News September 5, 2024

చంద్రబాబు నిర్ణయంపై విచారణకు సిద్ధం: సీబీఐ

image

2003లో చంద్రబాబు సీఎంగా ఉండగా ఐఎంజీ సంస్థకు 850 ఎకరాలను అక్రమంగా కేటాయించారని ఆరోపిస్తూ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్ దాఖలు చేసిన పిల్‌ను తెలంగాణ హైకోర్టు విచారించింది. న్యాయస్థానం ఆదేశిస్తే చంద్రబాబు క్యాబినెట్‌ నిర్ణయంపై విచారణకు సిద్ధంగా ఉన్నామని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో తాము ఎప్పుడూ వెనకడుగు వేయలేదని చెప్పారు. ఈ పిల్‌పై నేడు కూడా కోర్టులో విచారణ జరగనుంది.

Similar News

News September 14, 2024

ట్రంప్, కమల ఇద్దరూ చెడ్డవాళ్లే: పోప్

image

అమెరికా అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్‌పై పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ జీవనానికి వ్యతిరేకులేనని పేర్కొన్నారు. ‘ట్రంప్ వలసలకు వ్యతిరేకి. కమల అబార్షన్‌కు మద్దతునిస్తున్నారు. నేను అమెరికన్ కాదు. నాకు అక్కడ ఓటు లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం. వారిద్దరూ చేసేది పాపమే. అమెరికన్లు ఆ ఇద్దరిలో తక్కువ చెడ్డ వ్యక్తిని ఎంచుకోవాల్సి ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు.

News September 14, 2024

త్వరలో దుబాయ్, సింగపూర్‌లకు విమానాలు: రామ్మోహన్

image

APలో విమాన ప్రయాణికుల సంఖ్య మరింత పెంచుతామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో విజయవాడ-ఢిల్లీ ఇండిగో సర్వీసును ఆయన ప్రారంభించారు. ‘3 నెలల్లో 4 కొత్త సర్వీసులు ప్రారంభించాం. OCT 26న విజయవాడ-పూణె, అక్టోబర్ 27న విశాఖ-ఢిల్లీ సర్వీసులు ప్రారంభిస్తాం. త్వరలోనే దుబాయ్, సింగపూర్‌కు సర్వీసులు ప్రారంభిస్తాం. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా కనెక్టివిటీ పెంచుతాం’ అని ప్రకటించారు.

News September 14, 2024

రేవంత్‌ను విమర్శిస్తే నాలుక కోస్తాం: జగ్గారెడ్డి

image

TG: సీఎం రేవంత్‌ను విమర్శిస్తే నాలుక కోస్తామని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి BRS నేతలకు వార్నింగ్ ఇచ్చారు. అరెకపూడి గాంధీ – కౌశిక్ రెడ్డి వివాదం BRS పార్టీకి సంబంధించిన పంచాయితీ అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొడుతూ, తమ జోలికి వస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ ప్రశాంతంగానే ఉందని, పోలీసులు BRS నేతలను పట్టించుకోవాలా? ప్రజలను పట్టించుకోవాలా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.