news

News September 4, 2024

దీనస్థితిలో నటుడు.. సాయం కోసం కన్నీళ్లు

image

ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ మూవీల్లోనూ కామెడీ పండించే నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం దీనస్థితిలో ఉన్నారు. ఎన్నో సినిమాల్లో నటించినా వైద్యానికి డబ్బులు లేక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కిడ్నీలు పాడవడంతో గాంధీ ఆస్పత్రిలో డయాలసిస్ చేయిస్తున్నట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బీపీ, షుగర్ వల్ల ఆయన కాలికి ఇన్ఫెక్షన్ అయింది. తాను ఎందరికో సాయం చేశానని, ఇప్పుడు ఖర్చులకు కూడా డబ్బులు లేవని కన్నీరు పెట్టుకున్నారు.

News September 4, 2024

Stock Market: నష్టాల్ని తగ్గించుకున్న సూచీలు

image

భారీ పతనం నుంచి స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. సూచీలు మోస్తరు నష్టాల్లోనే ముగిశాయి. ఉదయం 180 పాయింట్లు పతనమైన నిఫ్టీ 81 పాయింట్ల నష్టంతో 25,198 వద్ద క్లోజైంది. 600 పాయింట్ల పతనం నుంచి కోలుకున్న సెన్సెక్స్ 202 పాయింట్లు ఎరుపెక్కి 82,384 వద్ద స్థిరపడింది. ఏషియన్ పెయింట్స్, గ్రాసిమ్, HUL, అల్ట్రాటెక్ సెమ్, సన్ ఫార్మా టాప్ గెయినర్స్. విప్రో, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, హిందాల్కో, LTIM టాప్ లూజర్స్.

News September 4, 2024

రియల్ హీరోస్..

image

భారీ వరదలతో రెండు తెలుగు రాష్ట్రాలు చిగురుటాకులా వణికాయి. ఈ సమయంలో బాధితులను ఆదుకునేందుకు సినీ హీరోలు, నటులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. పవన్ రూ.6 కోట్లు, ప్రభాస్ రూ.2 కోట్లు, నందమూరి బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ తదితరులు తలో రూ.కోటి అందించారు. వరదలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు అండగా నిలిచిన టాలీవుడ్ స్టార్లను ఫ్యాన్స్ అభినందిస్తున్నారు.

News September 4, 2024

గ్యాస్ ట్రబుల్ రావొద్దంటే..

image

గ్యాస్ సమస్య నుంచి ఉపశమనానికి వైద్యులిస్తున్న సూచనలివే
* తిన్న కాసేపటికి వాకింగ్ వంటి తేలికపాటి ఎక్సర్‌సైజులు చేయడం * యోగా చేయడం * కడుపు నిమరడం * బొజ్జకు వేడి కాపడం * ఆహారంలో ఆయుర్వేద మూలికలు వాడటం * కొత్తిమీర, వాము, పార్స్‌లీ ఆకులు వాడటం * చేమంతి, అల్లం టీ తీసుకోవడం * ఫైబర్‌తో కూడిన ఆహారం తీసుకోవడం * చూయింగ్ గమ్ నమలొద్దు * తింటూ మాట్లాడొద్దు * కూల్‌డ్రింక్స్, స్మోకింగ్ మానేయడం * మెత్తగా నమలడం

News September 4, 2024

గ్యాస్ ట్రబుల్ వేధిస్తోందా: 2 కారణాలివే

image

తక్కువ శారీరక శ్రమ, మారిన జీవనశైలి ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. అందులో ఒకటి గ్యాస్. చెప్పుకోవడానికి చిన్నదే కానీ పెట్టే ఇబ్బంది మాత్రం పెద్దదే. మీకు తెలుసా! మలద్వారం, నోటి నుంచి రోజుకు 13-21 సార్లు గ్యాస్ విడుదల చేస్తారట. ఈ సమస్యకు 2 కారణాలు. తినేటప్పుడు, తాగేటప్పుడు గాలిని మింగడం మొదటిది. పెద్దపేగులో పిండిపదార్థాలను బ్యాక్టీరియా జీర్ణం చేసే ప్రక్రియలో వాయువుల చర్యతో గ్యాస్ రావడం రెండోది.

