India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తమ కుమార్తె మృతదేహాన్ని అప్పగిస్తూ పోలీసులు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారని ఆర్జీకర్ వైద్యురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. నిన్న రాత్రి కోల్‌కతాలో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. ‘పోలీసులు ఈ కేసును త్వరగా మూసేసేందుకే ప్రయత్నించారు. ముందు మమ్మల్ని బాడీని చూడనివ్వలేదు. పోస్ట్‌మార్టం టైమ్‌లో మేం PSలోనే ఉన్నాం. బాడీని అప్పగిస్తూ సీనియర్ అధికారి డబ్బును ఆఫర్ చేశారు. మేం వెంటనే తిరస్కరించాం’ అని తెలిపారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ మూవీ ట్రైలర్ ఈనెల 10న రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనికోసం భారీ ఈవెంట్‌ను నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, అదిరిపోయే డైలాగ్స్‌తో ఉన్న ట్రైలర్‌ను చిత్రబృందం ఖరారు చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇప్పటికే రిలీజైన మూడు సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈనెల 27న ‘దేవర’ విడుదలవనుంది.
TG: ఖరీఫ్ సీజన్‌లో అన్ని రకాల పంటల సాధారణ విస్తీర్ణం 1.29 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 1.20 కోట్ల ఎకరాల్లో పూర్తయినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. వరి సాగు లక్ష్యం 57.18 లక్షల ఎకరాలు కాగా 100% నాట్లు పడినట్లు తెలిపింది. పత్తి 50.48L ఎకరాలు, పప్పు ధాన్యాలు 5.66L ఎకరాలు, మొక్కజొన్న 5.11L ఎకరాలు, సోయాబీన్ 3.97L ఎకరాల్లో సాగైనట్లు పేర్కొంది.
TG: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. భద్రాద్రి జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన <<14010044>>ఎన్‌కౌంటర్‌లో<<>> 10 మంది మావోలు మృతి చెందారు.
జార్జియా స్కూల్లో విద్యార్థులపై కాల్పులు కలచివేశాయని US అధ్యక్షుడు జోబైడెన్ అన్నారు. చదవడం, రాయడానికి బదులు తుపాకీ గుళ్లకు బలికాకుండా దాక్కోవాల్సిన పరిస్థితులు దాపురించాయన్నారు. ఇకపై ఇలాంటి హింస జరగకుండా US కాంగ్రెస్‌లో భద్రతా చట్టం తెచ్చేందుకు రిపబ్లికన్లు సహకరించాలని కోరారు. ‘మతిలేని తుపాకీ హింసలో మరణించిన విద్యార్థులకు నేనూ, జిల్ సంతాపం ప్రకటిస్తున్నాం. దీనిని ఎంతమాత్రం సహించలేం’ అని అన్నారు.
TG: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేటి నుంచి 4 రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీనితో పాటు ద్రోణి ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వచ్చే 4 రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని పేర్కొంది.
AP: వరద బాధిత కుటుంబాలకు నేటి నుంచి నిత్యావసరాల కిట్‌తో పాటు రాయితీపై కూరగాయలు అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘రూ.2, రూ.5, రూ.10 ఈ మూడు రేట్లు మాత్రమే ఉంటాయి. ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తాం. ఆకు కూరలన్నీ రూ.2కే ఇస్తాం. రూ.10, రూ.15, రూ.20 ధర ఉన్న కూరగాయలను రూ.5కు, రూ.25, రూ.30 ధరలున్న వాటిని సబ్సిడీపై రూ.10కి అందుబాటులో ఉంచుతాం’ అని చెప్పారు.
క్రీడాభివృద్ధి కోసం IMG అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు 2003లో మామిడిపల్లి, శేరిలింగంపల్లిలో 850 ఎకరాల భూమిని చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. రూ.వందల కోట్ల రాయితీతోపాటు HYDలోని స్టేడియాలను అప్పగించింది. అయితే అదొక బోగస్ కంపెనీ అని, దానికి కారుచౌకగా భూములు ఇచ్చారనే విమర్శలొచ్చాయి. ఈ వ్యవహారంపై CBI విచారణ కోరుతూ ABK ప్రసాద్ 2012లో పిల్ దాఖలు చేయగా, ఇప్పటికీ కోర్టులో విచారణ సాగుతోంది.
2003లో చంద్రబాబు సీఎంగా ఉండగా ఐఎంజీ సంస్థకు 850 ఎకరాలను అక్రమంగా కేటాయించారని ఆరోపిస్తూ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్ దాఖలు చేసిన పిల్‌ను తెలంగాణ హైకోర్టు విచారించింది. న్యాయస్థానం ఆదేశిస్తే చంద్రబాబు క్యాబినెట్ నిర్ణయంపై విచారణకు సిద్ధంగా ఉన్నామని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో తాము ఎప్పుడూ వెనకడుగు వేయలేదని చెప్పారు. ఈ పిల్‌పై నేడు కూడా కోర్టులో విచారణ జరగనుంది.
TG: మారుమూల ప్రాంతాల్లో పనిచేయడానికి చాలామంది వైద్యులు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా అక్కడివారికి మెరుగైన వైద్యసేవలు అందడంలేదు. దీంతో గిరిజన, గ్రామీణ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యుల జీతాలను భారీగా పెంచి, సేవలను మెరుగుపర్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తే రెట్టింపు వేతనం(100% ఇన్సెంటివ్), గిరిజన ప్రాంతాల్లో అయితే 125% ఇచ్చేందుకు ఆరోగ్యశాఖ మంత్రి ఆమోదం తెలిపారు.
Sorry, no posts matched your criteria.