India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రాష్ట్రంలో 76 మంది తహశీల్దార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీ జోన్1లో 37 మంది, మల్టీజోన్ 2లో 39 మందిని ట్రాన్స్‌ఫర్ చేసింది.
AP: విజయవాడలో వరద బాధితులకు ప్రభుత్వం ఆహారం, పాలు, నీళ్లు అందిస్తున్నా క్షేత్రస్థాయిలో కొందరు వాటిని సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. హెలికాప్టర్ల ద్వారా జారవిడుస్తున్న ఆహారాన్ని కొందరు ఎక్కువ మోతాదులో తీసుకెళ్లి అమ్ముకుంటున్నారని, దీంతో అందరికి అందడం లేదని ఆరోపిస్తున్నారు. లీటర్ వాటర్ బాటిల్ రూ.100, పాల ప్యాకెట్ రూ.150కు అమ్ముతున్నారని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
TG: ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి ORR పరిధిలోని గ్రామాలను విలీనం చేసింది. పెద్దఅంబర్ పేటలో కుత్బుల్లాపూర్, తారామతి పేట, బాచారం, గౌరెల్లి పంచాయతీలు, శంషాబాద్‌లో బహదూర్ గూడ, పెద్ద గోల్కొండ, రషీద్ గూడ, ఘంసీమిగూడ గ్రామాలను విలీనం చేసింది.
1999 కాందహార్ హైజాక్ ఉదంతంలో లాహోర్‌లో ఉండగా ఇంధన కొరతతో ఫ్లైట్ క్రాష్ ల్యాండింగ్‌కు సిద్ధపడినట్లు అప్పటి కెప్టెన్ దేవీ శరణ్ చెప్పారు. IC 814 వెబ్ సిరీస్ విడుదల సందర్భంగా అప్పటి పరిస్థితులను ఆయన గుర్తు చేసుకున్నారు. లాహోర్‌లో ల్యాండింగ్‌కి క్లియరెన్స్ రాకపోవడంతో తనకు వేరే దారి కనిపించలేదన్నారు. ఒకటిన్నర నిమిషాలకు సరిపడా ఇంధనమే ఉన్న స్థితిలో అనూహ్యంగా క్లియరెన్స్ వచ్చిందన్నారు.
AP: ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలు, వరద తీవ్రత దృష్ట్యా రేపు స్కూళ్లకు సెలవు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖాధికారి సుబ్బారావు తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలతో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
టెస్టుల్లో 10వేల పరుగులు చేయకపోతే రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సిగ్గుపడాలని చెప్పినట్లు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ గుర్తు చేశారు. టెస్టుల్లో వెస్టిండీస్‌పై విరాట్ అరంగేట్రం చేసిన సమయంలో అతనితో మాట్లాడినట్లు తెలిపారు. ఒకవేళ కోహ్లీ 10 వేల రన్స్ పూర్తి చేయకపోతే అది అతని తప్పే అవుతుందని చెప్పానని పేర్కొన్నారు. ఇప్పటివరకు 113 టెస్టులాడిన కింగ్ 8,848 పరుగులు చేశారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ రాత్రి, రేపు ఉదయం వరకు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటూ హెచ్చరికలు జారీ చేసింది.
UV కిరణాల నుంచి రక్షణ పొందేందుకు సన్ స్క్రీన్ వాడుతుంటారు. అయితే, కొన్ని క్రీమ్స్‌లో వాడే రసాయనాలు క్యాన్సర్ కారకాలుగా మారుతున్నట్లు షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. బెంజీన్ రసాయనం ఉండే సన్ స్క్రీన్ వాడితే లుకేమియా, లింఫోమా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఓ నివేదికలో వెల్లడైంది. వీటిని కొనేటప్పుడు ఈ అంశాలను గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. SPF 30+ ఉంటేనే UV కిరణాల నుంచి రక్షణ లభిస్తుంది.
UPలోని బహ్రైచ్ జిల్లాలో తప్పించుకు తిరుగుతున్న 2 తోడేళ్లు కనిపిస్తే కాల్చేయాల్సిందిగా అటవీ అధికారులను CM యోగీ ఆదిత్యనాథ్ ఆదేశించారు. 8 మందిని బలితీసుకున్న తోడేళ్లను పట్టుకోవడానికి అధికారులు ఆపరేషన్ భేదియాను ప్రారంభించారు. 4 తోడేళ్లను పట్టుకున్నారు. అయితే, మిగిలిన రెండింటిని పట్టుకోవడం కష్టతరమవుతోంది. దీంతో అవి కనిపిస్తే కాల్చేయాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు.
TG: మహబూబాబాద్‌లో వరదలకు కొట్టుకుపోయిన ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. రేపటి నుంచి యథావిధిగా రైళ్ల రాకపోకలు సాగనున్నాయి. ఇంటికన్నె వద్ద ట్రాక్ కొట్టుకుపోగా రెండు రోజులు శ్రమించిన రైల్వే సిబ్బంది పునరుద్ధరించారు. రేపటి నుంచి రైళ్ల వేగం తగ్గించి నడపాలని అధికారులు నిర్ణయించారు.
Sorry, no posts matched your criteria.