ జట్టులో చేరతారని నమ్మకం ఉందని ఆయన తెలిపారు.

News April 1, 2024

బీఆర్ఎస్‌కు కడియం ద్రోహం చేశారు: హరీశ్

image

TG: కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరిపై BRS ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రవ్యాఖ్యలు చేశారు. నైతిక విలువలు ఉంటే పార్టీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిని విమర్శించి ఆయనతోనే జట్టు కట్టారని దుయ్యబట్టారు. రాజకీయాల్లో ఇంత దిగజారుడుతనం అవసరమా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌కు కడియం ద్రోహం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

News April 1, 2024

కొలిక్కిరాని ఖమ్మం అభ్యర్థి ఎంపిక!

image

ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ ముగిసింది. తెలంగాణలో 4 పెండింగ్ స్థానాలపై పార్టీ అగ్రనేతలతో రేవంత్ రెడ్డి, భట్టి, దీపాదాస్ మున్షీ సుదీర్ఘ కసరత్తు చేశారు. వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ స్థానాల అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. అయితే ఖమ్మం అభ్యర్థిత్వంపైనే ఇంకా క్లారిటీ రానట్లు తెలుస్తోంది. దీంతో ఈనెల 9న మరోసారి సమావేశమై చర్చించే అవకాశం ఉంది.

News April 1, 2024

సెలబ్రిటీలు నిలబెట్టారు.. మరి ఇప్పుడో? – 1/2

image

కొన్నిచోట్ల స్టార్‌డమ్ పార్టీలను గెలిపిస్తుంది. BJPకి పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ లోక్‌సభ సీటు అలా వచ్చిందే. బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నాను నిలబెట్టి 1998లో తొలిసారి గెలుపొందిన BJP.. 1999, 2004లోనూ ఖన్నా సాయంతో విజయపరంపర కొనసాగించింది. 2009లో ఓడినా 2014లో ఖన్నా మళ్లీ గెలిచారు. 2017లో ఆయన మృతి తర్వాత సవర్న్ సింగ్ అనే పారిశ్రామికవేత్తకు బైఎలక్షన్‌లో BJP టికెట్ ఇవ్వగా ఓటమి ఎదురైంది.
<<-se>>#Elections2024<<>>

News April 1, 2024

సెలబ్రిటీలు నిలబెట్టారు.. మరి ఇప్పుడో? – 2/2

image

ఇక 2019లో BJP మళ్లీ సెలబ్రిటీ అస్త్రాన్ని (బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్) ప్రయోగించి గెలుపొందింది. కానీ 2020 SEP తర్వాత సన్నీ ఒక్కసారీ అక్కడ పర్యటించకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందట. దీంతో ఈసారి లోకల్ లీడర్ దినేశ్ సింగ్‌ను ఎంపిక చేసింది. మరి సెలబ్రిటీ సెంటిమెంట్ నుంచి BJP బయటపడుతుందా? అకాలీదళ్ మద్దతు లేని లోటు కనిపిస్తుందా? మోదీ మేనియా పనిచేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
<<-se>>#Elections2024<<>>

News April 1, 2024

చెరిపేస్తే చెరగని సత్యం కేసీఆర్: కేటీఆర్

image

TG: మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణను నంబర్-1గా నిలబెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ‘రూ.3.09 లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే తెలంగాణ నంబర్-1. అయినా ఏం చేశావు కేసీఆర్ అని మీడియా, ప్రతిపక్షాలు అంటాయి. చెరిపేస్తే చెరగని సత్యం కేసీఆర్ సాధించిన ఆర్థిక ప్రగతి. జై తెలంగాణ’ అని ఆయన ట్వీట్ చేశారు.

News April 1, 2024

స్వర్ణయుగం మొదలైందని రాముడు చెప్పినట్లనిపించింది: పీఎం

image

అయోధ్యలో ప్రతిష్ఠాపన సమయంలో రామ్ లల్లా మాట్లాడినట్లు అనిపించిందని పీఎం మోదీ తెలిపారు. ‘అయోధ్యకు వెళ్లాక నన్ను నేను ప్రధానిగా కాక సాధారణ పౌరుడిగానే భావించాను. అది చాలా భావోద్వేగ క్షణం. రాముడిని తొలిసారి చూడగానే అలా చూస్తూ ఉండిపోయా. పండితులు ఏం చెబుతున్నారో వినిపించలేదు. భారత్‌కు స్వర్ణయుగం మొదలైందని రాముడు చెప్పినట్లు అనిపించింది. 140కోట్లమంది కలల్ని రాముడి కళ్లలో చూశాను’ అని వివరించారు.