India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహం దుబాయ్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువుదీరిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన సోదరుడు అల్లు శిరీశ్ సంతోషం వ్యక్తం చేస్తూ ఫొటోలను ట్వీట్ చేశారు. ‘15 ఏళ్ల క్రితం మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం చూసేందుకు వెళ్లాము. అదే మ్యూజియంలో నీ విగ్రహంతో ఫొటో దిగే రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నీ ప్రయాణాన్ని చూసి గర్విస్తున్నా’ అని అల్లుఅర్జున్‌ను ట్యాగ్ చేశారు.
ఉత్తరాంధ్రలో YCP కీలక నేత బొత్స సత్యనారాయణను TDP నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు ఢీకొట్టనున్నారు. బొత్సపై పోటీకి సీనియర్ అయిన కళానే బెటర్ అని TDP భావించింది. అలాగే ప్రస్తుతం TDP చీపురుపల్లి ఇన్‌ఛార్జిగా ఉన్న కిమిడి నాగార్జునకు వెంకట్రావు సొంత పెదనాన్న కావడంతో పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చని పార్టీ భావించినట్లు తెలుస్తోంది. 2014లో కళా ఎచ్చెర్ల MLAగా గెలిచారు. ఈసారి ఎచ్చెర్ల సీటు BJPకి కేటాయించారు.
2023-24 ఆర్థిక ఏడాదిలో బిట్‌కాయిన్ హవా కొనసాగింది. FY24 ప్రారంభంలో $28,500గా (రూ.23లక్షలు) ఉన్న బిట్‌కాయిన్ విలువ 150%కుపైగా పెరిగి గరిష్ఠంగా $73,780ను (రూ.61.5లక్షలు) తాకింది. ఈక్విటీలు, బాండ్లు, గోల్డ్‌తో పోలిస్తే ఈ బిట్‌కాయిన్ మంచి రిటర్న్స్ ఇచ్చిందంటున్నారు విశ్లేషకులు. మరోవైపు దీనికి ప్రత్యామ్నాయంగా వచ్చిన పలు క్రిప్టోల (ఆల్ట్‌కాయిన్స్) విలువ కూడా గరిష్ఠంగా 5,535% పెరిగింది.
AP: సీఎం జగన్ ఓ వృద్ధురాలిపై ప్రేమను చాటుకున్నారు. బస్సు యాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన వృద్ధురాలిని కౌగిలించుకుని ముద్దుపెట్టారు. ‘అవ్వాతాతలకి భరోసా కల్పిస్తూ వారికి అండగా నిలిచిన ప్రభుత్వం మనది. వారి సంక్షేమం కోసం పెన్షన్‌ను రూ.3 వేలకు పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. మనం చేసిన మంచి దారిపొడవునా వారు చూపిస్తున్న అభిమానంలో కనిపిస్తోంది’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
తెలంగాణ ఏర్పాటుపై బీఆర్ఎస్ సీనియర్ నేత కె.కేశవరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఏర్పాటు పాటలు పాడినందుకో, డాన్సులు చేస్తేనో, ధర్నాలు, పబ్లిక్ మీటింగ్స్ వల్లో రాలేదని అన్నారు. బిల్లు పాస్ చేయడం ద్వారా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని పేర్కొన్నారు. అయితే ఉద్యమ స్ఫూర్తినిచ్చాయని అన్నారు. పార్లమెంటులో కొట్లాడింది మాత్రం కాంగ్రెస్ ఎంపీలేనని ఆయన చెప్పుకొచ్చారు.
కోల్‌కతా నైట్ రైడర్స్ సోషల్ మీడియా హ్యాండిల్లో ఆసక్తికరమైన ఫొటోలు షేర్ చేసింది. ఆ జట్టు మెంటార్ గౌతం గంభీర్, ఆర్సీబీ ఆటగాడు కోహ్లీ ఉన్న ఫొటోను పంచుకుంది. ఒకదాంట్లో కోహ్లీని, మరో దాంట్లో గౌతీని హైలైట్ చేసింది. అయితే.. ఐపీఎల్‌లో వీరిద్దరి మధ్య పలుమార్లు మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఈరోజు RCBతో KKR మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలోనే ఆ జట్టు ఈ ఫొటో షేర్ చేసింది.
AP: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైసీపీ నేత మల్లెల రాజేశ్ నాయుడు టీడీపీలో చేరారు. నారా లోకేశ్ సమక్షంలో ఆయనతో పాటు 10 మంది కౌన్సిలర్లు, ఒక జడ్పీటీసీ, ఇద్దరు సర్పంచులు టీడీపీ కండువా కప్పుకున్నారు. చిలకలూరిపేట సమన్వయకర్త పదవి నుంచి వైసీపీ తొలగించినప్పటి నుంచి రాజేశ్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. టికెట్ కోసం మంత్రి రజనీ తన వద్ద రూ.6కోట్లు తీసుకున్నారంటూ ఆయన చేసిన <<12839437>>ఆరోపణలు <<>>దుమారం రేపిన సంగతి తెలిసిందే.
AP: మొదటి నుంచి భీమిలి సీటు కోసం పట్టుబడుతున్న గంటా శ్రీనివాసరావు తన పంతం నెగ్గించుకున్నారు. ఆయనను చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీకి దింపాలని TDP భావించగా గంటా ససేమీరా అన్నారు. అధినేత చంద్రబాబుతో పలుమార్లు భేటీ అయి చర్చించిన ఆయన.. చివరకు భీమిలి సీటును కన్ఫార్మ్ చేసుకున్నారు. విశాఖ జిల్లాలో ఓటమెరుగని నేతగా ఉన్న శ్రీనివాసరావు ఈసారి భీమిలిలో పసుపు జెండా రెపరెపలాడిస్తారో? లేదో చూడాలి.
TG: వరంగల్‌లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రకటించారు. ఈరోజు ఆయన కేటీఆర్‌తో భేటీ కానున్నారు. ఇటీవల అసెంబ్లీ టికెట్ రాకపోవడంతో రాజయ్య బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఇప్పుడు అవకాశం వస్తే రాజీనామాను ఉపసంహరించుకునేందుకు సిద్ధమయ్యారట.
ప్రియుడు మథియస్‌తో పెళ్లి ప్రచారం నేపథ్యంలో హీరోయిన్ తాప్సీ ఆసక్తికర పోస్ట్ చేశారు. చీరపై కోటు ధరించి ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ ‘ఈ చీరతో రొమాన్స్ ఎప్పటికీ ముగియదని నమ్ముతున్నా’ అని పేర్కొన్నారు. దీంతో నిజంగా చీర గురించే మాట్లాడుతున్నావా? లేదా మథియస్‌తో బంధం శాశ్వతంగా నిలిచిపోవాలని పరోక్షంగా చెబుతున్నావా? తాప్సీ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.