India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఐపీఎల్‌లో భాగంగా నేడు ఆర్సీబీ, కేకేఆర్ బెంగళూరులో తలపడనున్నాయి. ఇరువైపులా బలమైన హిట్టర్లు ఉండటం, చిన్నస్వామి స్టేడియం చిన్నది కావడంతో భారీ స్కోర్లు నమోదు కావొచ్చని క్రీడావిశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిన్న మ్యాచ్‌తో సహా ఇప్పటి వరకు హోం టీమ్స్ గెలిచాయి. ఈరోజు ఆర్సీబీని మట్టికరిపించి ఆ రికార్డును మార్చాలని భావిస్తోంది కేకేఆర్. అటు ఆర్సీబీ సైతం బలంగానే ఉండటంతో రసవత్తరమైన మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం వేసవికాలంలో ఫ్రిజ్‌లోని చల్లటి నీరు తాగేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. కానీ ఫ్రిజ్‌కు బదులు మట్టి కుండలో నీరు తాగితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. మట్టి కుండలో నీరు సహజంగా రుచిగా ఉంటాయి. ఆ నీరు తాగితే గ్యాస్, అసిడిటీ, శ్వాసకోశ సమస్యలు రావు. జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. ఈ నీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు. జిడ్డు, మొటిమల నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు.
దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ స్టేడియంలో నిన్న సాయంత్రం అల్లు అర్జున్ తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బన్నీ ట్విటర్‌లో స్పందించారు. ‘ఈరోజు చాలా ప్రత్యేకం. నా తొలి సినిమా గంగోత్రి 2003లో ఈరోజే విడుదలైంది. ఈరోజు టుస్సాడ్స్‌లో నా విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నా. ఈ 21ఏళ్ల ప్రయాణం మర్చిపోలేనిది. దీనిలో నాకు అండగా నిలిచిన వారికి, నా ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.
తనకు బీఆర్ఎస్‌లో అవకాశం ఇచ్చిన కేసీఆర్‌కు రుణపడి ఉంటానని కాంగ్రెస్ నేత దానం నాగేందర్ తెలిపారు. ‘ఆయన గొప్ప నాయకుడు. కానీ వారి చుట్టూ కందిరీగల్లా కొంతమంది చేరారు. వారి గురించి త్వరలోనే తెలుసుకుంటారు. నాకు ఆత్మగౌరవం ముఖ్యం. కాంగ్రెస్‌లో నిర్మొహమాటంగా, స్వేచ్ఛగా మాట్లాడగలను’ అని పేర్కొన్నారు. కాగా.. దానంపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. కేసీఆర్ ఆయన్ను కన్నబిడ్డలా చూసుకున్నారని వివరించారు.
TS: కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు ఉదయం 9గంటలకు కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని వారిద్దరూ కలవనున్నట్లు తెలుస్తోంది. తాను వరంగల్ బరి నుంచి తప్పుకొంటున్నట్లు కావ్య కేసీఆర్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. తనను మన్నించాలంటూ ఆమె అందులో కోరారు. నేడు శ్రీహరి, కావ్య అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకొనే అవకాశం ఉంది.
* హేమ మాలిని – మథుర
* కంగనా రనౌత్ – మండి
* రాధిక శరత్ కుమార్ – విరుధునగర్
* నవనీత్ కౌర్ – అమరావతి
* అరుణ్ గోవిల్ – మీరట్
* రవికిషన్ – గోరఖ్‌పూర్
* మనోజ్ తివారీ – ఢిల్లీ నార్త్ఈస్ట్
* సురేశ్ గోపి – త్రిస్సూర్
రష్యాకు చెందిన ఓ యుద్ధవిమానం ఉక్రెయిన్ సమీపంలోని క్రిమియా ద్వీపకల్పం వద్ద కుప్పకూలింది. ఈ మేరకు సెవస్టొపోల్ గవర్నర్ మిఖైల్ రాజ్వోజైవ్ టెలిగ్రామ్‌లో తెలిపారు. ‘పైలట్ ఎజెక్ట్ అయ్యారు. అతడిని సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రాణానికేం ప్రమాదం లేదు’ అని స్పష్టం చేశారు. మంటల్లో మండుతూ ఆ విమానం కుప్పకూలుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
నిన్న రాత్రి ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రియాగ్ పరాన్ 84 రన్స్(45 బంతుల్లో)తో రాణించిన సంగతి తెలిసిందే. చాలా సీజన్లుగా అతడు అంచనాలకు తగ్గట్లుగా ఆడకపోయినా రాజస్థాన్ నమ్మకం ఉంచింది. సన్‌రైజర్స్ కూడా అదే తరహాలో అబ్దుల్ సమద్‌ను జట్టులో కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ ఒకట్రెండు మ్యాచులు తప్ప ఆడలేదు. దీంతో నువ్వెప్పుడు అలా ఆడతావ్ అంటూ నెట్టింట SRH ఫ్యాన్స్ సమద్‌ను ప్రశ్నిస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో అఖండకు సీక్వెల్‌గా అఖండ-2 తెరకెక్కనుంది. ఈ సినిమాలో బాలకృష్ణ లుక్స్ తొలి పార్ట్‌కు మించి ఉంటాయని నటుడు, కాస్ట్యూమ్స్ డిజైనర్ రామ్స్ ఓ ఈవెంట్‌లో వెల్లడించారు. ‘ఈమధ్యే బోయపాటితో కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడాను. అఖండకు ఆయన, నేను కలిసే కాస్ట్యూమ్స్ రూపొందించాం. బాలయ్య లుక్స్‌కు మంచి స్పందన వచ్చింది. రెండో పార్ట్‌లో అంతకు మించి ఉంటాయి’ అని స్పష్టం చేశారు.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Sorry, no posts matched your criteria.