India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ <<14020746>>ఘటనపై<<>> డీజీపీ జితేందర్ సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో ప్రచారం చేయొద్దని హెచ్చరించారు. ఇప్పటికే జైనూర్‌కు వెయ్యి మంది పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను పంపి, 144 సెక్షన్ అమలు చేస్తున్నామని తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేశామని, అందరూ సంయమనం పాటించాలని కోరారు.
స్కాట్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ విధ్వంసం సృష్టించారు. 25 బంతుల్లోనే 80 రన్స్ బాదారు. 12 ఫోర్లు, 5 సిక్సర్లతో స్కాట్లాండ్ బౌలర్లను ఊచకోత కోశారు. ఈ క్రమంలో ఆసీస్ తరఫున హెడ్ (17 బంతుల్లో) ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించారు. హెడ్ ధాటికి 155 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 9.4 ఓవర్లలోనే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పవర్‌ప్లేలో 113 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించింది.
తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు రామోజీ గ్రూపు సంస్థలు రూ.5 కోట్లు, నటుడు సాయి దుర్గా తేజ్ రూ.25 లక్షల్ని విరాళంగా ప్రకటించారు. ఇక APకి బీఎస్ఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎండీ బలుసు శ్రీనివాసరావు రూ. కోటి, ఎంపీ సీఎం రమేశ్ రూ. కోటి, నిర్మాత అశ్వనీదత్ రూ.25 లక్షలు, IMA రూ.25 లక్షలు, సిద్ధార్థ వాకర్స్ క్లబ్ రూ. 5 లక్షలు, రాయపాటి శైలజ రూ.5 లక్షలు విపత్తు సాయంగా అందించారు.
AP: ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో వర్షాలు, వరద తీవ్రత దృష్ట్యా రేపు స్కూళ్లకు సెలవు ప్రకటిస్తున్నట్లు DEO సుబ్బారావు తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు గురువారం కూడా సెలవు ఇవ్వాలని కలెక్టర్ల ఆదేశాలతో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ముంబై ఇండియన్స్ మాజీ కోచ్ జాంటీ రోడ్స్ ప్రశంసలు కురిపించారు. ఎప్పుడూ ఎనర్జీతో ఉంటారని కొనియాడారు. ‘రోహిత్ చాలా తుంటరి. అల్లరి పనులు చేస్తుంటారు. కెప్టెన్సీ పరంగా చూస్తే తన ఆట అద్భుతం. ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్‌ను దగ్గరగా చూశాను. ఎప్పటికప్పుడు క్రికెట్ అవసరాలకు తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటూ వస్తున్నారు. ఆధునిక క్రికెట్‌లో అదే కీలకం’ అని వివరించారు.
AP: రేపు రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. వరదలతో అతలాకుతలమైన కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పర్యటించి నష్టం అంచనా వేయనుంది. కాగా వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే కేంద్రాన్ని కోరారు. దీనిపై కేంద్రం ఇంకా స్పందించలేదు.
AP: వర్షాలు, వరదలతో నష్టపోయిన బాధితులకు పంచాయతీరాజ్ ఉద్యోగులు అండగా నిలిచారు. సీఎం సహాయ నిధికి ఒక్కరోజు జీతం విరాళంగా ప్రకటించారు. 1.64 లక్షల మంది ఉద్యోగులు ఒక్క రోజు మూల వేతనం రూ.14 కోట్లు, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం రూ.75 లక్షలు, గ్రామీణ నీటి పారుదల శాఖ ఉద్యోగులు రూ.10 లక్షలు విరాళం ఇవ్వాలని తీర్మానించినట్లు డిప్యూటీ సీఎం పవన్‌కు లేఖ అందించారు. ఈ నెల జీతం నుంచి కట్ చేసుకోవాలని కోరారు.
స్టార్‌లైనర్ వ్యోమనౌక నుంచి విచిత్రమైన శబ్దాలు వస్తున్నాయని ISSలోని వ్యోమగాములు నాసాకు తెలిపిన సంగతి తెలిసిందే. మిషన్ కంట్రోల్‌తో మాట్లాడుతున్న సమయంలో వ్యోమగామి బ్యారీ విల్మోర్ ఈ శబ్దాలను గుర్తించారు. గత కొన్ని రోజులుగా ఆ శబ్దాలపై నడుస్తున్న విస్తృత చర్చకు నాసా ఈరోజు తెరదించింది. ఐఎస్ఎస్‌తో నెలకొన్న ఆడియో కాన్ఫిగరేషన్ సమస్య వల్ల స్టార్‌లైనర్ స్పీకర్ నుంచి ఆ సౌండ్స్ వస్తున్నాయని తేల్చిచెప్పింది.
EPS పెన్షనర్లకు కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ శుభవార్త చెప్పారు. సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్స్ సిస్టమ్(CPPS)కు EPFO ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. దీని ద్వారా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి దేశంలోని ఏ బ్యాంక్ నుంచైనా పెన్షన్ తీసుకోవచ్చు. ఇందుకోసం PPO(పెన్షన్ పేమెంట్ ఆర్డర్)ను ఒక చోటు నుంచి మరొక బ్రాంచ్‌కు మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. దీని కారణంగా 78 లక్షల మంది EPS పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది.
మాజీ సీఎం KCR కనబడుటలేదంటూ HYDలో వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. కొన్ని మెట్రో పిల్లర్లతో పాటు పలు చోట్ల గోడలపై పోస్టర్లు అంటించారు. ‘రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో నానా ఇబ్బందులు పడుతుంటే పత్తాలేని ప్రతిపక్ష నేత కేసీఆర్’ అని వాటిలో రాసి ఉంది. ఖమ్మంలో భారీ వరదల రోజు సీఎం, మంత్రులు ప్రజలను రక్షించకుండా ఎక్కడికి వెళ్లారన్న BRS ఆరోపణలకు కౌంటర్‌గా ఈ పోస్టర్లు వెలిసినట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.