News September 4, 2024

స్కాట్లాండ్‌ను ఊచకోత కోసిన ట్రావిస్ హెడ్

image

స్కాట్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ విధ్వంసం సృష్టించారు. 25 బంతుల్లోనే 80 రన్స్ బాదారు. 12 ఫోర్లు, 5 సిక్సర్లతో స్కాట్లాండ్ బౌలర్లను ఊచకోత కోశారు. ఈ క్రమంలో ఆసీస్ తరఫున హెడ్ (17 బంతుల్లో) ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించారు. హెడ్ ధాటికి 155 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 9.4 ఓవర్లలోనే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పవర్‌ప్లేలో 113 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించింది.

Similar News

News September 9, 2024

‘మేనన్’ నా ఇంటి పేరు కాదు: హీరోయిన్ నిత్య

image

విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నిత్యామేనన్ తన పేరు గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘మేనన్’ అనేది తన ఇంటి పేరు కాదని తెలిపారు. ‘నా అసలు పేరు ఎన్ఎస్ నిత్య. కులాన్ని పేర్లతో ముడిపెట్టడం నచ్చక మా కుటుంబంలో ఎవరూ ఇంటి పేరు వాడరు. నటిగా పలు చోట్లకు ప్రయాణాలు చేయాల్సి రావడంతో న్యూమరాలజీ ఆధారంగా పాస్‌పోర్టులో ‘మేనన్’ అని జత చేశాం’ అని చెప్పుకొచ్చారు.

News September 9, 2024

ఉత్తరాంధ్రలో కుండపోత వర్షాలు.. వివరాలు ఇవే

image

AP: నిన్నటి నుంచి ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిశాయి. సెప్టెంబర్ 8 ఉ.8.30 నుంచి 9వ తేదీ ఉ.8.30 గంటల వరకు వర్షపాతం వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో 115 నుంచి 204 మి.మీ వరకు వర్షం పడింది. శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వర్షపాతం వివరాలను పై ఫొటోలో చూడొచ్చు.

News September 9, 2024

మాస్క్‌డ్ ఆధార్ కార్డు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

image

*https://uidai.gov.in/en/లోకి వెళ్లి My Aadhaar సెలక్ట్ చేసుకోవాలి.
*ఆధార్ నంబర్ నమోదు చేసి ఓటీపీ ఎంటర్ చేయాలి.
*చెక్ బాక్స్‌లో డౌన్‌లోడ్ మాస్క్‌డ్ ఆధార్‌పై టిక్ చేయాలి.
*సబ్మిట్ ఆప్షన్ నొక్కగానే మాస్క్‌డ్ ఆధార్ కార్డు డౌన్‌లోడ్ అవుతుంది.
>>ఇందులో ఆధార్‌లోని మొదటి 8 అంకెలు కనిపించకపోవడం వల్ల మోసపోయే అవకాశాలు తక్కువ.