news

News March 30, 2024

మూకుమ్మడి రాజీనామాల పేరుతో జగన్ డ్రామాలు: షర్మిల

image

AP: తాము అధికారంలోకి వస్తే పదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ షర్మిల అన్నారు. విజయవాడలో పార్టీ నేతలతో సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం జగన్ మూకుమ్మడి రాజీనామాల పేరుతో డ్రామా చేశారని దుయ్యబట్టారు. 23 మంది వైసీపీ ఎంపీలు ఒక్కరోజు కూడా హోదా గురించి మాట్లాడలేదని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు.

News March 30, 2024

బీజేపీ నుంచి ‘రాయల్‌’గా బరిలోకి! – 2/2

image

రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ నుంచి మేవార్ రాజకుటుంబానికి చెందిన మహిమా కుమారీ బరిలో నిలవనున్నారు. త్రిపుర ఈస్ట్ నుంచి కృతిసింగ్ దెబ్బార్మా (మాణిక్య రాజకుటుంబం).. ఒడిశాలో మాజీ ఎంపీ ఆర్కా కేసరీ డియో (కలహండి రాజకుటుంబీకులు) సతీమణి మాళవిక పోటీ చేయనున్నారు. బెంగాల్‌లో కృష్ణానగర్ నుంచి రాజమాత అమృతా రాయ్ నిలిచారు. వీరు పోటీ చేయడం ఇదే తొలిసారి. కాగా మరికొందరు ఇప్పటికే BJPలో కొనసాగుతున్నారు.
<<-se>>#Elections2024<<>>

News March 30, 2024

బీజేపీ నుంచి ‘రాయల్‌’గా బరిలోకి! – 1/2

image

ఎన్నికల బరిలో నిలవాలనుకునే రాజవంశీయులకు బీజేపీ ఓ మంచి వేదిక అయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈసారి BJP నుంచి 10 మంది లోక్‌సభ బరిలో ఉండటమే ఇందుకు కారణం. మైసూర్ రాజవంశీయుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్‌ను మైసూర్ అభ్యర్థిగా బీజేపీ ఇటీవల ప్రకటించింది. 20ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ రాయల్ ఫ్యామిలీ మళ్లీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది. 2004లో ఓటమి అనంతరం వీరి కుటుంబం రాజకీయాలకు దూరమైంది.
<<-se>>#Elections2024<<>>

News March 30, 2024

ఇకపై కాటన్ వస్త్రాల్లో అయోధ్య రాముడు

image

దేశంలో ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి ప్రారంభాన్ని దృష్టిలో పెట్టుకొని నేటి నుంచి అయోధ్యలో బాల రాముడు కాటన్ వస్త్రాల్లో దర్శనమిస్తారని శ్రీరామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్వీట్ చేసింది. సహజమైన రంగులతో ఈ వస్త్రాలను రూపొందించినట్లు పేర్కొంది.

News March 30, 2024

కాచిన నూనె మళ్లీ వంటలకు వాడుతున్నారా?

image

కాచిన నూనెను మళ్లీ వంటలకు వినియోగిస్తే మెదడుకు ముప్పు తప్పదని అమెరికా సొసైటీ ఫర్ బయో కెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీ అధ్యయనంలో వెల్లడైంది. క్యాన్సర్, కాలేయ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కాచిన నూనెల వల్ల శారీరక సమతుల్యత దెబ్బతింటుందని, క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని, జీర్ణ వ్యవస్థ, కాలేయం దెబ్బతింటుందని పేర్కొంటున్నారు. కొలెస్ట్రాల్ స్థాయులూ పెరుగుతాయని వెల్లడించారు.

News March 30, 2024

ఢిల్లీ జల్ బోర్డు కేసులో ఛార్జిషీట్‌ దాఖలు

image

ఢిల్లీ జల్ బోర్డు మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ED ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఫ్లో మీటర్ల కొనుగోళ్ల టెండర్లలో అవినీతి జరిగినట్లు ఆరోపించింది. DJB మాజీ చీఫ్ ఇంజినీర్ జగదీశ్ అరోరా, కాంట్రాక్టర్ అనిల్ అగర్వాల్, NBCC మాజీ GM మిట్టల్, తేజిందర్ సింగ్ అనే నలుగురితో పాటు NKG ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే కంపెనీని నిందితులుగా చేర్చింది. ఈ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్‌కు ED సమన్లు పంపిన సంగతి తెలిసిందే.

News March 30, 2024

కమల్‌ హాసన్‌ను మించిన నటుడు జగన్: CBN

image

AP: సీఎం జగన్‌పై టీడీపీ చీఫ్ చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. సీమలో ట్రెండ్ మారిందని.. వైసీపీ బెండు విరగడం ఖాయమని చెప్పారు. ప్రొద్దుటూరులో ‘ప్రజాగళం’ సభలో ఆయన మాట్లాడారు. జగన్ కమల్ హాసన్‌ను మించిన నటుడని.. ఆయనను కరకట్ట కమల్ హాసన్ అని పిలుస్తానని అన్నారు. ఏపీలో అన్ని లోక్‌సభ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

News March 30, 2024

రాహుల్ గాంధీ ప్రత్యర్థిపై 242 క్రిమినల్ కేసులు

image

కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థి సురేంద్రన్‌పై 242 క్రిమినల్ కేసులు ఉన్నాయి. EC నిబంధనల మేరకు ఆయన తనపై ఉన్న కేసుల వివరాలను 3 పేజీల్లో వెల్లడించారు. అలాగే ఎర్నాకులం బరిలో ఉన్న కేఎస్ రాధాకృష్ణన్‌పై 211 కేసులు ఉన్నాయి. వీటిలో ఎక్కువ కేసులు 2018 శబరిమల ఆందోళనల్లో నమోదైనవేనని ఆ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ జార్జ్ కురియన్ తెలిపారు.

News March 30, 2024

సీఎం రేవంత్‌ను కలిసిన నందమూరి సుహాసిని

image

TG: టీడీపీ నేత నందమూరి సుహాసిని.. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుహాసినిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించినట్లు సమాచారం. 2018 ఎన్నికల్లో కూకట్‌పల్లి నుంచి పోటీ చేసిన ఈమె 41 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

News March 30, 2024

చనిపోయినా.. ఇద్దరి జీవితాలు నిలబెట్టిన ప్రముఖ నటుడు

image

ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ గుండెపోటుతో <<12952187>>కన్నుమూయడంతో<<>> ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన కొన్నేళ్ల కిందటే నేత్ర దానానికి నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మరణించడంతో ఆయన కళ్లను ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు సేకరించారు. వాటిని మరో ఇద్దరు అంధులకు అమర్చుతామని తెలిపారు. బాలాజీ చేసిన గొప్ప పనిని అభిమానులు కొనియాడుతున్నారు. చనిపోయినా ఇద్దరిలో ఆయన బతికే ఉంటారని పేర్కొంటున్నారు.