News September 3, 2024
మున్సిపాలిటీల్లో 51 గ్రామాలు విలీనం
TG: ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి ORR పరిధిలోని గ్రామాలను విలీనం చేసింది. పెద్దఅంబర్ పేటలో కుత్బుల్లాపూర్, తారామతి పేట, బాచారం, గౌరెల్లి పంచాయతీలు, శంషాబాద్‌లో బహదూర్ గూడ, పెద్ద గోల్కొండ, రషీద్ గూడ, ఘంసీమిగూడ గ్రామాలను విలీనం చేసింది.
Similar News
News September 19, 2024
ఈ నెల 21న సీఎంగా ఆతిశీ ప్రమాణం
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21న ఆమె సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆతిశీతో పాటు మంత్రులు కూడా అదే రోజు ప్రమాణం చేస్తారని ఆప్ తెలిపింది. కాగా మంగళవారం అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు. తదుపరి ముఖ్యమంత్రిగా ఆతిశీని ప్రకటించారు.
News September 19, 2024
కోడలిపై లైంగిక వేధింపులు.. భద్రాచలం ప్రధాన అర్చకుడిపై వేటు
TG: కోడలిని లైంగిక వేధింపులకు గురి చేసిన భద్రాచలం ఆలయ ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యులు, ఆయన దత్త పుత్రుడిపై వేటు పడింది. APలోని ప.గో.లో ఆయనపై కేసు నమోదవ్వగా తెలంగాణ దేవాదాయశాఖ చర్యలకు దిగింది. సీతారామకు కొడుకులు లేకపోవడంతో వెంకట సీతారాంను దత్తత తీసుకుని తాడేపల్లి గూడెంకు చెందిన యువతితో పెళ్లి చేశారు. ఈ క్రమంలో తన పోలికలతో వారసుడు కావాలని కోడలిని వేధించగా ఆమె పోలీసులను ఆశ్రయించింది.
News September 19, 2024
‘దేవర’ రన్ టైమ్ ఎంతంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ ఈనెల 27న రిలీజ్ కానుంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలయ్యే ఈ సినిమా టైటిల్ & ఎండ్ క్రెడిట్స్ కాకుండా 2 గంటల 42 నిమిషాల నిడివితో ఉంటుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచగా మరింత హైప్ ఇచ్చేందుకు మేకర్స్ అన్ని భాషల్లో ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే HYDలో మూవీ ప్రీరిలీజ్ వేడుక ఉండే అవకాశం ఉంది.