News September 6, 2024
టాప్-10 పెయిడ్ ఆటగాళ్లు వీరే.. కోహ్లీది ఎన్నో స్థానం అంటే?
వరల్డ్‌లోనే అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాళ్లలో పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో (రూ.2,081 కోట్లు) అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత జాన్ రామ్-రూ.1,712 కోట్లు, మెస్సీ-రూ.1,074 కోట్లు, లెబ్రాన్ జేమ్స్-రూ.990 కోట్లు, ఎంబాపే-రూ.881 కోట్లు, గియాన్నిస్-రూ.873 కోట్లు, నెయ్‌మార్-రూ.864 కోట్లు, బెంజిమా-రూ.864 కోట్లు, విరాట్ కోహ్లీ-రూ.847 కోట్లు, స్టీఫెన్ కర్రీ-రూ.831 కోట్లు గడించారు.
Similar News
News October 5, 2024
WARNING: ఈ నంబర్ నుంచి కాల్ వస్తే లిఫ్ట్ చేయొద్దు!
పాకిస్థాన్ నుంచి సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్స్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. +92తో ప్రారంభమయ్యే నంబర్ల నుంచి కాల్ వస్తే లిఫ్ట్ చేయొద్దంటున్నారు. పోలీస్ యూనిఫాంలో ఉన్న ఫొటోలను డీపీగా పెట్టుకుని చీట్ చేస్తారని, నమ్మితే మోసపోతారని హెచ్చరిస్తున్నారు. ఆగ్రాకు చెందిన ఓ మహిళను ఇలాగే మోసగించడంతో <<14268213>>ఆమె<<>> గుండెపోటుతో మరణించింది. >>SHARE IT
News October 5, 2024
బతుకమ్మ అంటే ఈ ముఖ్యమంత్రికి గిట్టదా?: KTR
TG: బతుకమ్మ పండుగ వేళ గ్రామాల్లో చెరువు వద్ద లైట్లు పెట్టడానికి, పరిశుభ్రత కోసం బ్లీచింగ్ పౌడర్ కొనడానికి డబ్బుల్లేని పరిస్థితులు దాపురించాయని KTR అన్నారు. ‘బతుకమ్మ అంటే గిట్టదా, పట్టదా ఈ ముఖ్యమంత్రికి? ఆడబిడ్డల వేడుకకు ఏర్పాట్లు చేయడానికి మనసు రావట్లేదా? బతుకమ్మ చీరలను రద్దు చేశారు. ఇప్పుడు ఉత్సవాలను ఘనంగా చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారా?’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని X వేదికగా ప్రశ్నించారు.
News October 5, 2024
రేపు ఢిల్లీకి రేవంత్.. సీఎంల భేటీకి హాజరు
TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. తీవ్రవాద నిరోధంపై కేంద్ర హోంశాఖ నిర్వహించనున్న అన్ని రాష్ట్రాల సీఎంలు, హోంమంత్రుల సమావేశానికి హాజరై ప్రసంగిస్తారు. పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల వరదల పరిహారంగా కేంద్రం రూ.500 కోట్లు ఇవ్వగా, మరింత సాయం చేయాలని నివేదించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలనూ సీఎం కలవొచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి.