India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బంగ్లాదేశ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సన్నద్ధమవుతున్నారు. జిమ్‌లో తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. బరువులు ఎత్తుతూ కఠోర సాధన చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ నెల 19 నుంచి బంగ్లాతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నెల 8 తర్వాత BCCI జట్టును ప్రకటించనుంది. 12న చెన్నైలో వారికి శిక్షణ శిబిరం నిర్వహించనుంది.
సెబీ చీఫ్ మాధబీ బుచ్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణకు పార్లమెంట్ PAC సిద్ధమైనట్టు తెలిసింది. ఈ నెలాఖర్లో ఆమెతో పాటు ఫైనాన్స్ మినిస్ట్రీలోని కొందరు అధికారులకు కమిటీ సమన్లు జారీ చేస్తుందని సమాచారం. చట్టం ద్వారా నెలకొల్పిన నియంత్రణ సంఘాల పనితీరును సమీక్షించే అధికారం PACకి ఉంటుంది. ప్రస్తుతం దీనికి కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ సారథ్యం వహిస్తున్నారు. మాధబిపై ప్రతిపక్ష కూటమి వరుస ఆరోపణల గురించి తెలిసిందే.
బెంచ్‌మార్క్ సూచీలు భారీ నష్టాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, మదుపరులు లాభాల స్వీకరణకు దిగడమే ఇందుకు కారణాలు. హెవీవెయిట్స్ ICICI బ్యాంకు, SBI, HDFC బ్యాంకు నుంచి సూచీలకు మద్దతు లభించలేదు. సెన్సెక్స్ 547 పాయింట్ల నష్టంతో 81,655 వద్ద చలిస్తోంది. నిఫ్టీ 128 పాయింట్లు పతనమై 25,016 వద్ద ట్రేడవుతోంది. బజాజ్ ట్విన్స్ జోరుమీదున్నాయి. SBI, కోల్ ఇండియా, HCL టెక్ ఎక్కువ నష్టపోయాయి.
ఆరోగ్య బీమాపై GST రద్దుపై కౌన్సిల్‌కు ఫిట్‌మెంట్ కమిటీ 4 ఆప్షన్లు ఇచ్చినట్టు తెలిసింది. అవేంటంటే
* అన్ని రకాల ఆరోగ్య బీమా ప్రీమియాలు, రీ ఇన్సూరర్స్‌పై పన్ను రద్దు (ప్రభుత్వానికి నష్టం ₹3,495Cr)
* ₹5 లక్షల లోపు బీమా కవరేజీ ప్రీమియం, Sr. సిటిజన్లు చెల్లించే ప్రీమియంపై రద్దు (₹2,110 Cr)
* బీమాపై GST రేటును 18 నుంచి 5 శాతానికి తగ్గించడం (₹1,730Cr)
* కేవలం Sr. సిటిజన్లకే రద్దు అమలు చేయడం (₹645Cr)
AP: బుడమేరు వాగుకు 1903 నుంచే వరదలు వస్తున్నాయి. ఈ ముప్పు నుంచి విజయవాడను కాపాడేందుకు 1960లో వెలగలేరు వద్ద 11 అడుగుల ఎత్తులో రెగ్యులేటర్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి వరద విజయవాడవైపు వెళ్లకుండా కొండపల్లి, ఇబ్రహీంపట్నం మీదుగా కృష్ణాలో కలిపేందుకు డైవర్షన్ ఛానల్ ఏర్పాటు చేశారు. పోలవరం కుడికాలువ, థర్మల్ ప్రాజెక్టు నీళ్లు కూడా ఇందులోనే కలుస్తాయి. దీని కెపాసిటీ పెంచితే బెజవాడకు వరదలు తగ్గే అవకాశముంది.
AP: తిరుపతిలోని శేషాచలం అడవుల్లో బంగారు బల్లి(గోల్డెన్ గెకో)ని వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లు గుర్తించి ఫొటోలు తీశారు. అరుదైన జాతికి చెందిన ఈ జీవులు చీకటి ప్రదేశాలు, రాతి బండల్లో మాత్రమే నివసిస్తాయి. ఇవి ఒకేసారి 40-150 గుడ్లను పెట్టగలవు. ఇటీవల కాలంలో ఈ బల్లులు అంతరించే దశకు చేరుకున్నాయి. గత ఏడాది పాపికొండల అభయారణ్యం, కళ్యాణిడ్యాం పరిధిలో వీటిని గుర్తించారు.
AP: విజయవాడలో వేలాది వాహనాలు రిపేర్లకొచ్చాయి. మూడు రోజులు నీటిలో నానడంతో బైకులు స్టార్ట్ అవ్వడం లేదు. దీంతో సింగ్ నగర్, జక్కంపూడి, రాజరాజేశ్వరిపేట, ఏలూరు రోడ్డు, గుణదల తదితర ప్రాంతాల్లోని మెకానిక్ షెడ్లు రద్దీగా మారాయి. అర్జెంట్ అంటే కుదరదని టైమ్ పడుతుందని మెకానిక్‌లు వాహనదారులకు చెబుతున్నారు. ఇంజిన్‌లోకి నీరు చేరడం, వైరింగ్ సిస్టమ్ పాడవడం లాంటి సమస్యలకు భారీగా ఖర్చవుతోంది.
వరదల్లో బైక్ ఇంజిన్ మునిగిపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ స్టార్ట్ చేయొద్దని టెక్నీషియన్లు సూచిస్తున్నారు. త్రీవీలర్ సాయంతో షోరూమ్ లేదా మెకానిక్ దగ్గరకు తీసుకెళ్లాలని, వెంటనే స్టార్ట్ చేస్తే బైక్ బోర్‌కు వస్తుందని చెబుతున్నారు. బైక్ ఇంజిన్ వరకు మునిగితే ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, స్పార్క్ ప్లగ్ మార్చుకుంటే చాలని, పెట్రోల్ ట్యాంక్ కూడా మునిగితే ఎక్కువ ఖర్చు అవుతుందని వివరిస్తున్నారు.
SHARE IT
TG: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. సురేందర్ రెడ్డి(52) అనే రైతు అగ్రికల్చర్ ఆఫీస్ ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలానికి చెందిన ఈయనకు రుణమాఫీ కాలేదని, ఆ బాధతోనే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు, స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రిలయన్స్ జియో 8వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 5 నుంచి 10వ తేదీల మధ్య కొన్ని రీఛార్జ్ ప్లాన్లపై స్పెషల్ ఆఫర్లు ప్రకటించింది. రూ.899(90 రోజులు), రూ.999(98 రోజులు), రూ.3,599(365 రోజులు)తో రీఛార్జ్ చేసుకుంటే రూ.700 విలువైన ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో 10 OTTలు, 3 నెలల జొమాటో గోల్డ్ మెంబర్‌షిప్, 28 రోజుల వ్యాలిడిటీతో రూ.175 విలువైన 10GB డేటా వోచర్ పొందొచ్చు.
Sorry, no posts matched your criteria.