News September 4, 2024

వరద బాధితులకు నాగార్జున రూ.కోటి సాయం

image

వరదలతో అతలాకుతలమైన రెండు తెలుగు రాష్ట్రాలకు సినీ హీరో నాగార్జున రూ.కోటి సాయం ప్రకటించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఇరు రాష్ట్రాలకు చెరో రూ.50 లక్షలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు వైజయంతీ మూవీస్ రూ.20 లక్షలు విరాళం ప్రకటించింది. అలాగే కమెడియన్ అలీ ఇరు రాష్ట్రాలకు చెరో రూ.3 లక్షల చొప్పున రూ.6 లక్షలు అందించారు.

News September 4, 2024

అలాంటి వారిని అమరావతిలో పూడ్చాలి: చంద్రబాబు

image

AP: అధికారులను బురదలో దించి పని చేయిస్తుంటే కొంతమంది ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని CM చంద్రబాబు ఫైర్ అయ్యారు. తప్పుడు ప్రచారం చేస్తున్నవారిని అమరావతిలో పూడ్చేయాలని ధ్వజమెత్తారు. ‘బాధితులకు రాజకీయ, సినీ ప్రముఖులు సాయం చేస్తున్నారు. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. ఇలాంటి సమయంలో అమరావతి మునిగిందని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారిని సంఘ బహిష్కరణ చేయాలి’ అని మండిపడ్డారు.

News September 4, 2024

పారాలింపిక్స్‌లో ఇండియాకు 21 మెడల్స్

image

పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. తాజాగా షాట్ పుట్‌లో సచిన్‌ ఖిలారి సిల్వర్ మెడల్ సాధించారు. దీంతో 30 ఏళ్లలో పారాలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత తొలి పురుష షాట్‌పుటర్‌గా సచిన్ నిలిచారు. ఈ పారాలింపిక్స్‌లో భారత్ 21 మెడల్స్ సాధించి టేబుల్‌లో 19వ స్థానానికి చేరింది. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ పారా అథ్లెట్లతో ఫోన్‌లో మాట్లాడి అభినందించారు.

News September 4, 2024

హైడ్రా విషయంలో రేవంత్ కరెక్ట్: పవన్ కళ్యాణ్

image

AP: హైడ్రా ద్వారా అక్రమ నిర్మాణాలను కూల్చడం సమంజసమేనని dy.CM పవన్ కళ్యాణ్ అన్నారు. హైడ్రా ఏర్పాటు చేసి తెలంగాణ CM రేవంత్ రెడ్డి మంచి పని చేశారని ప్రశంసించారు. విజయవాడలో పవన్ మీడియాతో మాట్లాడారు. ‘హైదరాబాద్‌లోని చెరువుల్లో ఇళ్లు కడుతుంటే బాధేసేది. ఇప్పుడు రేవంత్ వాటిని తొలగించడం సంతోషంగా ఉంది. అసలు అక్రమ నిర్మాణాలను ముందే అడ్డుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు’ అని ఆయన పేర్కొన్నారు.

News September 4, 2024

భారీ వరదలు.. ఇలా విరాళమివ్వండి!

image

TG: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షం కురిసి ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వరదలు తలెత్తడంతో జనజీవనం స్తంభించింది. వరదల వల్ల రూ.వేల కోట్ల నష్టం వాటిల్లగా ఎన్నో కుటుంబాలు కట్టు బట్టలతో ఇంటిని వదిలేయాల్సి వచ్చింది. ఈక్రమంలో వరద బాధితులకు సాయం చేసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ముందుకొస్తున్నారు. అయితే, నష్టం భారీ ఎత్తున ఉండటంతో సాయం చేయాలని ప్రజలకు సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ఇలా <>సాయం<<>> చేయండి.