News September 7, 2024
కేరళలో విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్!
‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈనెల మధ్య నుంచి కేరళలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. దాదాపు నెలన్నర రోజులకు పైగా ఫైట్స్‌తో పాటు సాంగ్స్ షూట్ చేయనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. దసరా పండుగకు టైటిల్‌ను అనౌన్స్ చేస్తారని టాక్. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు.
Similar News
News October 15, 2024
ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా మెండిస్
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా శ్రీలంక ఆటగాడు కమిందు మెండిస్ నిలిచారు. సెప్టెంబర్‌లో అద్భుత ప్రదర్శన చేసినందుకుగానూ ఆయనను ఈ అవార్డు వరించింది. కాగా ఈ ఏడాది ఆయన రెండు సార్లు ఈ పురస్కారం అందుకున్నారు. గతంలో టీమ్ ఇండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్ మాత్రమే ఒక క్యాలెండర్ ఇయర్‌లో రెండు సార్లు ఈ అవార్డు దక్కించుకున్నారు. ఇప్పుడు మెండిస్ కూడా ఆయన సరసన చేరారు.
News October 15, 2024
ఆ కేసులను ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ చేయాలి: CM
AP: శ్రీసత్యసాయి(D) నల్లబొమ్మనిపల్లిలో అత్తాకోడళ్లపై సామూహిక <<14338493>>అత్యాచారం<<>> కేసును ప్రత్యేక కోర్టు ద్వారా విచారించాలని CM చంద్రబాబు ఆదేశించారు. ఈ కేసు విచారణపై అధికారులతో సమీక్షించారు. గతంలో బాపట్లలో మహిళపై సామూహిక హత్యాచారం ఘటనపైనా ప్రత్యేక కోర్టు ద్వారా విచారించాలని, నిందితులకు వెంటనే శిక్ష పడేలా చేయాలన్నారు. హైకోర్టుకు విన్నవించి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేద్దామన్నారు.
News October 15, 2024
ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే సహించను: చంద్రబాబు
AP: మద్యం దుకాణాల్లో వాటాల కోసం అరాచకాలు సృష్టిస్తే సహించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. మద్యం, ఇసుక విషయంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ విధానానికి కట్టుబడి ఉండాలని చెప్పారు. ‘వైన్ షాపులు గెలుపొందిన వారు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా వాటాల కోసం బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ఆయన అధికారులను ఆదేశించారు.