news

News March 31, 2024

రాష్ట్ర ప్రజల కోసమే తగ్గాను: పవన్ కళ్యాణ్

image

AP: వైసీపీ కుట్రలు, కుతంత్రాలను సమర్థంగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు జనసేనాని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. పిఠాపురంలో కార్యకర్తలతో సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజల కోసమే తాను తగ్గానని తెలిపారు. జనసేన-టీడీపీ కలిసి ముందుకు వెళ్తేనే రాష్ట్రాన్ని కాపాడుకోగలమని అన్నారు. నాయకుల మధ్య ఇబ్బందులు ఉంటే సర్దుకుపోవాలని.. పిఠాపురంలో తన గెలుపు చరిత్రలో నిలిచిపోవాలన్నారు.

News March 31, 2024

తొలి ఐపీఎల్ టీమ్‌గా రికార్డు

image

ఐపీఎల్ ఫ్రాంచైజీ CSK అరుదైన ఘనత అందుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 15 మిలియన్ ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న తొలి IPL టీమ్‌గా నిలిచింది. దీంతో సోషల్ మీడియాలోనూ చెన్నై డామినేషన్ కొనసాగుతోందని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. కాగా ఆ తర్వాతి స్థానాల్లో ఆర్సీబీ 13.5M, ముంబై ఇండియన్స్ 13.2M ఫాలోవర్స్‌ను కలిగి ఉన్నాయి.

News March 31, 2024

పెన్షన్ల పంపిణీపై సెర్ప్ కీలక ఉత్తర్వులు

image

AP: గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బందితో సచివాలయాల్లో పెన్షన్ల <<12961551>>పంపిణీ<<>> చేపట్టాలని సెర్ప్ ఆదేశించింది. ‘వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయకూడదు. ఎలక్షన్ కోడ్ ముగిసేవరకు ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ ఉండదు. లబ్ధిదారులు ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డు చూపించి.. పెన్షన్ తీసుకోవాలి’ అని స్పష్టం చేసింది. కాగా వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీపై సీఈసీ ఆంక్షలు విధించింది.

News March 31, 2024

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ

image

చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో పృథ్వీషా రీఎంట్రీ ఇస్తున్నారు.
జట్లు: CSK: రుతురాజ్ (C), రచిన్ రవీంద్ర, రహానే, మిచెల్, జడేజా, సమీర్ రిజ్వీ, ధోనీ(w), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్, పతిరణ.
DC: వార్నర్, మార్ష్, పృథ్వీ షా, పంత్ (C), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, ఇషాంత్, అన్రిచ్ నార్ట్జే, ఖలీల్, ముకేశ్.

News March 31, 2024

హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమాన సేవలు

image

TG: బాల రాముడి దర్శనానికి వెళ్తే భక్తుల కోసం హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమాన సేవలు అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 2 నుంచి వారానికి 3 రోజులు(మంగళ, గురు, శనివారం) స్పైస్ జెట్ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఉదయం 10:00 గంటలకు బయల్దేరి 12:45కు అయోధ్యకు చేరుకుంటాయి. తిరిగి అక్కడి నుంచి మధ్యాహ్నం 01:25కి బయలుదేరుతాయి.

News March 31, 2024

IPL: హైదరాబాద్ ఓటమి

image

గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచులో SRH ఓటమి పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఛేదనలో గుజరాత్ బ్యాటర్లు రాణించడంతో 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. GT బ్యాటర్లలో సుదర్శన్(45), మిల్లర్(44*), గిల్(36) రాణించారు.

News March 31, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక సూత్రధారి ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి వస్తున్నట్లు తెలుస్తోంది. రేపు ఆయన హైదరాబాద్‌కు చేరుకోనున్నట్లు సమాచారం. ప్రభాకర్ రావును విచారించిన అనంతరం బీఆర్ఎస్ కీలక నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఈ కేసులో అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న సస్పెండై పోలీసు కస్టడీలో ఉన్నారు.

News March 31, 2024

కేంద్ర ఆర్థిక మంత్రి ఆస్తి ఎంతంటే..

image

ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన వద్ద డబ్బు లేదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. 2022లో నిర్మల రాజ్యసభ ఎంపీ నామినేషన్‌ ప్రకారం.. ఆమెకు రూ.1.87 కోట్ల స్థిరాస్తులు, రూ.65.55 లక్షల చరాస్తులు ఉన్నాయి. రూ.26.91 లక్షల అప్పు ఉంది. ఇది రెండేళ్ల క్రితం నాటిది. ప్రస్తుతం ఆస్తి విలువ కొంతమేర పెరిగే అవకాశం ఉంది.

News March 31, 2024

ఏప్రిల్ 6న దీక్షలు: KCR

image

TG: కొత్తగా వచ్చే పంటకు కాంగ్రెస్ వాగ్దానం చేసినట్లుగా రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాలని మాజీ CM KCR డిమాండ్ చేశారు. ‘ఏప్రిల్ 2న దీనిపై BRS నేతలు అధికారులకు మెమోరాండాలు ఇస్తారు. ఏప్రిల్ 6న బోనస్ కోసం దీక్షలు చేస్తాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రభుత్వంపై యుద్ధం చేద్దాం. పాలన చేతకాకపోతే దిగిపోవాలని చెబుతాం. ఈ అసమర్థ ప్రభుత్వం మెడలు వంచి రైతులకు నష్టపరిహారం ఇప్పిస్తాం’ అని స్పష్టం చేశారు.

News March 31, 2024

జస్ట్ 1.8 శాతం ఓట్ల తేడాతో గట్టెక్కారు: కేసీఆర్

image

TG: అధికారంలోకి వచ్చి నాలుగో నెల గడుస్తున్నా రుణ మాఫీపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేసీఆర్ ధ్వజమెత్తారు. ‘డిసెంబర్ 9 ఎప్పుడు పోయింది. సీఎం రేవంత్ ఎక్కడ పడుకున్నారు. జనాలకు ఇష్టమొచ్చిన సొల్లు పురాణాలు చెప్పి జస్ట్ 1.8శాతం ఓట్ల తేడాతో గట్టెక్కి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. మిమ్మల్ని నిద్రపోనివ్వం. తరిమి కొడతాం’ అని హెచ్చరించారు.