news

News March 30, 2024

BIG BREAKING: వాలంటీర్లపై సీఈసీ ఆంక్షలు

image

AP: కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ల విధులపై ఆంక్షలు విధించింది. సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బులు పంపిణీ చేయించొద్దని ఆదేశించింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, పరికరాలను స్వాధీనం చేసుకోవాలని సూచించింది. సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొంది.

News March 30, 2024

10 ఫీట్ ఎత్తు అస్థిపంజరాలపై పరిశోధనలు

image

USలో పూర్వం సంచరించిన భారీ మనుషుల అస్థిపంజరాలపై సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. 1912-1924 మధ్య కాలంలో నెవాడాలో మైనింగ్ చేస్తుండగా 8 నుంచి 10 అడుగుల ఎత్తు మమ్మీలు బయటపడ్డాయి. ఈజిప్టులో మాదిరిగానే మమ్మిఫికేషన్ చేశారు. Si-Te-Cah అని పిలిచే ఈ నరమాంస భక్షకులు 15 అంగుళాల చెప్పులు, ఒక ముద్ర కలిగిన పెద్ద బండరాయిని ధరించేవారట. వీరు నివసించిన ప్రాంతంలోనే Paiute తెగ జీవించిందని గుర్తించారు.

News March 30, 2024

కేజ్రీవాల్ భార్యను కలిసిన సోరెన్ సతీమణి

image

లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతను ఝార్ఖండ్ మాజీ CM హేమంత్ సోరెన్ భార్య కల్పన కలిశారు. కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో సునీతకు తన సానుభూతిని తెలిపారు. ఇటీవల మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్‌ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత స్పందించిన కల్పన.. సునీత బాధను తాను అర్థం చేసుకోగలనంటూ మద్దతుగా నిలిచారు.

News March 30, 2024

పవన్ ‘వారాహి సభ’కు అనుమతి నిరాకరణ

image

AP: జనసేనాని పవన్ కళ్యాణ్‌‌కు పిఠాపురం పోలీసులు షాక్ ఇచ్చారు. ‘వారాహి’ సభకు అనుమతి నిరాకరించారు. వారాహి వాహనంపై నిల్చొని మాట్లాడొద్దని సూచించారు. నిర్ణీత సమయంలో వాహనం కోసం దరఖాస్తు చేసుకోనందుకే అనుమతి ఇవ్వడంలేదని తెలిపారు. చిన్నపాటి వాహనానికి అనుమతించారు. కాగా పోలీసుల తీరుపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News March 30, 2024

LSGలోకి న్యూజిలాండ్ ప్లేయర్

image

ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో(LSG) జట్టు ప్లేయర్‌ను మార్పు చేసింది. వ్యక్తిగత కారణాలతో టోర్నమెంట్ నుంచి తప్పుకున్న డేవిడ్ విల్లీ స్థానంలో న్యూజిలాండ్ బౌలర్‌ను తీసుకుంది. రూ.1.25 కోట్ల బేస్ ప్రైజ్‌తో NZ బౌలర్ హెన్రీ లక్నో జట్టుతో చేరారు. గతంలో పంజాబ్ కింగ్స్, CSK జట్లలో భాగమైన హెన్రీ.. పంజాబ్ తరఫున మాత్రమే 2 మ్యాచ్‌లు ఆడారు.

News March 30, 2024

టెర్రరిస్ట్‌ను ఇంటర్వ్యూ చేయబోయి బందీగా మారిన యూట్యూబర్

image

అమెరికాకు చెందిన యూట్యూబర్ ఓ టెర్రరిస్ట్ నాయకుడిని ఇంటర్వ్యూ చేయబోయి బందీగా మారాడు. హైతీకి చెందిన గ్యాంగ్ లీడర్ బార్బెక్యూను ఇంటర్వ్యూ చేసేందుకు అమెరికన్ యూట్యూబర్ అడిసన్ పిర్రే మాలౌఫ్ హైతీకి వెళ్లాడు. కానీ అక్కడికి వెళ్లిన కాసేపటికే మరో గ్యాంగ్ అతడిని కిడ్నాప్ చేసి 6 లక్షల డాలర్లు డిమాండ్ చేసింది. కాగా అడిసన్‌కు యూట్యూబ్‌లో 1.4 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇతడు భయంకర ప్రదేశాలను అన్వేషిస్తుంటాడు.

News March 30, 2024

అన్నం తినేవాళ్లు పార్టీ మారరు: కౌశిక్ రెడ్డి

image

TG: అన్నం తినే వారు ఎవరూ పార్టీ మారరని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ‘కడియం శ్రీహరి పార్టీకి తీరని ద్రోహం చేశారు. ఆయనకు పార్టీ ఏం తక్కువ చేసింది? ఆయన పార్టీని నమ్మించి గొంతు కోశారు. పార్టీలు మారే వారిని ప్రజలు ఛీ కొడుతున్నారు. ఆ నేతలకు పార్లమెంట్ ఎన్నికల తర్వాత నిజం తెలుస్తుంది’ అని ఆయన మండిపడ్డారు.

News March 30, 2024

వడ్డీ రేట్లలో నో ఛేంజ్?

image

వడ్డీ రేట్లలో ఆర్‌బీఐ ఎలాంటి మార్పులు చేయకపోవచ్చని గోల్డ్‌మ్యాన్ సాచ్స్ సంస్థ వెల్లడించింది. ఏప్రిల్ 5న జరిగే మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రెపోరేటును యథాతథంగా (6.5%) కొనసాగించాలని RBI నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. ఆహార ఉత్పత్తుల ధరల పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో RBI అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం 5.1% నమోదు కాగా ఈనెల అది 5.2%కు పెరగొచ్చని అంచనా వేసింది.

News March 30, 2024

YCP ఇచ్చేది రూ.10.. దోచేది రూ.100: బాబు

image

AP: వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేస్తోందని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. ప్రజలకు రూ.10 ఇస్తూ.. రూ.100 దోచుకుంటుందని ఆరోపించారు. ‘పేదలకు సాయం చేయాలని జగన్‌కు లేదు. ఈ ఐదేళ్లలో ఎలాంటి మార్పు జరగలేదు. జగన్ పాలనలో అన్ని వర్గాలూ దెబ్బతిన్నాయి. రాష్ట్రం మొత్తాన్ని దోచుకోవాలని ఆయన ఆశ. వైసీపీని ఓడించేందుకు ప్రజలు చిత్తశుద్ధితో ఉన్నారు. మేం ఎప్పుడూ పేదల పక్షమే’ అని ఆయన పేర్కొన్నారు.

News March 30, 2024

హేమ మాలినిపై బాక్సర్ విజేందర్ సింగ్ పోటీ

image

ప్రముఖ నటి హేమ మాలినిపై స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ పోటీ చేయనున్నారు. మథుర బీజేపీ ఎంపీ అభ్యర్థిగా హేమ బరిలోకి దిగగా.. విజేందర్‌కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఏప్రిల్ 26న ఇక్కడ పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే వరుసగా రెండుసార్లు మథుర ఎంపీగా గెలిచిన హేమపై విజేందర్ పైచేయి సాధిస్తాడా? లేదా అనేది చూడాలి.