News September 3, 2024
ఎవరు ఎన్ని గంటలు నిద్రపోవాలి?
యూఎస్‌లోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) వయసుల వారీగా నిద్రపోయే విషయంలో కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. నవజాత శిశువులు: 14-17 గంటలు*శిశువులు: 12-16 గంటలు*పసిబిడ్డలు: 11-14 గంటలు*ప్రీస్కూలర్లు: 10-13 గంటలు*పాఠశాల వయస్సు పిల్లలు: 9-12 గంటలు*టీనేజర్స్: 8-10 గంటలు*యువకులు-పెద్దలు (18-60 ఏళ్లు): 7 లేదా అంతకంటే ఎక్కువ *60+ వాళ్లు 7-9 గంటలు నిద్రపోవాలని సూచించింది.
Similar News
News September 19, 2024
ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చండి: షర్మిల
AP: తిరుమలను అపవిత్రం చేస్తూ TDP, YCPలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఫైరయ్యారు. ‘లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారన్న CBN వ్యాఖ్యలు తిరుమల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయి. మీ ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే తక్షణం ఉన్నతస్థాయి కమిటీ వేయండి. లేదా CBIతో విచారణ జరిపించండి. ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చండి’ అని ట్వీట్ చేశారు.
News September 19, 2024
సీబీఐ విచారణ వేయండి: అంబటి రాంబాబు
AP: తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు దుర్మార్గపు ఆరోపణ చేయడం సరికాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘రాజకీయ లబ్ధి కోసం మరీ ఇంత నీచానికి దిగజారుతావా చంద్రబాబు’ అని వైసీపీ ట్వీట్ చేసింది. కాగా, నెయ్యికి బదులు జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారుచేశారని చంద్రబాబు నిన్న వ్యాఖ్యానించారు.
News September 19, 2024
పోలీసుల అదుపులో జానీ మాస్టర్
అసిస్టెంట్ డాన్సర్‌పై అత్యాచారం కేసులో పరారీలో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీసులకు చిక్కారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు అతడిని బెంగళూరు విమానాశ్రయం సమీపంలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. నేరుగా ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మరోవైపు మహిళా కమిషన్ ఆదేశాలతో బాధితురాలికి భద్రతను పెంచారు.