India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగింది. నిన్న 7 మండలాల్లో తీవ్ర వడగాలులు, 52 మండలాల్లో వడగాలులు వీచినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇవాళ 33 మండలాలు, రేపు 64 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అన్ని జిల్లాల్లో 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. వడగాలుల ప్రభావం ఉండే మండలాల జాబితాను ఇక్కడ <
AP: ఎన్నికల వేళ అన్నమయ్య జిల్లా రాయచోటిలో భారీగా వెండి, నగదు పట్టుబడింది. ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 931 కేజీల వెండి, రూ.21 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అవి తమిళనాడుకు చెందిన వ్యాపారులు సంపత్, కన్నాకు చెందిన సొత్తుగా గుర్తించారు. పట్టుబడిన వెండి, నగదును జీఎస్టీ, ఐటీ శాఖ అధికారులకు అప్పగించారు.
PBKSతో మ్యాచులో 155కి.మీ వేగంతో బంతిని విసరడంపై LSG బౌలర్ మయాంక్ స్పందించారు. ‘ఇంతకుమించిన అద్భుతమైన అరంగేట్రం ఉంటుందని అనుకోవడం లేదు. మ్యాచ్‌కు ముందు కాస్త ఆందోళన పడ్డా. స్టంప్స్‌ను లక్ష్యంగా చేసుకుని బంతులు వేయాలని ముందే నిర్ణయించుకున్నా. మధ్యలో స్లో బంతులు వేయాలనుకున్నా.. కుదరలేదు. ఈ సీజన్‌లో ఫాస్టెస్ట్ బంతిని విసరడం జీవితంలో మరిచిపోలేను. కెరీర్‌లో తొలి వికెట్ ఎప్పటికీ ప్రత్యేకమే’ అని తెలిపారు.
మీ ఫోన్లలో ఫేస్‌బుక్, X సహా సోషల్ మీడియా అకౌంట్లు, యాప్‌లను లాగిన్ అయ్యేటప్పుడు పాస్‌వర్డ్‌లు, ఇతర వివరాల ఆటోఫిల్ ఆప్షన్‌కు ఓకే చేస్తున్నారా? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్లే. దీనివల్ల మొబైల్ OSలో పాస్‌వర్డ్ మేనేజర్ల సామర్థ్యం తగ్గిపోతుందని, సైబర్ నేరగాళ్లు సులభంగా దాడి చేస్తారని IIIT HYD ప్రొఫెసర్ అంకిత్ గంగ్వాల్ చేసిన పరిశోధనలో తేలింది. అందుకే సొంతంగా పాస్‌వర్డ్ టైప్ చేయాలని సూచిస్తున్నారు.
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్ డైరెక్షన్‌లో హీరో సందీప్ కిషన్ ఓ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘వైబ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. కాలేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. కాగా సందీప్ నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ ఇటీవల విడుదలై ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
మాల్దీవులకు చైనా సైనిక సహాయాన్ని ఫ్రీగా అందిస్తోంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని అమలు చేస్తూ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనాలు కలిగేలా చర్యలు తీసుకొంటోంది. అంబులెన్స్‌లు, సివిల్ వాహనాలు గిఫ్ట్‌గా ఇస్తోంది. తాగునీటిని పంపిస్తోంది. మాలేలో రోడ్లను ఫ్రీగా నిర్మించేందుకు అంగీకరించింది. వ్యవసాయ రంగ వృద్ధికి సాయపడే పలు ఒప్పందాలు చేసుకుంది. ఇవన్నీ ఇరు దేశాల బంధాన్ని బలపరుస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
TG: గొంతులో పచ్చి చేప ఇరుక్కుపోవడంతో ఓ వ్యక్తి ఊపిరాడక చనిపోయాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగింది. మేడిగడ్డ తండాకు చెందిన నీల్యానాయక్ (45) మోతిఘణపూర్ గ్రామ శివారులోని చెరువులో శనివారం స్నేహితులతో కలిసి చేపలు పట్టాడు. ఒక చేపను తినేందుకు ప్రయత్నించగా అది గొంతులో ఇరుక్కుపోయింది. స్నేహితులు ఆ చేపను అతని నోట్లో నుంచి తీసేలోపే ఊపిరి ఆడక అతను ప్రాణాలు కోల్పోయాడు.
యశ్ హీరోగా మలయాళ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ ‘టాక్సిక్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ హీరోయిన్‌గా నటించనుందంటూ వార్తలొచ్చాయి. అయితే తాజాగా మరో రూమర్ వినిపిస్తోంది. మూవీలో కరీనా యశ్ సోదరి పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక యశ్ సరసన కియారా అద్వానీ నటించనుందని సమాచారం. కాగా ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది.
APCC చీఫ్ షర్మిల ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. AICC నేతలతో ఆమె భేటీ కానున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇటీవల ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన రాష్ట్ర కాంగ్రెస్.. వాటిని స్క్రూటినీ చేసింది. ఇవాళ ఢిల్లీ పెద్దలతో చర్చించి, ఆ జాబితాను ఫైనల్ చేయనున్నారు. మరోవైపు మరో నలుగురు MP అభ్యర్థులను ఖరారు చేసేందుకు TG CM రేవంత్ రెడ్డి కూడా హస్తిన వెళ్లనున్నారు.
మాలీవుడ్‌లో రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ‘మంజుమ్మల్ బాయ్స్’ ఏప్రిల్ 5 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో మలయాళంలో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ ఏప్రిల్ 6న రిలీజ్ చేయనుంది. లోతైన గుహలో జారిపడిన యువకుడిని స్నేహితులు ఎలా కాపాడారన్న అంశంతో వాస్తవ ఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.
Sorry, no posts matched your criteria.