News September 4, 2024
అలాంటి వారిని అమరావతిలో పూడ్చాలి: చంద్రబాబు
AP: అధికారులను బురదలో దించి పని చేయిస్తుంటే కొంతమంది ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని CM చంద్రబాబు ఫైర్ అయ్యారు. తప్పుడు ప్రచారం చేస్తున్నవారిని అమరావతిలో పూడ్చేయాలని ధ్వజమెత్తారు. ‘బాధితులకు రాజకీయ, సినీ ప్రముఖులు సాయం చేస్తున్నారు. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. ఇలాంటి సమయంలో అమరావతి మునిగిందని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారిని సంఘ బహిష్కరణ చేయాలి’ అని మండిపడ్డారు.
Similar News
News September 17, 2024
ఆర్టికల్ 370పై కాంగ్రెస్ సైలెంట్!
ఆర్టికల్ 370 అమలుపై కాంగ్రెస్ సైలెంట్ అయింది. పార్టీ అభ్యర్థులు, నేతలు మాట్లాడుతున్నా జమ్మూకశ్మీర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో మాత్రం ప్రస్తావించలేదు. పూర్తిస్థాయి రాష్ట్ర హోదా, ప్రభుత్వ ఉద్యోగాలు, టెండర్లు, భూమి, వనరుల కేటాయింపుల్లో స్థానికులకు ప్రయారిటీ ఇస్తామంది. స్త్రీలకు నెలకు రూ.3000, నిరుద్యోగులకు రూ.3500, రూ.25 లక్షల బీమా, లక్ష ఉద్యోగాల కల్పన, KG ఆపిల్ మద్దతు ధర రూ.72 వంటి హామీలిచ్చింది.
News September 17, 2024
రేవంత్ ‘కంప్యూటర్’ కామెంట్స్‌పై KTR సెటైర్లు
TG: CM రేవంత్ <<14117106>>వ్యాఖ్యలపై<<>> చిట్టినాయుడు సుభాషితాలు అంటూ KTR సెటైర్లు వేశారు. ‘కంప్యూటర్ కనిపెట్టింది రాజీవ్ కాదు చార్లెస్ బాబేజీ. దేశానికి కంప్యూటర్ పరిచయం చేసిందీ రాజీవ్ కాదు. TIFRAC వారు 1956లో ఇక్కడ కంప్యూటర్ సేవలు ప్రారంభించారు. రాజీవ్‌కు అప్పటికి 12ఏళ్లు. నోటికొచ్చింది వాగి దొరికిపోవడం ఎందుకు? నీకు బాగా తెలిసిన రియల్టీ దందాలు, బ్లాక్ మెయిల్‌కి పరిమితమైతే మంచిదమ్మా చిట్టి’ అని ట్వీట్ చేశారు.
News September 17, 2024
రిలీజ్‌కు ముందే చరిత్ర సృష్టించిన ‘దేవర’
జూ.ఎన్టీఆర్, జాన్వీ జంటగా నటించిన ‘దేవర’ మూవీ చరిత్ర సృష్టించింది. అమెరికా అడ్వాన్స్ ప్రీమియర్ టికెట్ సేల్స్‌లో అత్యంత వేగంగా $1.75M సాధించిన తొలి భారతీయ చిత్రంగా నిలిచినట్లు మేకర్స్ వెల్లడించారు. అలాగే 10 రోజుల్లోనే 45 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయినట్లు తెలిపారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానున్న విషయం తెలిసిందే. ట్రైలర్, పాటలు మూవీపై అంచనాలను పెంచేశాయి.