News September 5, 2024
కాంగ్రెస్‌లోకి వినేశ్? రేపు స్పష్టత
రెజ్లర్ వినేశ్ ఫొగట్ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు బజరంగ్ పునియా కూడా హస్తం కండువా కప్పుకుంటారని సమాచారం. నిన్న వీరిద్దరూ రాహుల్ గాంధీని కలవడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. దీనిపై రేపు క్లారిటీ వస్తుందని AICC హరియాణా వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపక్ బబారియా తెలిపారు. కాగా హరియాణాలో అక్టోబర్ 5న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వినేశ్, బజరంగ్ బరిలోకి దిగుతారని సమాచారం.
Similar News
News September 18, 2024
నేడు జమ్మూకశ్మీర్‌లో తొలి దశ పోలింగ్
పదేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. తొలిదశలో ఇవాళ 24 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 219 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 23 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. 3,276 పోలింగ్ కేంద్రాలను EC సిద్ధం చేసింది. ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. INC-NC కలిసి పోటీ చేస్తుండగా, PDP, BJP, JKPM, PC, ఆప్నీ పార్టీలు విడివిడిగా బరిలో ఉన్నాయి.
News September 18, 2024
అమరావతి రైల్వే లైన్ భూముల సేకరణకు రూ.వెయ్యి కోట్లు?
AP: అమరావతి కొత్త రైల్వే లైన్ కోసం 510 ఎకరాల భూమి అవసరమని రైల్వే శాఖ గుర్తించింది. NTR జిల్లాలో 296, గుంటూరులో 155, ఖమ్మంలో 60 ఎకరాల చొప్పున కావాలని ఆయా జిల్లాల రెవెన్యూ యంత్రాంగానికి ప్రతిపాదనలు పంపింది. ఈ భూముల సేకరణకు రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ వ్యయాన్ని భరించేందుకు రైల్వే శాఖ అంగీకరించినట్లు, పాత అలైన్‌మెంట్ ప్రకారం ఎర్రుపాలెం నుంచి రైల్వే లైన్‌ను ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం.
News September 18, 2024
దివాలా దిశగా ‘టప్పర్‌వేర్’
ప్లాస్టిక్ బాక్సుల తయారీలో దిగ్గజ సంస్థ టప్పర్‌వేర్ ఇప్పుడు కష్టాల్లో ఉంది. ఈ వారంలోనే దివాలా ప్రకటన చేయనున్నట్లు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. కంపెనీ షేర్లు తాజాగా 57 శాతం పడిపోయాయి. 2019లో 40 డాలర్లకుపైగా ఉన్న షేర్ విలువ ప్రస్తుతం 0.51 డాలర్లకు పడిపోయింది. $700 మిలియన్లకుపైగా ఉన్న అప్పులను చెల్లించడం సాధ్యం కావట్లేదు. దీంతో రుణదాతలతో చర్చించి దివాలా ప్రకటించడానికి సన్నాహాలు చేసుకుంటోంది.