India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ‘డబుల్ ఇస్మార్ట్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 15న విడుదలై నెగటివ్ టాక్ తెచ్చుకుంది. థియేటర్లో రిలీజైన 21 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఇందులో సంజయ్ దత్, కావ్య థాపర్ తదితరులు నటించారు. మణిశర్మ సంగీతం అందించగా, చార్మి నిర్మించారు.
TG: రాష్ట్రంలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు గంటలపాటు కొత్తగూడెం, జనగాం, భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, భువనగిరి జిల్లాల్లో వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 24కు చేరింది. మరో నాలుగు రోజులు గేమ్స్ ఉండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఇప్పటివరకు భారత్ ఖాతాలో 5 స్వర్ణాలు, 9 రజతాలు, 10 కాంస్యాలు చేరాయి. నిన్న ఒక్కరోజే నాలుగు పతకాలు రావడం గమనార్హం. పతకాల పట్టికలో భారత్ 13వ స్థానంలో కొనసాగుతోంది.
TG: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ వేర్వేరు బృందాలుగా పర్యటించనున్నారు. సంజయ్ బృందం ఖమ్మం, కోదాడలో పర్యటిస్తుందని, ఈటల బృందం ములుగు, మహబూబాబాద్‌లో పర్యటిస్తుందని రాష్ట్ర బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. బాధితులను పరామర్శించి క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని గుర్తించి కేంద్రానికి నివేదిస్తారని తెలిపారు.
TG: ఇప్పటికే 35 ప్రభుత్వ సంస్థల కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించిన ప్రభుత్వం మిగిలిన వాటిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో BRS నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఓ ముగ్గురు MLAలకు RTC, సివిల్ సప్లై, మూసీ రివర్ ఫ్రంట్ వంటి వాటిని ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే విద్య కమిషన్‌కు ఆకునూరి మురళి, BC కమిషన్‌కు నిరంజన్, రైతు కమిషన్‌కు కోదండరెడ్డి పేర్లు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది.
దళపతి విజయ్ ద్విపాత్రాభినయంలో వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది గోట్’ ప్రీమియర్లు పడ్డాయి. సినిమాలో స్క్రీన్ ప్లే, విజయ్ యాక్షన్, యువన్ బీజీఎం అద్భుతంగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హీరో ఎలివేషన్లు అదిరిపోయాయని చెబుతున్నారు. మరికొందరేమో సినిమా బోరింగ్‌గా ఉందని, వీఎఫ్ఎక్స్ ఆకట్టుకునేలా లేదని పోస్టులు చేస్తున్నారు.
మరికాసేపట్లో WAY2NEWS రివ్యూ.
AP: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అందుబాటులో ఉన్న 3,879 ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు ఎన్టీఆర్ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. వెబ్‌సైట్: <
AP: బంగాళాఖాతంలో కోస్తాంధ్రకు సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఇవాళ అల్పపీడనంగా మారనుందని APSDMA వెల్లడించింది. మరోవైపు రాష్ట్రంపై రుతుపవన ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో ఈ నెల 9 వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయంది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, NTR జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని పేర్కొంది.
AP: విజయవాడలో వరద తగ్గడంతో అంటువ్యాధులు, వైరల్ ఫీవర్లు సోకకుండా ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంటోంది. నగరంలోని 32 డివిజన్లలో ఇవాళ్టి నుంచి అదనంగా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనుంది. ప్రతి వార్డు పరిధిలోని సచివాలయాలు, అంగన్‌వాడీ, ప్రభుత్వ కేంద్రాల్లో ఇద్దరు చొప్పున వైద్యులు అందుబాటులో ఉంటారు. ప్రస్తుతం 104 మెడికల్ వెహికల్స్, 50కి పైగా వైద్య శిబిరాలు సేవలందిస్తున్నాయి.
రెజ్లర్ వినేశ్ ఫొగట్ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు బజరంగ్ పునియా కూడా హస్తం కండువా కప్పుకుంటారని సమాచారం. నిన్న వీరిద్దరూ రాహుల్ గాంధీని కలవడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. దీనిపై రేపు క్లారిటీ వస్తుందని AICC హరియాణా వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపక్ బబారియా తెలిపారు. కాగా హరియాణాలో అక్టోబర్ 5న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వినేశ్, బజరంగ్ బరిలోకి దిగుతారని సమాచారం.
Sorry, no posts matched your criteria.