India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానంలో ఉపఎన్నికకు 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియగా 11 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఈ స్థానంలో ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. బ్యాలెట్ పేపర్ ద్వారా ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. 605 పోలింగ్ కేంద్రాల్లో 4.63 లక్షల మంది ఓటర్లున్నారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
భిన్న వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు IMD గుడ్ న్యూస్ చెప్పింది. మరో నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకుతాయని తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో నాలుగు రోజుల్లో ఏపీలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ ఉమ్మడి తూ.గో., ప.గో., కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.
మాల్దీవులతో సంబంధాలు క్షీణించినా భారత్ ఆపన్న హస్తం అందించింది. ఆ దేశ ప్రభుత్వ ప్రత్యేక వినతి మేరకు 50 మిలియన్ యూఎస్ డాలర్ల సాయాన్ని మరో ఏడాది పొడిగించింది. SBI ట్రెజరరీ బిల్స్ రూపంలో సున్నా శాతం వడ్డీకి ఈ నిధులు మంజూరు చేసింది. రెండు దేశాల మధ్య ఉన్న దీర్ఘకాలిక స్నేహానికి ఇది చిహ్నం అని మాల్దీవుల విదేశాంగ మంత్రి జమీర్ తెలిపారు. ఈ నిధులతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకుంటామన్నారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో MLC కవితపై ED దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ విచారణ జరపనుంది. సోమవారమే దీనిపై విచారణ జరగాల్సి ఉండగా, అనివార్య కారణాలతో నేటికి వాయిదా పడింది. ఈనెల 10న 200 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసిన ED.. అందులో చారియట్ ప్రొడక్షన్స్ మీడియా ఉద్యోగులు దామోదర్, ప్రిన్స్, చన్‌ప్రీత్‌తో పాటు అర్వింద్‌సింగ్ అనే వ్యక్తిని నిందితులుగా చేర్చింది.
ఇవాళ విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. విశాఖపట్నం నుంచి సాయంత్రం 04:15 గంటలకు బయల్దేరే స్పెషల్ ట్రైన్(08589) రేపు ఉదయం 6:15కి సికింద్రాబాద్ చేరుకోనుంది. తిరిగి సికింద్రాబాద్ నుంచి రైలు(08590) రేపు ఉదయం 10:30 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 11:30కి విశాఖ చేరుతుందని పేర్కొంది.
జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ లోక్‌సభ స్థానంలో రాత్రి వరకు 37.98శాతం పోలింగ్ నమోదైంది. 35 ఏళ్లలో ఇదే గరిష్ఠమని అధికారులు తెలిపారు. ఈ ఓటింగ్‌పై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 రద్దుపై ప్రజల నుంచి వచ్చిన స్పందనకు నిదర్శనమన్నారు. గత ఎన్నికల్లో 14 శాతమే ఓటింగ్ జరిగింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత శ్రీనగర్‌లో తొలి ఎన్నిక ఇదే కావడం గమనార్హం.
జపాన్‌పై అమెరికా వేసిన రెండు అణుబాంబుల్ని తట్టుకుని బతికిన మృత్యుంజయుడు త్సుటోము యమగుచి. హిరోషిమాపై తొలిబాంబు పడే రోజు బాంబు పేలడాన్ని ముందుగానే చూసి డ్రైనేజీలో దూకారు. అయినా సరే ఒళ్లంతా కాలిపోయింది. అక్కడి నుంచి బయటపడి తన స్వస్థలమైన నాగసాకిలో ఆస్పత్రిలో చేరారు. రెండ్రోజులకు అక్కడా బాంబు దాడి జరిగింది. అదృష్టం కొద్దీ మళ్లీ బతికారు. సుదీర్ఘకాలం జీవించిన యమగుచి, 2010లో క్యాన్సర్ కారణంగా చనిపోయారు.
AP: రాష్ట్రంలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. అర్ధరాత్రి దాటిన తరువాత కూడా వివిధ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగింది. పాయకరావుపేట, కళ్యాణదుర్గం, సర్వేపల్లి, చింతలపూడి, మచిలీపట్నంలలో తేదీ మారడంతో మళ్లీ మాక్ పోలింగ్ నిర్వహించి, ఓటింగ్ కొనసాగించాల్సి వచ్చింది. రాత్రి 10 గంటల తర్వాత 3,500 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగింది. ఈ సారి రికార్డు స్థాయిలో 80% పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని అంచనా.
ఏపీలో నిన్న అర్ధరాత్రి వరకు 78.25శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ పేర్కొంది. అత్యధికంగా అమలాపురం(SC) లోక్‌సభ స్థానానికి 83.19శాతం ఓటింగ్ నమోదైంది. అత్యల్పంగా విశాఖపట్నంలో 68% శాతం ఓటింగ్ జరిగింది. మరోవైపు అసెంబ్లీ స్థానాల్లో అత్యధికంగా ధర్మవరంలో 88.61%, అత్యల్పంగా పాడేరులో 55.45% పోలింగ్ నమోదైంది. ఇవాళ సాయంత్రం కల్లా ఈసీ పూర్తి వివరాలు వెల్లడించనుంది.
AP: రాష్ట్ర ఎన్నికల్లో గెలుపోటములను మహిళామణులు శాసించనున్నారు. పార్టీల భవితవ్యం వారి చేతిలోనే ఉందంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలో పురుష ఓటర్ల సంఖ్య 2,03,39,851 కాగా.. మహిళా ఓటర్ల సంఖ్య 2,10,58,615గా ఉంది. ఓటర్ల సంఖ్యలోనే కాక పోల్ అయిన ఓట్లలోనూ మహిళలవే అధికం. దీంతో వారు ఎటువైపు మొగ్గితే ఫలితాలు కూడా అటే అనుకూలంగా ఉంటాయన్న అంచనాలున్నాయి. మరి వారి తీర్పు ఎలా ఉండనుందో చూడాలి.
Sorry, no posts matched your criteria.