India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: టెన్త్ జవాబు పత్రాల వాల్యుయేషన్‌ను ఏప్రిల్ 1 ప్రారంభించి 8వ తేదీలోగా పూర్తి చేస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద్ తెలిపారు. ఇందుకోసం 25 వేల మంది సిబ్బందికి విధులు కేటాయించామన్నారు. 6.23 లక్షల మంది రెగ్యులర్, 1.02 లక్షల మంది ప్రైవేటుగా పరీక్షలు రాశారని, 50 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఈసీ అనుమతితో మే మొదటి వారంలో ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు.
భారత అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ప్రదానోత్సవ వేడుక నేడు రాష్ట్రపతి భవన్‌లో జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అవార్డులు అందించనున్నారు. ఈ ఏడాది కేంద్రం ఐదుగురికి భారతరత్న అందించింది. ఈ జాబితాలో బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకుర్, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ, మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరీ చరణ్‌సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఉన్నారు.
సీఎస్కే మాజీ ప్లేయర్ స్కాట్ స్టైరిస్, ఆర్సీబీ మాజీ ప్లేయర్ డివిలియర్స్ మధ్య జరిగిన <<12925532>>సవాల్<<>>లో ఏబీడీ నెగ్గిన సంగతి తెలిసిందే. దీంతో ఛాలెంజ్ ప్రకారం స్టైరిస్ నిన్నటి మ్యాచులో ఆర్సీబీ జెర్సీ వేసుకున్నారు. సవాల్‌లో ఓడినందుకు ఇచ్చిన మాట ప్రకారం జెర్సీ ధరించాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆర్సీబీ జెర్సీలో స్టైరిస్ బాగున్నారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు ఈసీ ప్రవేశపెట్టిన ‘cVIGIL’ను ప్రజలు సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు. షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి నిన్న ఉదయం వరకు 79వేలకు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ తెలిపింది. వీటిలో 99 శాతం ఫిర్యాదులను పరిష్కరించామంది. అక్రమ హోర్డింగులు, బ్యానర్‌లకు సంబంధించి దాదాపు 58,500, నగదు, బహుమతులు, మద్యం పంపిణీపై 1,400 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొంది.
AP: రాష్ట్రంలో కాంగ్రెస్, వామపక్షాల మధ్య సీట్ల సర్దుబాటుపై ఏప్రిల్ 1న సమావేశం జరగనుంది. తాము చెరో రెండు లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని CPM, CPI రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాసరావు, రామకృష్ణ ప్రతిపాదించారు. దీనిపై షర్మిల కూడా తన అభిప్రాయాన్ని ఇప్పటికే తెలియజేశారు. ఎల్లుండి తుది నిర్ణయం తీసుకుని పోటీ చేసే సీట్లను ఆయా పార్టీలు ప్రకటించనున్నాయి.
నిన్నటి మ్యాచులో కేకేఆర్ మెంటర్ గంభీర్, ఆర్సీబీ ప్లేయర్ కోహ్లీని హగ్ చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై కామెంటేటర్లు రవిశాస్త్రి, గవాస్కర్ భిన్నంగా స్పందించారు. ఈ ఆలింగనానికి కేకేఆర్‌కు ఫెయిర్‌ప్లే అవార్డు ఇవ్వాలని రవిశాస్త్రి అన్నారు. అయితే ఫెయిర్‌ప్లే అవార్డు మాత్రమే కాకుండా ఆస్కార్ కూడా ఇవ్వొచ్చని గవాస్కర్ స్పందించారు. అయితే గవాస్కర్ ఉద్దేశం ఏమై ఉంటుందా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
TG: ఇంటర్ విద్యార్థులకు రేపటి నుంచి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ విద్యాసంవత్సరానికి ఇవాళే చివరి పనిదినం. మార్చి 31 నుంచి మే 31 వరకు సమ్మర్ హాలిడేస్ ఉండనున్నాయి. జూన్ 1న కాలేజీలు పున:ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది. సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
AP: రాష్ట్రంలోనే తొలిసారి ఓ దివ్యాంగుడు బ్రెయిలీ లిపిలో ఇచ్చిన ఫిర్యాదుపై విశాఖ సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. అధిక లాభాలు ఇస్తామని చెప్పి క్రేసుల్లా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ తన వద్ద ₹2.9 లక్షలు తీసుకుని మోసం చేసిందని అనకాపల్లి(D) జల్లూరుకు చెందిన దివ్యాంగుడు ఈ ఫిర్యాదు చేశారు. అలాగే తన స్నేహితుడి వద్ద ₹11 లక్షలు తీసుకుని దగా చేసిందని పేర్కొన్నారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
TG: వేసవిలో నీటిఎద్దడి లేకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సీజన్‌లో తాగునీటి అవసరాలకు రూ.140 కోట్ల నిధులు విడుదల చేసింది. పురపాలక శాఖకు రూ.40 కోట్లు, గ్రామపంచాయతీలకు రూ.100 కోట్లు కేటాయించింది. మరోవైపు నీటి సరఫరాపై అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. ఈ విషయమై సీఎస్ శాంతికుమారి అధికారులతో రోజువారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.
AP: డీఎస్సీ వాయిదా పడటంతో నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 23వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, మెగా డీఎస్సీ వేస్తామని ఐదేళ్ల క్రితం సీఎం జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఒక్క డీఎస్సీ వేయలేదని ఫైరవుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నాయనగా ఫిబ్రవరిలో 6,100 పోస్టులకే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని, ఆ నోటిఫికేషన్ కూడా ఇప్పుడు ఆగిపోయిందంటున్నారు.
Sorry, no posts matched your criteria.